
హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 247 పరుగులకు ఆలౌటైంది. ఆతిథ్య జట్టుకు 240 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. అస్థిరంగా మారిన పిచ్‌పై బంతి అనూహ్యంగా బౌన్స్ అవుతున్న తరుణంలో ఇది పెద్ద లక్ష్యంగానే కనిపిస్తోంది.
మూడో రోజు, శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరు 49/1తో ఆట ప్రారంభించిన భారత్ నిలకడగా ఆడింది. లోకేశ్ రాహుల్ (16), ఛెతేశ్వర్ పుజారా (16) వెంటవెంటనే ఔటైనా అజింక్య రహానె (48; 68 బంతుల్లో 6×4), విరాట్ కోహ్లీ (41; 79 బంతుల్లో 6×4) ధాటిగా పోరాడారు. నెర్రలు చాచిన పిచ్‌పై వేసిన బంతులు శరీరానికి తగులుతున్నా భారీ స్కోరు అందించాలన్న లక్ష్యంతో వేగంగా బ్యాటింగ్ చేశారు.
వీరికి తోడు భువనేశ్వర్ కుమార్ (33; 76 బంతుల్లో 2×4), మహ్మద్ షమి (27; 28 బంతుల్లో 1×4, 2×6) మెరిపించారు. పాండ్య (4) విఫలమయ్యాడు. చివర్లో ఇషాంత్ (7; 16 బంతుల్లో 1×4) ఓ బౌండరీ బాది స్కోరును 247కు చేర్చాడు. ఫిలాండర్, రబాడ, మోర్కెల్ తలో మూడు వికెట్లు తీశారు.
భారత్ బాగానే పరుగుతీసింది:
పిచ్ అనుకూలించకపోయినా అంతకుముందు మ్యాచ్‌ల కంటే జాగ్రత్తగా వ్యవహరించినా భారత్ వికెట్లు ఐదు పడిపోయాయి. కెప్టెన్ కోహ్లీ 79 బంతులను ఎదుర్కొని 41 పరుగులు మాత్రమే చేయగలిగాడు. క్రీజులో రహానె, హార్థిక్ పాండ్యా ఉన్నారు.
లంచ్ విరామానికి భారత్ స్కోరు 100/4
సిరీస్‌లో చివరి టెస్టు మూడో టెస్టులో మూడో రోజైన శుక్రవారం భారత్ ఆటగాళ్లు జాగ్రత్తగా ఆడుతున్నారు. పరుగులకు ప్రాధాన్యమివ్వకుండా క్రీజులో నిలదొక్కుకోవడానికే ఎక్కువ కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఓవర్ నైట్ స్కోరులో ఒక వికెట్‌ను కోల్పోయిన భారత్ సేన మూడో రోజు లంచ్ విరామానికి మూడు వికెట్లను కోల్పోయింది.
ప్రస్తుతం భారత్ స్కోరు 100/4 ఉండగా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నాడు. సఫారీ బౌలర్లు ఫిలాండర్ రెండు, రబడ ఒకటి వికెట్లను తీశారు.
రెండో రోజు మొదలైన కాసేపట్లోనే 2 వికెట్లను కోల్పోయిన భారత్ జట్టు
భారత్ ఆట మొదలైన కొద్ది సమయంలోనే భారత్ రెండు వికెట్లను కోల్పోయింది. దీంతో భారత్ స్కోరు 57/3 గా ఉంది. క్రీజులో విరాట్ కోహ్లీ, మురళీ విజయ్ ఉన్నారు.
భారత్ vs దక్షిణాఫ్రికా, మూడో టెస్టు, డే 3: స్కోరు కార్డు
భారత్-దక్షిణాఫ్రికా మధ్య చివరి టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. 49/1 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం క్రీజులో మురళీ విజయ్(15)-కేఎల్ రాహుల్(16) ఉన్నారు.
18 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 44 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.