
హైదరాబాద్: సఫారీ గడ్డపై భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో టీ20లో హర్మన్ ప్రీత్ కౌర్ సేన 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరిస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్, టీ 20 సిరీస్‌లను దక్షిణాఫ్రికా గడ్డపై సాధించిన మొదటి భారత మహిళా జట్టుగా నిలిచింది.
నాలుగో టీ20 వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. 167 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా ఏదశలోను భారత్‌కు పోటీ ఇవ్వలేకపోయింది. 18 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది.
సఫారీ బ్యాట్స్ ఉమన్లలో కాప్ (27), ట్రైయాన్ 25 పరుగులతో రాణించగా మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో శిఖా పాండే, థార్, గైక్వాడ్‌లు తలో మూడు వికెట్లు తీసి భారత విజయంలో కీలకపాత్ర పోషించారు.
ఈ సిరిస్‌లో మూడు హాఫ్ సెంచరీలు చేసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సఫారీ గడ్డపై చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ కొనసాగిందిలా:
సఫారీల విజయ లక్ష్యం 167
దక్షిణాఫ్రికా పర్యటనలో భారత మహిళా క్రికెట్ జట్టు జోరు కొనసాగుతోంది. కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరుగుతున్నఆఖరి టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. దీంతో సఫారీలకు 167 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
భారత మహిళా బ్యాట్స్ ఉమన్లలో మిథాలీ రాజ్ 50 బంతుల్లో 8ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 62 పరుగులతో అద్భుత ప్రదర్శన చేసింది. ఓపెనర్లు మిథాలీ రాజ్, స్మృతి మంధానలు తొలి వికెట్‌కు 32 పరుగుల భాగస్వామ్యం అందించారు. 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్మృతి మందాన పెవిలియన్‌కు చేరింది.
అనంతరం రంగంలోకి దిగిన రోడ్రిక్స్‌తో కలిసి మిథాలి స్కోరు బోర్డుని పరిగెత్తించింది. రోడ్రిక్స్ 34 బంతుల్లో 3ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 44 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో కాప్, కాకా, ఇస్మాయిల్‌లు తలో వికెట్ తీశారు.
15 ఓవర్లకు భారత్ 115/1
మూడో టీ20లో భారత మహిళల జట్టు భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది. ఓపెనర్ మిథాలీ రాజ్ (54) నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీని సాధించింది. మరో ఓపెనర్ మంథాన (13) పరుగుల వద్ద ఇన్నింగ్స్ 4.2 ఓవర్‌లో మారిజన్నే కాప్ వేసిన బంతిని ఆడబోయి క్లాస్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జెమిమా రోడ్రిక్స్ (35), మిథాలీ రాజ్ (54) పరుగులతో ఉన్నారు.
మిథాలీ హాఫ్ సెంచరీ
కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదో టీ20లో మిథాలీ రాజ్ హాఫ్ సెంచరీ నమోదు చేసింది. 46 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో మిథాలీ రాజ్ హాఫ్ సెంచరీ సాధించింది. ప్రస్తుతం 14.5 ఓవర్లకు గాను భారత మహిళ జట్టు వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
ఐదు టీ20ల సిరిస్‌లో చివరిదైన ఐదో టీ20 భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మహిళా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సిరిస్‌లో ఇప్పటికే 2-1తో సిరీస్‌లో ఆధిక్యంలో టీమిండియా నిలిచింది.

నాలుగో టీ20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో ఆఖరి వన్డేలో విజయం సాధించి సిరిస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఒకే పర్యటనలో రెండు సిరీస్‌లో నెగ్గిన తొలి జట్టుగా భారత మహిళల జట్టు రికార్డు సృష్టిస్తుంది.
జట్ల వివరాలు:
దక్షిణాఫ్రికా మహిళా జట్టు:
డేన్ వాన్ నీకెర్క్ (కెప్టెన్), మనీజనే కప్, త్రిష చెట్టీ, అయాబొంగ కాకా, సునే లూస్, ఒడినే కిర్స్టెన్, మినోన్ డు ప్రీజ్, లిజెల్ లీ, చోలీ ట్రాయ్న్, నాడిన్ డే క్రెలక్, రైసిబ్ నోటోజా,
టీమిండియా మహిళా జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మందాన (వైస్ కెప్టెన్), మిథాలి రాజ్, వేద కృష్ణమూర్తి, అనూజ పాటిల్, తానియా భాటియా, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, రుమేలి ధార్