For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సఫారీ గడ్డపై ఒకటి గెలిస్తే కోహ్లీసేన చరిత్ర: వాండరర్స్ రికార్డు, ఏబీ రాక

By Nageshwara Rao

హైదరాబాద్: సఫారీ గడ్డపై ప్రస్తుతం జరుగుతోన్న ఆరు వన్డేల సిరిస్‌లో ఇప్పటివరకు టీమిండియానే పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఒక్కటంటే ఒక్క వన్డే గెలిస్తే చాలు సఫారీ గడ్డపై కోహ్లీసేన చరిత్ర సృష్టిస్తుంది. ఈ చరిత్రకు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది.

దక్షిణాఫ్రికాపై వరుసగా మూడు వన్డేల్లో విజయం సాధించి సిరిస్‌లో 3-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య శనివారం జోహెన్స్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో నాలుగో వన్డే జరగనుంది. ఈ వన్డేలో కోహ్లీసేన విజయం సాధిస్తే సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది.

ఎందుకంటే సఫారీ గడ్డపై టీమిండియా ఇప్పటివరకూ టెస్టు సిరిస్‌తో పాటు వన్డే సిరీస్‌ను గెలవలేదు. దీంతో ఈ సిరిస్‌ను గెలిచేందుకు గాను భారత్‌కు ఓ సువర్ణావకాశం. నాలుగో వన్డేలో విజయం సాధించి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాలని కోహ్లీసేన భావిస్తుండగా, శనివారం నాటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ రేసులో నిలవాలని సఫారీలు చూస్తున్నారు.

1992-93లో తొలిసారి సఫారీ పర్యటన

1992-93లో తొలిసారి సఫారీ పర్యటన

1992-93లో తొలిసారి సఫారీ పర్యటనకు వెళ్లిన టీమిండియా రెండు విజయాల్ని మాత్రమే సాధించింది. ఆ తర్వాత 2010-11 సీజన్‌లో ధోని నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటకు వెళ్లినప్పుడు రెండు విజయాలతో సరిపెట్టుకుంది. ఐదు వన్డేల సిరిస్‌లో తొలుత ధోని నేతృత్వంలోని టీమిండియా 2-1తో ఆధిక్యంలో నిలిచిన చివరకు సిరీస్‌ను 2-3తో ముగించింది.

కోహ్లీసేనకు సువర్ణావకాశం

కోహ్లీసేనకు సువర్ణావకాశం

ఈ నేపథ్యంలో ఇప్పుడు టీమిండియాకు వచ్చిన సువర్ణావకాశాన్ని ఒడిపిట్టుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. ఇంకా మూడు వన్డేలు మిగిలి ఉండటంతో వాటిలో విజయం సాధించి సిరీస్‌ను సమం​ చేయడానికి దక్షిణాఫ్రికా సరికొత్త ప్రణాళికలను పదును పెడుతోంది. దక్షిణాఫ్రికా జట్టులో ఏబీ డివిలియర్స్‌ చేరడంతో జట్టులోని ఆటగాళ్లలో కొత్త విశ్వాసాన్ని నింపుతోంది.

నాలుగో వన్డేలో మార్పుల్లేకుండానే భారత్

నాలుగో వన్డేలో మార్పుల్లేకుండానే భారత్

మరోవైపు నాలుగో వన్డేలో భారత జట్టు దాదాపు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆరు వన్డేల సిరిస్‌లో భాగంగా డర్బన్‌లో జరిగిన తొలి వన్డేలో ఆరు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. సెంచూరియన్‌లో జరిగిన రెండో వన్డేలో తొమ్మిది వికెట్లతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

 ఫామ్‌‌లో కెప్టెన్ కోహ్లీ

ఫామ్‌‌లో కెప్టెన్ కోహ్లీ

కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగడంతో 124 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దాంతో సఫారీ గడ్డపై ఆ జట్టును అత్యధిక పరుగుల తేడాఓ ఓడించిన ఘనతను టీమిండియా సొంతం చేసుకుంది. దీంతో నాలుగో వన్డేలో కూడా భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది.

నాలుగో వన్డేలో గెలిస్తే కోహ్లీసేన నంబర్‌ వన్‌ పదిలం

నాలుగో వన్డేలో గెలిస్తే కోహ్లీసేన నంబర్‌ వన్‌ పదిలం

దక్షిణాఫ్రికాతో నాలుగో వన్డేలో టీమిండియా గెలిస్తే నంబర్‌ వన్‌ ర్యాంకును పదిలంగా ఉంచుకుటుంది. సెంచూరియన్‌లో జరిగిన రెండో వన్డే తర్వాత అగ్రస్థానాన్ని దక్కించుకున్న టీమిండియా మూడో వన్డేలో గెలిచి ఆ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. అయితే ఈ సిరీస్‌ను కోహ్లీసేన 4-2తో గెలిస్తే అగ్రస్థానంలో నిలుస్తుంది. చివరి రెండు వన్డేల్లో ఓటమి పాలైనా భారత్ నెంబర్ వన్ ర్యాంకులో ఉండటం విశేషం.

 వాండరర్స్‌లో ఇరు జట్ల రికార్డు

వాండరర్స్‌లో ఇరు జట్ల రికార్డు

వాండరర్స్ స్టేడియంలో నాలుగో వన్డే జరగబోయే జోహన్నెస్‌బర్గ్‌ లోని వాండరర్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికాకు మెరుగైన రికార్డు ఉంది. చివరిసారిగా ఈ స్టేడియంలో జరిగిన చివరి ఆరు మ్యాచ్‌ల్లో సపారీలనే విజయం వరించింది. మరోవైపు భారత రికార్డు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకూ ఇక్కడ మొత్తం ఏడు వన్డేలు ఆడిన టీమిండియా మూడు గెలిచి, నాలుగింట ఓడిపోయింది. 2003 ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్‌ కప్‌ ఫైనల్లో ఇదే స్టేడియంలో భారత్‌ ఓటమిపాలై వరల్డ్ కప్‌ను చేజార్చుకుంది.

 రోహిత్‌ ఫామ్‌పైనే ఆందోళన

రోహిత్‌ ఫామ్‌పైనే ఆందోళన

దక్షిణాఫ్రికా పర్యటనలో మిగతా ఆటగాళ్లు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తుంటే ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మాత్రం ఫామ్‌ కోసం తంటాలు పడుతున్నాడు. క్రీజులో కుదురునేందుకు కూడా తెగ ఇబ్బంది పడుతున్నాడు. ఈ సిరిస్‌లో రోహిత్ శర్మ సఫారీ పేసర్ కగిసో రబాడ బౌలింగ్‌లో 5 సార్లు పెవిలియన్‌కు చేరాడు. ఇప్పటివరకు భారత్ గెలిచిన మూడు వన్డేల్లో ఆడిన రోహిత్‌ శర్మ మొత్తం 35 పరుగులు మాత్రమే చేశాడు. తొలి వన్డేలో 20 పరుగులు చేసిన రోహిత్‌.. రెండో వన్డేలో 15 పరుగులు చేశాడు. ఇక మూడో వన్డేలో డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు.

 జోహన్నెస్‌బర్గ్‌లో సఫారీలకు మెరుగైన రికార్డు

జోహన్నెస్‌బర్గ్‌లో సఫారీలకు మెరుగైన రికార్డు

వాండరర్స్ స్టేడియంలో గత చివరి 6 గేముల్లో దక్షిణాఫ్రికా రికార్డు విజయం:

  • Won by 7 wickets v SL, Feb 2017
  • Won by 142 runs v AUS, Oct 2016
  • Won by 1 wicket v ENG, Feb 2016
  • Won by 148 runs v WI, Jan 2015
  • Won by 141 runs v IND, Dec 2013
  • Won by 34 runs v PAK, Mar 2013
 జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

ఇండియా: విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అజ్యింకె రహానే, కేదార్ జాదవ్, ధోని(వికెట్ కీపర్), హార్థిక్ పాండ్యా, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా

దక్షిణాఫ్రికా: ఐడెన్ మర్క్రమ్, ఆమ్లా, జెపీ డుమిని, ఇమ్రాన్ తాహిర్, డేవిడ్ మిల్లర్, మోర్నీ మోర్కెల్, క్రిస్ మోరిస్, లుంగిడి ఎంగ్డి, కగిసో రబాడ, ఖాయా జోండో, హెన్రిచ్‌ క్లాసెన్‌

Match starts at: 4.30 pm IST

Live: Sony TEN

Story first published: Friday, February 9, 2018, 17:07 [IST]
Other articles published on Feb 9, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+