Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs South Africa, 3rd Test: 5000 టికెట్లు వారికి మాత్రమే ఉచితం!

India vs South Africa, 3rd Test: 5000 Free Match Tickets for CRPF Jawans And Armymen

హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైన మూడో టెస్టు శనివారం రాంచీ వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్(జేఎస్‌సీఏ) వినూత్నంగా ఆలోచించింది. సీఆర్పీఎఫ్‌ జవాన్లు, సైనికులు, ఎన్‌సీసీ క్యాడెట్ల కోసం ఉచితంగా 5000 టికెట్లను పక్కనబెట్టింది.

రాంచీ ఆతిథ్యమిస్తోన్న రెండో టెస్టు కావడంతో యూనిఫాం ధరించి దేశానికి సేవ చేస్తున్నవారికి ఉచితంగా టికెట్లు ఇవ్వాలని జేఎస్‌సీఏ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జేఎస్‌సీఏ సెక్రటరీ సంజయ్ సహాయ్ మాట్లాడుతూ "సీఆర్పీఎఫ్‌ జవాన్లు, సైనికులు, ఎన్‌సీసీ క్యాడెట్ల కోసం 5000 టికెట్లు పక్కనపెట్టాం" అని తెలిపాడు.

"యూనిఫాంలో ఉన్న పురుషులకు ఇదే మా నివాళి. దీంతో పాటు వివిధ జిల్లాల్లోని పాఠశాల విద్యార్థులకు కూడా మేము టికెట్లు పంచిపెట్టాం" అని జేఎస్‌సీఏ కార్యదర్శి సంజయ్‌ సహాయ్‌ పేర్కొన్నాడు. భారత ఆర్మీకి భారత క్రికెట్ ఘన నివాళి అందించడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినందుకు వీర జవాన్లకు నివాళిగా టీమిండియా ఆర్మీ క్యాప్‌లను ధరించి ఆడిన సంగతి తెలిసిందే.

భారత ఆర్మీలో లెప్ట్‌నెంట్ హోదాలో ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన చేతుల మీదుగా జట్టులోని మిగితా ఆటగాళ్లందరికీ ఆర్మీ క్యాప్‌లను అందించాడు. అప్పట్లో ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, బీసీసీఐ అనుమతి తీసుకునే క్యాప్‌లను ధరించిందని ఐసీసీ తెలపడంతో వివాదం సద్దుమణిగింది.

కాగా భారత్‌, దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు వేర్వేరు హోటళ్లలో గదులు కేటాయించడంలో తమ పాత్రేమీ లేదని జేఎస్‌సీఏ సెక్రటరీ సంజయ్ సహాయ్ తెలిపాడు. రాంచీ స్టేడియానికి 13 కిలోమీటర్ల దూరంలో సఫారీలకు, 9 కిలోమీటర్ల దూరంలో టీమిండియాకు బస ఏర్పాటు చేశారు. సాధారణంగా రెండు జట్లు ఒకే హోటల్‌లో బస చేస్తాయి.

అయితే, ఈసారి అందుకు భిన్నంగా విడిది ఏర్పాటు చేశారు. ఈసారి డాక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతుండటంతో వేర్వేరుగా ఏర్పాటు చేయాల్సి వచ్చిందని సంజయ్ సహాయ్ తెలిపాడు. "గదులను ఏడాది ముందుగానే బుక్‌ చేస్తారు. ఏదేమైనప్పటికీ గదులు బుక్‌ చేసింది మేం కాదు. బీసీసీఐ" అని సంజయ్‌ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే, జేఎస్‌సీఏ స్టేడియం కెపాసిటీ 39000. ఈ స్టేడియం ఆతిథ్యమిస్తోన్న రెండో టెస్టు మ్యాచ్ ఇది. మార్చి 16, 2017లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్టు డ్రాగా ముగిసింది. అంతకముందు ఈ స్టేడియం ఐదు వన్డేలు, రెండు టీ20లకు కూడా ఆతిథ్యమిచ్చింది.

Story first published: Thursday, October 17, 2019, 18:40 [IST]
Other articles published on Oct 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+