India vs South Africa 3rd T20I: మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ జరిగే అవకాశం 50-50

బెంగళూరు: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ ఈ రోజు రాత్రి 7 గంటలకు చివరిదైన మూడో టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. ధర్మశాలలో జరగాల్సిన మొదటి మ్యాచ్ వర్షార్పణం అయిన విషయం తెలిసిందే. రెండో మ్యాచ్‌లో మాత్రం టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది.

మ్యాచ్‌కు వర్షం ముప్పు:
తొలి మ్యాచ్‌కు అడ్డుపడ్డ వరణుడు చివరి మ్యాచ్‌కు కూడా అడ్డుపడనున్నాడని సమాచారం తెలుస్తోంది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ర్పడిన అల్పపీడనం కారణంగా ఆదివారం మొత్తం ఆకాశం దట్టమైన మేఘాలతో ఉండనుంది. అలాగే ఉరుములతో కూడిన భారీ వర్షం కూడా మ్యాచ్‌ను ఇబ్బందిపెట్టవచ్చు అని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్ జరిగే సమయంలో 30 నుంచి 40 శాతం వర్షం పడే అవకాశం ఉందట. దీంతో మ్యాచ్ జరిగే అవకాశం 50-50 శాతం ఉందని సమాచారం.

స్పిన్నర్లు కష్టపడాల్సిందే:
చిన్నస్వామి వికెట్‌పై బంతి బ్యాట్ మీదకు వస్తుంది. ఈ వికెట్‌పై సాధారణంగానే భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. ఐపీఎల్‌లో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు ఇక్కడ 180. చిన్నస్వామి మైదానంలో చిన్న బౌండరీలు ఉండడంతో స్పిన్నర్లు కష్టపడాల్సిందే. మరోవైపు అభిమానులకు సిక్సుల పండగే. అయితే మ్యాచ్‌కు వరణుడు ఆటంకం కలిగించే అవకాశాలుండటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నది. వాతావరణం సహకరిస్తే బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై ఇరు జట్లు పరుగుల వరద పారించాలని భావిస్తున్నాయి.

ఆర్‌సీబీ అడ్డా:
చిన్నస్వామి ఐపీఎల్ ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సొంత మైదానం. బెంగళూరు జట్టుకు టీమిండియా సారధి విరాట్ కోహ్లీ కెప్టెన్. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ అడ్డా అయిన ఈ గ్రౌండ్‌లో కోహ్లీ బ్యాట్ మరోసారి గర్జించేందుకు సిద్ధంగా ఉన్నాడు. కోహ్లీ ఫామ్ గురించి చెప్పాల్సిందేమీ లేదు. అతడి ఫామ్ చూస్తే అభిమానులను మరోసారి అలరించనున్నాడు. జట్టు ఎలాంటి స్థితిలో ఉన్నా.. విజయాన్ని అందించడానికే కోహ్లీ ప్రయత్నిస్తాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications