Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్ తొలిసారి ఎప్పుడు వెళ్లిందో తెలుసా?

India vs South Africa: Full list of commentators for Sony TEN1, Sony TEN3 channels

హైదరాబాద్: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా బుధవారం దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. జనవరి 5న కేప్ టౌన్‌లో జరిగే తొలి టెస్టుతో ప్రారంభయ్యే ఈ సుదీర్ఘ పర్యటన ఫిబ్రవరి 24తో ముగియనుంది.

దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా అసలు టీమిండియా తొలిసారి దక్షిణాఫ్రికా పర్యటనకు ఎప్పుడు వెళ్లింది, ఇప్పటివరకు ఒక్క టెస్టు సిరిస్‌నైనా సఫారీ గడ్డపై భారత జట్టు విజయం సాధించిందా? అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు అభిమానులను ఊరిస్తున్నాయి.

మొట్టమొదటిసారి డిసెంబర్, 1992లో దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా వెళ్లింది. ఆ పర్యటనలో భారత జట్టు కెప్టెన్‌గా మహమ్మద్ అజారుద్దీన్, సఫారీ జట్టు కెప్టెన్‌గా కెప్లర్ వెసెల్స్ వ్యవహరించారు. డిసెంబర్ 26, 1992న ఇరు జట్ల మధ్య తొలి టెస్టు పోర్ట్ ఎలిజిబెత్ వేదికగా జరిగింది.

రెండు టెస్టు మ్యాచ్‌ల పర్యటనకు వెళ్లిన టీమిండియా 1-0తో ఈ సిరిస్‌లో ఓటమి పాలైంది. పోర్ట్ ఎలిజిబెత్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలవ్వగా, కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టును డ్రాగా ముగిసింది. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య ఆరు టెస్టు సిరిస్‌లు జరిగాయి.

ఈ ఆరు టెస్టు సిరిస్‌ల్లో టీమిండియా విజయం సాధించలేకపోవడం విశేషం. అయితే అప్పటి టీమిండియా వేరు. కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు టెస్టుల్లో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. నెంబర్ వన్ ర్యాంకు హోదాలో భారత జట్టు సఫారీ గడ్డపై ఆడుగుపెడుతోంది.

అంతేకాదు టెస్టుల్లో వరుసగా తొమ్మిది టెస్టు సిరిస్‌లను నెగ్గి ప్రపంచ రికార్డుని సమం చేసింది. దక్షిణాఫ్రికాలో జరగబోయే టెస్టు సిరిస్‌లో గనుక కోహ్లీసేన విజయం సాధిస్తే ప్రపంచ టెస్టు క్రికెట్‌లో ఓ చరిత్రను సృష్టిస్తుంది. వరుసగా పది టెస్టు సిరిస్ విజయాలను సొంతం చేసుకున్న జట్టుగా అవతరిస్తుంది.

కాగా, భారత్-దక్షిణాఫ్రికా సిరిస్‌కు సంబంధించి కామెంటేటర్స్ జాబితాను సోనీ టీవీ విడుదల చేసింది. ఈ జాబితాలో 1992లో దక్షిణాఫ్రికాలో పర్యటించిన జట్టులో సభ్యుడిగా ఉన్న సంజయ్ మంజ్రేకర్ కూడా ఉన్నాడు. ఈ సిరిస్‌కు సంబంధించి అటు ఇంగ్లీషుతో పాటు హిందీలో కూడా కామెంటేటరీని అభిమానులు విననున్నారు.

భారత్-దక్షిణాఫ్రికా సిరిస్‌కు సంబంధించి కామెంటేటర్ల జాబితా:
1. సంజయ్ మంజ్రేకర్
2. అజయ్ జడేజా
3. ఆర్పీ సింగ్
4. మురళి కార్తీక్
5. హర్షా బోగ్లే
6. దీప్ దాస్ గుప్తా
7. వివేక్ రాజదాన్
8. జోంటీ రోడ్స్

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 26, 2017, 17:53 [IST]
Other articles published on Dec 26, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+