Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత ఫేసర్లు అదరగొట్టారు: డివిలియర్స్

India vs South Africa: AB de Villiers surprised by lively Indian pace attack

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు రెండు టెస్టుల్లోనూ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయినా రెండు టెస్టుల్లోనూ భారత ఫేసర్లు మాత్రం అత్యుత్తమ ప్రదర్వన ఇచ్చి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేసి ప్రత్యర్థి జట్టుకు ఎక్కువ పరుగులు పోకుండా కాపాడారు.

ఇప్పుడు ఇదే విషయమై సఫారీ జట్టులోని స్ఠార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ భారత బౌలర్లను తెగ పొగిడేస్తున్నాడు. పదునైన భారత పేస్‌ బౌలింగ్‌ తమను ఆశ్చర్యపరిచిందని ఆయన అన్నాడు. ''భారత్‌ నన్ను ఆకట్టుకుంది. పేస్‌ బౌలింగ్‌తో వాళ్లు మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మేం ఊహించినదాని కంటే పేస్‌ ఎక్కువే ఉంది'' అని చెప్పాడు. అన్ని రంగాల్లోనూ తమ జట్టు మెరుగైన ప్రదర్శన చేసిందని అన్నాడు.

''మా జట్టు సమష్టిగా రాణించింది. అన్ని రంగాల్లోనూ సత్తా చాటింది. బ్యాట్స్‌మెన్‌, ఫీల్డర్లు, బ్యాట్స్‌మెన్‌ మెరుగైన ప్రదర్శన చేశారు'' అంటూ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. 2015లో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్‌పై విజయం సాధించాం. మళ్లీ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనుకుంటున్నాం అని పేర్కొన్నాడు.

బౌలర్లకు ఎంత పొగడ్తలొచ్చినా, బ్యాటింగ్‌లో నేను 153 పరుగులు చేసినా జట్టు పరాజయం పాలైయ్యాక ఇవన్నీ పరిగణనలోకి రావని కోహ్లీ బుధవారం మీడియా సమావేశంలో అభిప్రాయపడ్డాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, January 19, 2018, 9:16 [IST]
Other articles published on Jan 19, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+