రాంచీ టెస్టులో ముగిసిన 3వరోజు: సఫారీలపై క్లీన్‌స్వీప్‌కు 2 వికెట్ల దూరంలో కోహ్లీసేన

హైదరాబాద్: రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా విజయం దాదాపు ఖారారైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. క్రీజులో థినిస్ డీ బ్రుయిన్(30), అన్రిచ్ నోర్ఝి(5) పరుగులతో ఉన్నారు.
ఇంకా రెండు వికెట్లు మాత్రమే ఉండటంతో టీమిండియా ఇన్నింగ్స్ భారీ విజయం ఖాయంగా కనబడుతోంది. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో కేవలం ఒక్క రోజులోనే దక్షిణాఫ్రికా 16 వికెట్లు చేజార్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఇంకా 203 పరుగుల వెనుకంజలో ఉంది.
ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోవాలంటే ముందు ఈ పరుగులు సాధించాలి. అంతకముందు ఫలితం వచ్చేలా కనిపించడంతో అంపైర్లు రెండు ఓవర్లు పాటు మ్యాచ్‌ని పొడగించారు కూడా. అయినా సరే టీమిండియా ట్రోఫీ అందుకోవడం చూడాలంటే మరొక్క రోజు ఆగాల్సిందే.
ఈ మ్యాచ్‌లో గనుక టీమిండియా విజయం సాధిస్తే సుదీర్ఘ ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాపై సిరిస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో షమీ మూడు వికెట్లు తీయగా... ఉమేశ్ యాదవ్ రెండు, జడేజా, అశ్విన్ చెరో వికెట్ తీశారు.

ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ
9/2 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆడిన తొలి బంతికే దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఔటయ్యాడు. ఆడిన తొలి బంతికే దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఔటయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

బవుమా నిలకడగా
ఈ సమయంలో క్రీజులోకి వచ్చి బవుమా నిలకడగా ఆడుతూ స్కోరుని పెంచే ప్రయత్నం చేశాడు. మరోవైపు జుబైర్ హమ్జా హాఫ్ సెంచరీ చేసి క్రీజులో పాతుకుపోయాడు. వీరిద్దరి జోడీ నిలకడగా ఆడుతూ సుమారు 22 ఓవర్ల పాటు క్రీజులో నిలబడి వికెట్లు కోల్పోకుండా అడ్డుకున్నారు. ఇద్దరూ కలిసి 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

విడదీసిన నదీమ్
అలాంటి సమయంలో వీరిద్దరి జోడిని నదీమ్ తన స్పిన్‌తో విడదీశాడు. అంతకముందు 28వ ఓవర్లో జడేజా వేసిన నాలుగో బంతిని ఆడిని హంజా(62) బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్లాసెన్(6)ను జడేజా ఆరోవికెట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. 31.4వ ఓవర్లో జడేజా వేసిన బంతికి క్లాసెన్ బౌల్డ్ అయ్యాడు.

చివర్లో ప్రతిఘటించిన లిండే
లంచ్ విరామానికి ముందు ఐదు ఓవర్ల వ్యవధిలో భారత బౌలర్లు మూడు వికెట్లు పడగొట్టారు. ఇక, లంచ్ విరామం అనంతరం భారత బౌలర్లు మరింతగా చెలరేగడంతో సఫారీ ఇన్నింగ్స్ ఎక్కువసేపు కొనసాగలేదు. డేన్ పైడిట్(4), రబడా(0)లు స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. చివర్లో జార్జి లిండే(37; 81 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) ఫరవాలేదనిపించాడు.

19 ఓవర్ల పాటు క్రీజులో
అతడికి అన్రిచ్ నోర్జి నుంచి మద్దతు లభించడంతో వీరిద్దరూ భారత బౌలర్లకు వికెట్ ఇవ్వకుండా చాలాసేపు ప్రతిఘటించారు. వీరిద్దరూ సుమారు 18 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నారు. లిండే తొమ్మిదో వికెట్‌గా ఔట్ కాగా... ఆ తర్వాత కొద్దిసపేటికే నోర్జే(4) నదీమ్ బౌలింగ్‌లో ఎల్బీ అయ్యాడు.

ఫాలోఆన్‌లో
అనంతరం ఫాలోఆన్‌లో ఆట మొదలైన కొద్ది సేపటికే దక్షిణాఫ్రికా రెండు వికెట్లను చేజార్చుకుంది. ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతికి క్వింటన్ డికాక్(5) బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ మూడో ఓవర్ మూడో బంతికి హమ్జా బౌల్డయ్యాడు. అనంతరం షమీ బౌలింగ్‌లో బవుమా డకౌట్ కాగా, డుప్లెసిస్ (4) ఔటయ్యారు.

డుప్లెసిస్ రివ్యూ
డుప్లెసిస్ రివ్యూ కోరినప్పటికీ ఫలితం ప్రతికూలంగా వచ్చింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ భారత బౌలర్ల దెబ్బకు క్యూ కట్టారు. హమ్జా(0), డుప్లెసిస్(4), బవుమా(0), క్లాసిన్(5) పూర్తిగా నిరాశపరిచారు. దీంతో 36 పరుగులకే ఐదు వికెట్ల కోల్పోయి దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది.

ఉమేశ్ యాదవ్
ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ మూడో బంతి డీన్ ఎల్గర్ హెల్మెట్‌కు బలంగా తాకింది. దీంతో డీన్ ఎల్గర్ ఒక్కసారిగా క్రీజులో కూలబడ్డాడు. దీంతో డీన్ ఎల్గర్ తలను బంతి బలంగా తాకడంతో అతడు రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో అతడి స్థానంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా డి బ్రుయిన్ క్రీజులోకి వచ్చాడు.

లిండే
చివర్లో లిండే(27), పీట్(30), రబడ(12)లు కాసేపు మెరుపులు మెరిపించినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేదు. దీంతో ఆట మూడో రోజు ముగస్తుందని అందరూ భావించారు. అయితే డి బ్రుయిన్ భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. దీంతో భారత విజయం మరో రోజు వెనక్కి వెళ్లింది. రెండో ఇన్నింగ్స్‌లో షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. ఉమేశ్ రెండు, రవీంద్ర జడేజా, అశ్విన్‌లు తలో వికెట్ తీశారు.

సాహాకు గాయం.. రిషబ్ పంత్ కీపింగ్
మూడో టెస్టులో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయపడ్డాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ వేసిన 27 ఓవర్ తొలి బంతిని అందుకునే క్రమంలో సాహా చేతి వేలికి గాయమైంది. దీంతో భారత ఫిజియోతో కలిసి సాహా మైదానాన్ని వీడాడు. దీంతో సాహో స్థానంలో స్టాండ్ బై కీపర్‌గా ఉన్న రిషభ్ పంత్ ప్రస్తుతం ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఫీల్డింగ్ చేస్తున్న వికెట్ కీపర్‌కు ఏమైనా సమస్య తలెత్తితే స్టాండ్ బైగా ఉన్న వికెట్ కీపర్ కీపింగ్ చేయవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications