
రెండో ఇన్నింగ్స్ లో భారత్ స్కోరు:49/1
మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో బుమ్రా అద్వితీయమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఈ ఇన్నింగ్స్ మొత్తంలో దక్షిణాఫ్రికా జట్టు ఏడు పరుగుల లీడ్ తేడాతో ఆధిక్యంతో నిలిచింది. మూడో టెస్ట్ మొదటి రోజులో భాగంగా భారత్ బుధవారం 187 పరుగుల స్కోరు చేసింది. మొదటి రోజు ముగిసే సరికి దక్షిణాఫ్రికా జట్టు ఒక వికెట్ కోల్పోయింది. భారత్ రెండో రోజు సైతం ఇదే పంథాను కొనసాగించింది.
భారత బౌలర్లు తమ మాయాజాలాన్ని ప్రదర్శించి వికెట్ లను వేగవంతంగానే తీయగలిగానే ప్రత్యర్థి జట్టే ఆధిక్యంలో నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోయి 40 పరుగులు చేసింది. ఓపెనర్ మురళీ విజయ్ (13; 48 బంతుల్లో 1×4) ఆచితూచి ఆడుతున్నాడు. ఆఫ్‌సైడ్ దూరంగా వెళ్తున్న బంతుల్ని చక్కగా వదిలేస్తున్నాడు. అనవసరంగా బౌండరీలు బాదేందుకూ మొగ్గుచూపడం లేదు. అతడికి లోకేశ్ రాహుల్ (11; 27 బంతుల్లో 1×4) సహకారం అందిస్తున్నాడు. రెండో రోజు ఆట ముగిసేందుకు ఇంకా 13 ఓవర్లు ఉన్నాయి.
మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆదిలోనే తొలి వికెట్ చేజార్చుకుంది. దూకుడుగా ఆడిన ఓపెనర్ పార్థివ్ పటేల్ (16; 15 బంతుల్లో 3×4) ఔటయ్యాడు. వేగంగా బౌండరీలు సాధించిన అతడు ఫిలాండర్ వేసిన 4.6వ బంతిని ఆడే క్రమంలో స్లిప్‌లో మార్క్రమ్ చేతికి చిక్కాడు. గల్లీలో మార్క్రమ్ గాల్లోకి డైవ్ చేసి మరీ క్యాచ్ అందుకోవడం విశేషం. 6 ఓవర్లు ముగిసే సరికి భారత్ 19/1తో ఉంది.
ఇప్పటివరకు ఇద్దరు మినహాయించి సఫారీ జట్టు ప్లేయర్లు ఎవ్వరూ పదికి మించిన స్కోరును నమోదు చేయలేకపోయారు. ఆరు వికెట్లు కోల్పోయిన సఫారీ జట్టులో నాలుగో స్థానంలో వచ్చిన ఆమ్లా మాత్రం స్థిరంగా నిలబడిపోయాడు.
బుమ్రా చేతికి చిక్కిన డుప్లెసిస్:
టీ బ్రేక్ అనంతరం భారత జట్టుకు మరో వికెట్ పడింది. సౌతాఫ్రికా జట్టు ప్రధాన వికెట్ అయిన డుప్లెసిస్ బుమ్రా చేతిలో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం 45 ఓవర్లకి క్రీజులో ఆమ్లా(48), డి కాక్(1)ఉన్నారు.
టీ బ్రేక్‌కు సౌతాఫ్రికా స్కోరు 101
అంతటి ప్రమాదకరమైన పిచ్‌పైనా సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లు ఏ మాత్రం తగ్గడం లేదు. కాస్త జాగ్రత్త చూపించి ఆడుతూ నిదానంగా పరుగులు తీస్తూనే ఉన్నారు. ఇప్పటికే భారత బౌలర్లకు నాలుగు వికెట్లు దక్కాయి. సఫారీ జట్టు లక్ష్యానికి ఇంకా 86 పరుగుల దూరంలో ఉంది. నాలుగో వికెట్ పడిన వెంటనే టీ బ్రేక్ వచ్చింది. ప్రస్తుతం క్రీజులో ఆమ్లా( 43) ఉన్నాడు.
లంచ్ విరామం, సఫారీ స్కోరు: 81/3
లంచ్ విరామానికి 81 పరుగులను చేసిన సఫారీ జట్టు మూడు వికెట్లను కోల్పోయింది. వాండరర్స్ స్టేడియం బ్యాట్స్‌మెన్‌లకు పెద్దగా కలిసి రాకపోవడంతో బుధవారం భారత్ ఆటగాళ్లు అవస్థలు పడ్డట్లే సపారీ ఆటగాళ్లు సైతం పరుగుల కోసం నానా తంటాలు పడుతున్నారు.
భారత్ ఆటగాళ్లు తమ నైపుణ్యాన్ని చక్కగా వాడుతున్నారు. మొదటి రోజు చివర్లో ఒక వికెట్ తీయగలిగిన భారత్ జట్టు, రెండో రోజు మ్యాచ్ ఆరంభమైన కాసేపటిలోనే రెండో వికెట్‌ను తీయగలిగింది. కాగా లంచ్ విరామానికి ముందు 80 పరుగుల వద్ద మూడో వికెట్ పడింది.
దీంతో సఫారీ జట్టు 81 పరుగులకు మూడు వికెట్ల నష్టంతో మ్యాచ్‌ను కొనసాగుతోంది. సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లు 187 పరుగులు చేసిన భారత్ స్కోరును చేరుకోవాలంటే ఇంకా 106పరుగుల వరకు చేయాల్సి ఉంది.
స్కోరు 80వద్ద మూడో వికెట్ కోల్పోయిన సఫారీ జట్టు
ఇషాంత్ శర్మ వేసిన బాల్‌ను డిఫెండింగ్ ఆడేందుకు ప్రయత్నించిన రబడ కొద్దిగలో తప్పి క్యాచ్ ఇచ్చాడు. దాన్ని రహానె అందుకోవడంతో 84 బంతులను ఆడిన రబాడ 30పరుగులు తీసి ఔట్ అయ్యాడు. ఆమ్లా, రబడ భాగస్వామ్యంలో 50 పరుగులకు మించిన స్కోరు చేశారు.
క్రీజులో ఆమ్లా 51 పరుగులతో పాటుగా డివిలియర్స్(0)తో ఉన్నారు.
రెండో వికెట్‌ను కోల్పోయిన సఫారీ జట్టు:
మూడో టెస్టులో మొదటి రోజు స్వల్పంగా 187 పరుగులకే ఆలౌట్ అయిన భారత్ రెండో రోజు ఆరంభంలోనే దక్షిణాఫ్రికా రెండో వికెట్‌ను పెవిలియన్‌కు పంపింది.
ఓపనెర్లు ఇద్దరు పది పరుగులు కూడా చేయకుండానే అవుట్ అయ్యారు. 19 ఓవర్లకు 26/2 స్కోరుతో క్రీజులో రబడ, ఆమ్లా ఉన్నారు.
ప్రత్యర్థుల వికెట్లు తీయడమే భారత టార్గెట్
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభమైంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 187 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య దక్షిణాఫ్రికా తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. ప్రస్తుతం ఎల్గర్(4), రబాడ(0) క్రీజులో ఉన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.