న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ కారణంతోనే మేము మారాల్సి వచ్చింది: భువనేశ్వర్

India vs South Africa, 3rd T20I: We are ready to go to England and Australia, says a spirited Bhuvneshwa

హైదరాబాద్: సఫారీ పర్యటనలో అదరగొట్టిన భారత జట్టులో కీలక పాత్ర వహించింది భారత బౌలర్లే. భారత పిచ్‌లపై కాదు విదేశాల్లోనూ తమకు పోటీ లేదంటూ దూసుకెళ్లారు. భువనేశ్వర్, చాహల్ పేర్లైతే ప్రతి మ్యాచ్ లోనూ వినిపిస్తూనే ఉన్నాయి. పర్యటనలో ఆఖరి సిరీస్ అయిన టీ20 సిరీస్‌లో మ్యాన్‌ ఆఫ్ ద సిరీస్‌ అవార్డు గెలుచుకున్న భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తన ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు.

గత కొంతకాలంగా తన బౌలింగ్‌లో వైవిధ్యం పెరిగిందని పేర్కొన్న భువీ.. ఈ మార్పుకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) కారణమని స‍్పష్టం చేశాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు గెలుచుకున్న క్రమంలో మాట్లాడిన భువీ..' ప్రతీ సిరీస్‌కు మనం ఎలా సన్నద్ధం అవుతున్నామన్నదే ఇక్కడ ముఖ్యం. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతీ సిరీస్‌కు ముందు ఒక కచ‍్చితమైన ప్రణాళిక రచించుకుంటా. ఇటీవల నా బౌలింగ్‌లో వైవిధ్యం పెరిగింది' అని స్పష్టం చేశాడు.

దానికి కారణం ఐపీఎల్‌ అన్నాడు. ఇంకా మాట్లాడుతూ.. భారత బౌలర్లను ఒక ఆలోచనలో పడేసి రాటుదేలేలా చేసింది మాత్రం ఐపీఎలే. మాలో మార్పుకు కారణం అదే. పవర్‌ ప్లేలో సాధ్యమైనంత నియంత్రణతో బౌలింగ్‌ చేయడం ఎలానో ఐపీఎల్‌ ద్వారా నేర్చుకున్నాం. ఈ క్రమంలోనే నకుల్‌ బాల్స్‌, స్లో బంతులను సంధించి సక్సెస్‌ అయ్యాం. ఇదే మంత్రాన్ని అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌లో కూడా ప‍్రయోగిస్తూ ముందుకు వెళుతున్నాం. ప్రధానంగా విదేశాల్లో వికెట్ల తీయడాన్ని వంట బట్టించుకున్నాం. ఇదే ప్రదర్శనను ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా పర్యటనల్లో కూడా పునరావృతం చేస్తాం' అని భువీ పేర్కొన్నాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే వేలానికి ముందు కెప్టెన్ డేవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్‌లను అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు:

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు:
1. డేవిడ్ వార్నర్ - రూ. 5 కోట్లు
2. భువనేశ్వర్ కుమార్ - రూ. 5 కోట్లు

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
3. శిఖర్ ధావన్ - రూ. 5 కోట్లు
4. షకీబ్ అల్ హసన్ - రూ.2 కోట్లు
5. కేన్ విలియమ్సన్ - రూ.3 కోట్లు
6. మనీష్ పాండే - రూ. 11 కోట్లు
7. కార్లోస్ బ్రాత్‌వైట్ - రూ.2 కోట్లు
8.యూసుఫ్ పఠాన్ - రూ. 1.9 కోట్లు
9. వృద్ధిమాన్ సాహా - రూ. 5 కోట్లు
10. కర్ణ్ శర్మ- రూ. 5 కోట్లు
11. రషీద్ ఖాన్ - రూ.9 కోట్లు
12. రిక్కీ భుయి - రూ.20 లక్షలు
13. దీపక్ హుడా- రూ.3.6 కోట్లు
14. సిద్ధార్థ్ కౌల్‌ - రూ.3.8 కోట్లు
15. నటరాజన్‌ - రూ.40 లక్షలు
16. సయ్యద్ ఖలీల్ అహ్మద్‌ - రూ.3 కోట్లు
17. మహ్మద్ నబీ- రూ. కోటి
18. సందీప్ శర్మ- రూ. 3 కోట్లు
19. సచిన్ బేబీ- రూ. 20 లక్షలు
20. క్రిస్ జోర్డాన్- రూ. కోటి
21. బిల్లీ స్టాన్‌లేక్‌ - రూ.50 లక్షలు
22. తన్మయ్ అగర్వాల్‌ - రూ.20 లక్షలు
23. శ్రీవాత్స్ గోస్వామి- రూ. కోటి
24. బిపుల్ శర్మ - రూ.20 లక్షలు
25. మోహదీ హసన్‌ - రూ.20 లక్షలు

Story first published: Sunday, February 25, 2018, 16:55 [IST]
Other articles published on Feb 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X