Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

3వ టెస్టు: డే 1, భారత్ ఆలౌట్ (187)

India vs South Africa, 3rd Test, Day 1: Visitors Elect To Bat First As Rahane Included In Playing XI

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 187 పరుగులకు ఆలౌటైంది. పట్టుదలగా ఆడిన పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ (30; 49 బంతుల్లో 4×4) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. జట్టుకు అవసరమైన విలువైన పరుగులు సాధించిన అతడిని 76.4వ బంతికి రబాడ పెవిలియన్‌కు పంపించాడు. ఉన్నంత సేపు సఫారీ బౌలర్ల కూటమి విసిరిన చురకత్తుల్లాంటి బంతులను భువి చక్కగా కాచుకోవడం విశేషం. బుమ్రా (0; 7 బంతుల్లో) నాటౌట్‌గా నిలిచాడు.

పుజారా (50) తో ముగించాడు. భువిని పక్కనపెడితే మిగతా బ్యాట్స్‌మెన్‌ అంతా రెండంకెల స్కోరు సైతం చేయలేదు. భారీ అంచనాలతో జట్టులోకి వచ్చిన అజింక్య రహానె (9) మోర్నీ మోర్కెల్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. రబాడ 3, మోర్కెల్‌, ఫిలాండర్‌, ఫెహ్లుక్‌వాయో తలో రెండు వికెట్లు తీశారు. ఎంగిడికి విరాట్‌ కోహ్లీ వికెట్‌ దక్కింది.

9 పరుగులకే రహానె అవుట్, పాతుకుపోయిన పూజారా

వస్తాడు. టెస్ట్ మ్యాచ్‌ను ఇరగదీస్తాడు. ఆఖరుకు ఈ మ్యాచ్ కూడా గెలవకపోతే పరువుపోతోంది. అంటూ కోహ్లీ చాలా మంది పెద్ద మనుషులు చేసిన హితబోదను రహానె గాలికి వదిలేశాడు. టెస్ట్ మ్యాచ్ లలో అనుభవమున్న ఆటగాడని తీసుకుంటే 23 బంతులు ఆడి 9 పరుగులకే అవుట్ అయి పెవిలియన్ బాట పట్టాడు.

ప్రస్తుతం క్రీజులో పూజారా(27), పార్థివ్ పటేల్(0) ఉన్నారు.


కోహ్లీ అవుట్, భారత్ స్కోరు 97/3

దక్షిణాఫ్రికా దుర్బేద్యమైన బౌలింగ్‌ను ఎదుర్కొంటున్న కోహ్లీ, పూజారాల జోడికి పెద్ద కష్టం వచ్చి పడింది. ఎంగిడి 42.4 ఓవర్లకు వేసిన బంతిని షాట్ కొట్టిన కోహ్లీ క్యాచ్ ఇవ్వడంతో 106బంతులకు గాను 54 స్కోరును నమోదు చేసి అవుటయ్యాడు. పెద్దగా పరుగులేమీ చేయకపోయినా పూజారా మాత్రం క్రీజులో స్థిరబడిపోయాడు.

India vs South Africa, 3rd Test, Day 1: Visitors Elect To Bat First As Rahane Included In Playing XI

లంచ్ విరామానికి భారత్ 45/2

జోహెన్స్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో లంచ్ విరామానికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (24), పుజారా (5) పరుగులతో ఉన్నారు. మూడో టెస్టులో భారత ఓపెనర్లు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 8.4 ఓవర్లు ముగిసే సమయానికే 13/2తో ఒత్తిడిలో పడింది. ఏడు బంతులు ఎదుర్కొన్న ఓపెనర్ కేఎల్ రాహుల్ కనీసం పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్‌గా పెవిలియన్‌కి చేరగా.. మరో ఓపెనర్ మురళీ విజయ్ (8) ఔటయ్యాడు.

ప్రస్తుతం క్రీజులో ఉన్న పుజారా, కోహ్లీలు ఆచితూచి ఆడుతున్నారు. ఇప్పటికే పుజారా రెండుసార్లు, కోహ్లీ ఒకసారి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పుజారా అయితే తన ఖాతా తెరవడానికి 54 బంతులు తీసుకున్నాడు. తన 54వ బంతికి సింగిల్ తీయడంతో అటు ప్రేక్షకులు, డ్రెస్సింగ్ రూమ్ సహచరులు చప్పట్లు కొట్టారు. పుజారా కూడా ఓ చిరునవ్వు నవ్వాడు. ఫిలాండర్, రబాడ చెరొ వికెట్ తీసుకున్నారు.

రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
జోహెన్స్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కగిసో రబాడ బౌలింగ్‌లో టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ (8) పరుగుల వద్ద వికెట్ కీపర్ క్వింటన్ డీ కాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. మురళీ విజయ్ తర్వాత క్రీజులోకి కెప్టెన్ విరాట్ కోహ్లీ వచ్చాడు. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసే సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 19 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ (6), పుజారా (0) పరుగులతో ఉన్నారు.

తొలి వికెట్ కోల్పోయిన భారత్: కేఎల్ రాహుల్ డకౌట్

జోహెన్స్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 7 పరుగుల వద్ద ఫిలాండర్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ ఔటైన తర్వాత పుజారా క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం 4 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 7 పరుగులు చేసింది. క్రీజులో మురళీ విజయ్ (6), పుజారా పరుగులేమీ చేయకుండా ఉన్నాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైన మూడో టెస్టు ప్రారంభమైంది. జోహెన్స్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. గ్రీన్ వికెట్ కావడంతో వాండరర్స్‌ పిచ్‌ ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలిస్తుంది.

దీంతో ఇరు జట్లకు చెందిన స్పిన్నర్లకు తుది జట్టులో చోటు దక్కలేదు. మూడో టెస్టులో కోహ్లీ రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాడు. రోహిత్‌ శర్మ స్థానంలో రహానే తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తప్పించి అతడి స్థానంలో భువీకి చోటు కల్పించాడు.

ఇక, దక్షిణాఫ్రికా జట్టు విషయానికి వస్తే స్పిన్నర్ కేశవ్‌ మహారాజ్‌ స్థానంలో యువ పేసర్ ఆండిల్‌కు తుది జట్టులో చోటు కల్పించింది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను ఇప్పటికే ఆతిథ్య దక్షిణాఫ్రికా 2-0తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మూడో టెస్టులో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని కోహ్లీసేన చూస్తోంది.

ఫిలాండర్‌కు 50వ టెస్టు:
సెంచూరియన్ టెస్టులో దక్షిణాఫ్రికా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఫిలాండర్ తన కెరీర్‌లో 50వ టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. 50వ టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు ఫిలాండర్‌ను క్రికెట్ దక్షిణాఫ్రికా సత్కరించింది.

సఫారీ గడ్డపై ఇప్పటివరకు టీమిండియా వైట్ వాష్ అవ్వలేదు. భారత జట్టు 1992 నుంచి 6 సార్లు దక్షిణాఫ్రికాలో పర్యటించింది. సచిన్‌ కెప్టెన్సీలో 1996-97లో మూడు టెస్టుల సిరీస్‌లో 0-2తో ఓటమే ఇప్పటి వరకు అత్యంత చెత్త ప్రదర్శన కావడం విశేషం. 2006 నుంచి కనీసం ఒక టెస్టు అయినా గెలవడమో లేదంటే డ్రా చేసుకోవడమో జరుగుతూ వస్తోంది. మూడో టెస్టు జరిగే వాండరర్స్‌లో భారత్‌ ఇప్పటివరకు ఓడిపోలేదు.

ఈ స్టేడియంలో భారత్ నాలుగు టెస్టులు ఆడగా... అందులో ఒకదాంట్లో విజయం సాధించగా, మూడు టెస్టులు డ్రాగా ముగిశాయి. 1992 నవంబర్‌, 1997 జనవరి, 2006 డిసెంబర్‌, 2013 డిసెంబర్‌లో ఇక్కడ మ్యాచ్‌లు ఆడింది. టీమిండియా మాజీ పేసర్‌ జవగళ్ శ్రీనాథ్‌ (8/99) అద్భుత ప్రదర్శన చేయడంతో ద్రవిడ్‌ కెప్టెన్సీలో 2006లో భారత్‌ విజయం సాధించింది.

జట్ల వివరాలు:
భారత్: కోహ్లీ(కెప్టెన్), విజయ్, రాహుల్, పుజారా, రహానే, హార్దిక్, పార్థివ్, భువనేశ్వర్, ఇషాంత్, షమీ, ఉమేశ్, బుమ్రా.

దక్షిణాఫ్రికా: డుప్లెసిస్(కెప్టెన్), ఎల్గర్, మక్రామ్, ఆమ్లా, డివిలియర్స్, డీకాక్, ఆండిల్, ఫిలాండర్, రబాడ, మోర్నీ మోర్కెల్, లుంగి ఎంగ్డీ.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 24, 2018, 21:08 [IST]
Other articles published on Jan 24, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+