India vs South Africa: టెస్టుల్లో ఉమేశ్ యాదవ్ వేసిన 4 అత్యుత్తమ స్పెల్స్ ఇవే!

హైదరాబాద్: గాయం కారణంగా దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా దూరం కావడంతో కోహ్లీసేనకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గత కొంతకాలంగా టీమిండియా ప్రధాన పేసర్‌గా బుమ్రా సొంతగడ్డపై సఫారీలతో జరుగుతున్న టెస్టు సిరిస్‌కు దూరం కావడంతో అతడి స్థానంలో సెలక్టర్లు ఉమేశ్ యాదవ్‌ను ఎంపిక చేశారు.
బుమ్రా స్థానంలో సఫారీ సిరిస్‌కు ఎంపికైన ఉమేశ్ యాదవ్ చివరగా గత డిసెంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఆడాడు. ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోయాడు. విండిస్ పర్యటనకు ఎంపికైనా తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు తరుపున ఆడుతున్నాడు.
దక్షిణాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు బుమ్రా లేని లోటు తీర్చలేనిది అయినప్పటికీ... ఉమేశ్ యాదవ్‌ని బౌలర్‌గా అంత తేలిగ్గా కొట్టిపారేయకూడదు. ఎందుకంటే గతంలో ఉమేశ్ యాదవ్ టీమిండియా సాధించిన అనేక విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఉమేశ్ యాదవ్ ఉత్యత్తమ స్పెల్స్‌ను ఒక్కసారి పరిశీలిద్దాం...

4/41 vs వెస్టిండిస్, 2016
ఉమేశ్ యాదవ్ భారత పేస్ బౌలింగ్ దళంలో అత్యుత్తమ బౌలర్ అనడానికి ఈ స్పెల్ ఉదాహరణ. ఆంటిగ్వా వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 566 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండిస్ జట్టుని భారత బౌలర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ తన బౌలింగ్‌తో తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఏడు వికెట్లు తీయడంతో ఈ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో విజయం సాధించింది.

4/32 vs ఆస్ట్రేలియా, 2017
భారత క్రికెట్ అభిమానులకు ఉమేశ్ యాదవ్ సొంతగడ్డపై ఎలా చెలరేగగలడో నిరూపించిన స్పెల్ ఇది. పూణె వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఉమేశ్ యాదవ్ చెలరేగడంతో ఆస్ట్రేలియా 260 పరుగులకే ఆలౌటైంది. అయితే, భారత బ్యాట్స్‌మెన్లు విఫలం కావడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 333 పరుగుల తేడాతో విజయం సాధించింది.

5/93 vs ఆస్ట్రేలియా, 2012
ఈ మ్యాచ్‌లో టెస్టుల్లో ఉమేశ్ యాదవ్ తొలిసారి ఐదు వికెట్లు సాధించాడు. పెర్త్‌లోని వాకా స్టేడియంలో ఉమేశ్ యాదవ్ నిప్పులు చెరిగే బంతులో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో ఉమేశ్ యాదవ్ తన గుడ్ పేస్‌తో రికీ పాంటింగ్, షాన్ మార్ష్‌ను సింగిల్ డిజిట్‌కే ఔట్ చేశాడు. ఉమేశ్ స్పెల్ కారణంగానే ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించలేకపోయింది. అయితే, ఆస్ట్రేలియా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొనడంలో భారత బ్యాట్స్‌మెన్ బోల్తా పడటంతో టీమిండియా ఇన్నింగ్స్ 37 పరుగుల తేడాతో ఓడిపోయింది.

6/88 an 4/45 vs వెస్టిండిస్, 2018
గతేడాది హైదారాబాద్ వేదికగా జరిగిన ఈ టెస్టులో ఉమేశ్ యాదవ్ పేస్‌ను ఎదుర్కొలేక వెస్టిండిస్ ఓటమిపాలైంది. సొంతగడ్డపై ఉమేశ్ యాదవ్ తన సత్తా చాటిన మరో స్పెల్ ఇది. ఈ టెస్టులో వెస్టిండిస్ స్టార్ ప్లేయర్లు షాయ్ హోప్, జాసన్ హోల్డర్, సెంచరీ సాధించిన రోస్టన్ ఛేజ్, షేన్ డోర్విచ్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్... రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications