Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs South Africa: 3rd T20Iకి వరుణుడి ముప్పు!!

India vs South Africa, Bangalore weather: Rain expected to impact proceedings


హైదరాబాద్:
మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా చివరిదైన మూడో టీ20 ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది. మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే.

ధర్మశాల వేదికగా జరగాల్సి తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా... రెండో మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాపై స్వదేశంలో టీమిండియా టీ20 సిరీస్‌ను గెలవని నేపథ్యంలో మూడో టీ20ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు మూడో టీ20లో విజయం సాధించలాని సఫారీలు గట్టి పట్టుదలతో ఉన్నారు.

అయితే, భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న మూడో టీ20పై వరుణుడు ప్రభావం చూపే అవకాశం ఉందని వాతవరణ శాఖ పేర్కొంది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడంతో ఆదివారం వర్షం పడే అవకాశం ఉందని వెదర్.కామ్ పేర్కొంది.

ఇందులో భాగంగా అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, మేఘాలయ, కర్ణాటక, తమిళనాడు, అండమాన్‌ నికోబర్‌ దీవుల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు జరగనున్న నేపథ్యంలో ఆ సమయంలో 30-40 శాతం వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఇదిలా ఉంటే టీమిండియా మాజీ కెప్టెన్, జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ రాహుల్ ద్రవిడ్ ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా టీమిండియా ఆటగాళ్లతో సంభాషించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గత కొన్ని మ్యాచ్‌లుగా పేలవ ప్రదర్శన చేస్తోన్న రిషబ్ పంత్‌కు రాహుల్ ద్రవిడ్ విలువైన సూచనలు చేశాడు.

జట్ల వివరాలు:
ఇండియా: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, క్రునాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ అహ్మద్ నవదీప్ సైని.

దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (కెప్టెన్, వికెట్ కీపర్), రాస్సీ వాన్ డెర్ డుసెన్ (వైస్ కెప్టెన్), టెంబా బావుమా, జూనియర్ దాలా, జార్న్ ఫోర్టుయిన్, బ్యూరాన్ హెన్డ్రిక్స్, రీజా హెన్డ్రిక్స్, డేవిడ్ మిల్లెర్, అన్రిచ్ నార్ట్జే, ఆండిలే ఫెహ్లుక్వాయో, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రాబా తబ్రేజ్ షంసీ, జార్జ్ లిండే

Story first published: Saturday, September 21, 2019, 17:49 [IST]
Other articles published on Sep 21, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+