Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వణుకు పుట్టాలి: కోహ్లీసేన కోసం కేప్ టౌన్‌కు సెంచూరియన్ పిచ్ క్యూరేటర్

India vs South Africa: Centurion Curator Called In at Cape Town to Prepare Green Top to Test Kohli & Co

హైదరాబాద్: కోహ్లీసేన కోసం దక్షిణాఫ్రికా బౌన్సీ పిచ్‌లను తయారు చేస్తోందనడానికి మరో నిదర్శం. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్ టౌన్ వేదికగా తొలి టెస్టు శుక్రవారం (జనవరి 5)న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కోహ్లీసేన వీక్‌నెస్‌పై కొట్టాలని దక్షిణాఫ్రికా చూస్తోంది.

ఇందులో భాగంగా తొలి టెస్ట్ జరిగే కేప్‌టౌన్‌కు సెంచూరియన్ పిచ్ క్యూరేటర్‌ చేత పిచ్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. స్థానిక పిచ్ క్యూరేటర్ ఇవాన్ ఫ్లింట్‌కు పేస్ పిచ్ తయారీలో సహకరించాల్సిందిగా సెంచూరియన్ క్యూరేటర్ బ్రయిన్ బ్లాయ్‌ను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆదేశించింది. సెంచూరియన్ పిచ్ దక్షిణాఫ్రికాలోనే పేస్ పిచ్‌గా నిలిచింది.

ఇక్కడ జరిగిన చివరి మూడు టెస్టుల్లో మొత్తం 93 వికెట్లు నేలకూలగా.. అందులో పేస్ బౌలర్లే 83 వికెట్లు తీసుకున్నారంటే సెంచూరియన్ పిచ్‌ని అర్ధం చేసుకోండి. ఇక, తొలి టెస్టు జరిగే కేప్‌టౌన్‌లో జరిగిన చివరి మూడు టెస్టుల్లో 81 వికెట్లకుగాను 59 వికెట్లను మాత్రమే పేస్ బౌలర్లు పడగొట్టారు.

దక్షిణాఫ్రికా జట్టులో తలను తాకేలా బంతులు విసిరే కలిగే బౌలర్లు ఉన్నారు. దీంతో తొలి టెస్టులోనే తమ బౌలింగ్‌తో భారత బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తిస్తామని దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసెస్ ఇప్పటికే మీడియా సమావేశంలో చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా తొలి టెస్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.

ఇందులో భాగంగా తమకు అనుకూలంగా ఉండే పిచ్‌ను రూపొందించడానికి గాను సెంచూరియన్ క్యూరేటర్‌ను రంగంలోకి దింపారు. దీనిపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ 'సొంత జట్టుకు తగినట్లు పిచ్‌లు తయారు చేయడం కామనే కదా' అని చెప్పుకొచ్చాడు. మూడేళ్ల కిందట భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగింది ఇదే కదా అని ఆయన అన్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 4, 2018, 18:27 [IST]
Other articles published on Jan 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+