Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీసేన టెస్టు సిరిస్‌ను గెలవలేదు

India vs South Africa: Don’t see India winning the Test series, says Lance Klusener

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను కోహ్లీసేన నెగ్గడం ఎంతో కష్టమని దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌, జింబాబ్వే బ్యాటింగ్‌ కోచ్‌ లాన్స్‌ క్లూసెనర్‌ అన్నాడు. కేప్ టౌన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలై ఈ సిరిస్‌లో తన అవకాశాలను కోల్పోయిన సంగతి తెలిసిందే.

సెంచూరియన్‌ వేదికగా ఇరు జట్ల మధ్య శనివారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో క్లూసెనర్‌ మాట్లాడుతూ మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో చురకత్తుల్లాంటి బంతులు విసిరే నలుగురు పేసర్లను ఎదుర్కొని బ్యాటింగ్‌ చేయడం చాలా కష్టమని పేర్కొన్నారు.

అయితే 1-0తో ఓటమి, లేదంటే 1-1తో సిరీస్‌ సమం కావొచ్చని క్లూసెనర్ అభిప్రాయపడ్డాడు. అది కూడా మిగతా రెండు టెస్టుల్లో కోహ్లీసేన భారీ లక్ష్యాన్ని ఆతిథ్య దక్షిణాఫ్రికా ముందుంచితేనే సాధ్యమని చెప్పుకొచ్చాడు. అయితే గతంతో పోలిస్తే భారత పేసర్ల దాడిలో తీవ్రత పెరిగిందని పేర్కొన్నాడు.

'గతంలో ఇక్కడికొచ్చిన భారత పేసర్లు బౌన్సర్లు విసిరేవారు. ఈ సారి మాత్రం ఫుల్ లెంగ్త్‌తో బంతులు విసురుతున్నారు. తమ ప్రణాళికలను అద్భుతంగా అమలు చేస్తున్నారు' అని ప్రశంసల వర్షం కురిపించాడు. మరోవైపు సెంచూరియన్ టెస్టులో భారత్ విజయం సాధించాలంటే కెప్టెన్ కోహ్లీ తప్పక పరుగులు చేయాల్సి ఉంటుందని అన్నాడు.

'కేప్‌టౌన్‌ టెస్టులో విరాట్‌ కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 33 పరుగులు చేశాడు. అతనితో పాటు మిగతా బ్యాట్స్‌మెన్లు పూర్తిగా విఫలమయ్యారు. తదుపరి రెండు టెస్టులో భారత్‌ విజయం సాధించాలాంటే కోహ్లీ పరుగులు తప్పక చేయాలి. కోహ్లీ పరుగులు చేయలేకపోతే జట్టులోని మిగత సభ్యుల్లో ఆందోళన మొదలౌతుంది' అని అన్నాడు.

'జట్టులో గొప్ప ఆటగాడే పరుగులు చేయలేకపోయాడు.. ఇక మేమేం చేస్తాం అన్న ఆలోచన వారి మెదడులో తిరుగుతుంది. ఈ కారణంతోనే వారు ఆడలేకపోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కోహ్లీ మిగతా రెండు టెస్టుల్లో జట్టును ముందుకు నడిపించాల్సి ఉంది. ఈ విషయంలో కోహ్లీ విజయం సాధిస్తాడన్న నమ్మకం నాకుంది' అని క్లూసెనర్‌ పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే విదేశీ గడ్డపై పరిస్థితులకు అలవాటు పడాలంటే సన్నాహక మ్యాచ్‌లు ఆడితేనే బాగుంటుంది. టీమిండియా ఆ మ్యాచ్‌ను ఎందుకు రద్దు చేసుకుందో తనకు ఇప్పటికీ తెలియదని క్లూసెనర్ అన్నాడు. దక్షిణాఫ్రికా ఉపఖండంలో అడుగుపెడితే కచ్చితంగా సన్నాహక మ్యాచ్‌లు ఆడుతుందని క్లూసెనర్‌ అన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 11, 2018, 13:37 [IST]
Other articles published on Jan 11, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+