హైదరాబాద్: మూడో టెస్టులో టీమిండియా స్ఫిన్ పిచ్ వ్యూహం మంచి ఫలితాలనిచ్చింది. వన్డే, టీ20 సిరిస్‌లను కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా టెస్టు సిరిస్‌లో ఇబ్బంది పడుతోంది. మూడో టెస్టు మూడు రోజుల్లోనే ముగించేలా భారత్ భారీ ప్రణాళికనే సిద్ధం చేసింది.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య నాగ్‌పూర్‌లో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 14 ఓవర్లకు గాను 2 వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసింది. ఎల్గర్ 10, ఆమ్లా 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు లక్ష్య చేధనలో 278 పరుగులు వెనకబడి ఉంది.
ఏదైనా అద్భుతం జరిగితే తప్ప దక్షిణాఫ్రికా ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్ లో 215 పరుగులు చేసి రాణించిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్ లో కేవలం 173 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం 310 పరుగులుగా నిర్దేశించింది.
భారత్ బ్యాట్స్‌మెన్లలో అత్యధికంగా శిఖర్ ధావన్ 39 పరుగులు చేయగా, ఆ తర్వాత పూజారా 31, రోహిత్ శర్మ 23, విరాట్ కోహ్లీ 16, అమిత్ మిశ్రా 14, అశ్విన్ 7, జడేజా 5, సాహా 7, రహానే 9 పరుగులకే పెవిలియన్‌కు చేరారు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ 5 వికెట్లు తీసుకోగా, మోర్కెల్ 3, డుమిని, హార్మర్ చెరో వికెట్ తీసుకున్నారు.
మ్యాచ్ సమ్మరీ:
ప్రస్తుతం టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయడంలో 307 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. 52/2 పరుగులతో ఉన్న టీమిండియా ఆ తర్వాత జట్టు స్కోరు 97-108 పరుగుల మధ్య వరుసగా శిఖర్ ధావన్ (39), విరాట్ కోహ్లి (16), రహానె (9) వికెట్లను కేవలం 11 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. అంతక ముందు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ స్వల్ప వ్యవధిలోనే భారత్ రెండు వికెట్లను కోల్పోయింది.
తాహిర్ బౌలింగ్‌లో సాహా(7) ఔట్‌కాగా ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన జడేజా(5), హర్మర్ బౌలింగ్‌లో వెంటనే పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా 128 పరుగులు చేసింది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా పట్టు బిగించింది.
11/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా 79 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 136 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో రోజు ఆట ఆరంభం నుంచే దక్షిణాఫ్రికా తడబడింది. సఫారీలపై భారత బౌలర్ల హవా కొనసాగింది. భారత్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు తీసుకోగా, రవీంద్ర జడేజా 4, అమిత్ మిశ్రా ఒక వికెట్ తీసుకున్నారు.
టాస్ గెలిచిన బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 215 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికాను 79 పరుగులకే ఆలౌట్ చేసి నాగ్‌పూర్ టెస్టు మ్యాచ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. 1990లో చండీగడ్‌లో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను 82 పరుగులకు ఆలౌట్ చేసింది. టెస్టు క్రికెట్‌లో ప్రత్యర్ధి జట్టును అతి తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన భారత్ రికార్డు ఇదే.
79 - South Africa in Nagpur, 2015
82 - Sri Lanka in Chandigarh, 1990
83 - Australia in Melbourne, 1981
84 - South Africa in Johannesburg, 2006
91 - Bangladesh in Dhaka, 2000
93 - Australia in Mumbai, 2004
94 - New Zealand in Hamilton, 2002
100 - New Zealand in Wellington, 1981
101 - England in London (The Oval), 1971
101 - New Zealand in Auckland, 1968
మ్యాచ్ సమ్మరీ:
దక్షిణాఫ్రికా జట్టులో జెపీ డుమిని 35 అత్యధిక పరుగులు చేసి రాణించగా, మిగతా ఆటగాళ్లు మోర్కెల్ 1, విల్లాస్ 1, హార్మర్ 13, డుప్లెసిస్‌ను 10, డివిల్లియర్స్ డకౌట్‌గా వెనుదిగారు. జట్టు స్కోరు 66 పరుగుల వద్ద హార్మర్ (13) ఔట్ అవడంతో దక్షిణాఫ్రికా 28 ఓవర్లకు గాను 8 వికెట్లను నష్టపోయింది. ఒకానొకదశలో దక్షిణాఫ్రికా 12 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది.
దక్షిణాఫ్రికా చరిత్రలోనే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనడం ఇదే తొలిసారి. 35 పరుగుల వద్ద డుప్లెసిస్ రూపంలో 6 వికెట్‌ను కోల్పోయింది. డుప్లెసిస్‌ను 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రవీంద్ర జడేజా పెవలియన్‌కు పంపాడు. అంతక ముందు 14 ఓవర్లకు గాను దక్షిణాఫ్రికా 5 వికెట్లను కోల్పోయిన దక్షిణాఫ్రికా 21 పరుగులు చేసింది.
రెండో రోజు ప్రారంభమైన తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా డివిల్లియర్స్ రూపంలో ఐదో వికెట్‌ను కోల్పోయింది. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డివిల్లియర్స్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అంతకముందు ఔటైన కెప్టెన్ హషీం ఆమ్లా 1, ఇమ్రాన్ తాహిర్ 4 పరుగులు చేశారు.
జట్ల వివరాలు:
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, శిఖర్ ధావన్, చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ.
దక్షిణాఫ్రికా: హషీమ్ ఆమ్లా (కెప్టెన్), ఎబి డివిలియర్స్, డీన్ ఎల్గార్ ఫాఫ్ డు ప్లెసిస్, జెపి డుమినీ, సైతాన్ వాన్, డేన్ విలాస్ (వికెట్ కీపర్), సైమన్ హార్మర్, ఇమ్రాన్ తాహిర్, మోర్న్ మోర్కెల్, కగిసో రబాడ.