
హైదరాబాద్: స్వదేశంలో వరుస విజయాల రికార్డుతో సఫారీ గడ్డపై ఫలితాలు తారుమారవడంతో జట్టు కూర్పుపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మొదటి టెస్టు సిరీస్ ముగియకుండానే భారత్ సిరీస్‌ను కోల్పోయింది. కేవలం పరువుకోసం ఆడాల్సిన ఆఖరి మ్యాచ్‌లో అయినా రహానెను తీసుకుని జట్టులో ఇంకొన్ని మార్పులు చేయాంటూ భారత మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
'దక్షిణాఫ్రికాలో అన్ని పేస్ పిచ్‌లే. ఇందుకోసం మరో బ్యాట్స్‌మెన్ అవసరం. దినేశ్ కార్తీక్ గత సీజన్‌లో తమిళనాడుకు ఆడినా పెద్దగా రాణించలేకపోయాడు. ఇక స్పిన్నర్ అశ్విన్‌ను చివరి టెస్టులో తీసుకోకపోవడం మంచిది. అతనికి బదులు కొత్త బౌలర్‌కు అవకాశం ఇవ్వాలి. హార్దిక్ పాండ్య ఎలాగూ ఐదో బౌలర్‌గా ఉండనే ఉన్నాడు కదా' అని తెలిపాడు.
తుది జట్టులో రహానెను తీసుకోకపోవడంపై విమర్శలు ఎదుర్కొంటున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ విలువైన సలహాలు ఇచ్చాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. 'కోహ్లీ సేన వైట్‌వాష్‌కు గురికాకుండా ఉండాలంటే జట్టులో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. విదేశీ గడ్డపై ఐదుగురు బ్యాట్స్‌మెన్లతో బరిలోకి దిగడం సరికాదని తెలిపాడు. గాయం కారణంగా దూరమైన వికెట్ కీపర్ సాహా స్థానంలో వచ్చిన పార్ధీవ్ పటేల్ సెంచూరియన్ టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన విషయాన్ని గుర్తు చేశాడు.
చివరిదైన మూడో టెస్టు కోసం కేఎల్ రాహుల్‌కు వికెట్‌కీపర్ పగ్గాలు అందించాలన్నాడు. అతనికి ఎలాగూ ఐపీఎల్‌లో వికెట్ కీపర్ బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉందని వివరించాడు. ఇలా చేస్తే తుది జట్టులో మరో బ్యాట్స్‌మెన్‌ను తీసుకునే అవకాశం ఉంటుందని తెలియజేశాడు. ఆరో బ్యాట్స్‌మెన్‌గా రహానెను జట్టులోకి తీసుకోవాల్సిందే అని సన్నీ సూచించాడు. జొహనెస్‌బర్గ్ వేదికగా మూడోటెస్ట్ బుధవారం మధ్యాహ్నం ప్రారంభం కానుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.