Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అయ్యర్ ఇలా చేస్తే అంతే!: ఆమెనిచ్చి పెళ్లి చేస్తాం, నెటిజన్ల జోకులు

India vs South Africa 5th ODI : Sheryas Iyer drops Markram's catch, Kohli gets angry

హైదరాబాద్: ఐదో వన్డేలో టీమిండియా గెలిచింది కాబట్టి సరిపోయింది. లేదంటే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ ఇక తుది జట్టులో ఎన్నటికీ కనిపించే వాడు కాదేమో. ఎందుకు అలా. అసలేం జరిగింది. ఇప్పుడిప్పుడు టీమిండియాలో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని ప్రయత్నిస్తోన్న యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ తప్పిదాలు భారత్‌కు శరాఘాతంలా మారుతున్నాయి.

కేప్ టౌన్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో డేవిడ్ మిల్లర్ క్యాచ్ వదిలేసిన అయ్యర్.. ఐదో వన్డేలో సఫారీ జట్టు కెప్టెన్ ఐయిడెన్ మర్క్రమ్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను వదిలేశాడు. బ్యాటింగ్‌లో ఫర్వాలేదని అనిపిస్తున్నప్పటికీ, ఫీల్డింగ్‌లో మాత్రం నిరాశపరుస్తున్నాడు. దీంతో అయ్యర్ అంతర్జాతీయ క్రికెట్‌కు సరిపోడనే భావనను క్రికెట్ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన ఐదో వన్డేలో ఇన్నింగ్స్ 6వ ఓవర్లో మర్క్రమ్ ఇచ్చిన క్యాచ్‌ని శ్రేయాస్ అయ్యర్ వదిలేయడంతో ఆ తర్వాత దూకుడుగా ఆడాడు. బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ని లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. భువీ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో ఫోర్, సిక్సర్ బాదాడు.

ఇన్నింగ్స్ 9వ ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు. 9 ఓవర్లు ముగిసే సరికి సఫారీ జట్టు వికెట్ కోల్పోకుండా 50 పరుగులు చేసింది. నాలుగు, ఐదో వన్డేల్లో క్యాచ్‌లను నేలపాలు చేసిన అయ్యర్‌కు లావుగా ఉన్న దక్షిణాఫ్రికా సెక్యూరిటీ ఆఫీసర్‌ను ఇచ్చి పెళ్లి చేయాలని సోషల్ మీడియాలో జోకులు వేస్తున్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, February 14, 2018, 11:30 [IST]
Other articles published on Feb 14, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+