
హైదరాబాద్: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ భారత్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. డర్బన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో డుప్లెసిస్ చేతి వేలికి గాయమైన సంగతి తెలిసిందే. వన్డే అనంతరం నిర్వహించిన పరీక్షల్లో చేతి వేలులో పగులు ఏర్పడిందని తేలింది.
దీంతో అతడు కోలుకోవడానికి ఆరు వారాలు పట్టొచ్చని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తెలిపింది. కాగా, డుప్లెసిస్ స్థానంలో ఫర్హాన్ బెహార్డిన్‌ను జట్టులోకి తీసుకోనున్నారు. మిగతా వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా ఎవర్ని నియమిస్తారనే విషయం శనివారం తేలనుంది. గాయం కారణంగా డివిలియర్స్ ఇప్పటికే తొలి మూడు వన్డేలకు దూరమైన సంగతి తెలిసిందే.
ఆరు వన్డేల సిరిస్‌లో భాగంగా డర్బన్‌లో జరిగిన తొలి వన్డేలో డుప్లెసిస్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య ఆదివారం (ఫిబ్రవరి 4)న సెంచూరియన్ వేదికగా రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో విజయం సాధించడంతో కోహ్లీసేన 1-0 ఆధిక్యంలో నిలిచింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.