డికాక్ కెప్టెన్ ఇన్నింగ్స్.. మూడో టీ20లో దక్షిణాఫ్రికా ఘన విజయం.. సిరీస్ సమం!!

బెంగళూరు: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన చివరిదైన మూడో టీ-20లో దక్షిణాఫ్రికా 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. కృనాల్ బౌలింగ్‌లో బవుమా సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించాడు. భారత్ నిర్దేశించిన 135 పరుగుల విజయ లక్ష్యంను దక్షిణాఫ్రికా 16.5 ఓవర్లలో ఛేదించి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. మొదటి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో మ్యాచ్ టీమిండియా, మూడో మ్యాచ్ దక్షిణాఫ్రికా గెలిచాయి.

ఆరంభం నుండే దూకుడు:
135 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభం నుండే బ్యాట్ ఝళిపించింది. ఓపెనర్లు హెండ్రిక్స్, డికాక్‌లు భారత బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్నారు. ఈ జోడి స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు చేశారు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మార్చిమార్చి బౌలర్లను ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది.

డికాక్ షో:
అయితే పాండ్యా ఓ అద్భుత బంతికి హెండ్రిక్స్ ఔట్ అవ్వడంతో 76 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 28 పరుగులు చేసిన హెండ్రిక్స్.. కోహ్లీ పట్టిన అద్భుత క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. మరోవైపు క్రీజులో పాతుకుపోయిన డికాక్.. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ 79 (52 బంతుల్లో; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) పూర్తి చేసుకున్నాడు. అతనికి బవుమా (27) మంచి సహకారం అందించాడు. చివరలో డికాక్, బావుమా చెలరేగడంతో సౌతాఫ్రికా మరో 3.1 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. హార్ధిక్ పాండ్యా ఒక వికెట్ తీశాడు. దీంతో సిరీస్ 1-1తో సమమైంది.

ఆదిలోనే షాక్:
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (9) పూర్తిగా నిరాశపరిచాడు. అనంతరం ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడారు. దీంతో 5 భారత్ ఒక వికెట్ కోల్పోయి 41 పరుగులు చేసింది. ఆ తర్వాతి ఓవర్లో ధావన్ రెండు సిక్సులు బాదంతో స్కోర్ ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలో భారీ షాట్ ఆడిన ధావన్ క్యాచ్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు.

10 ఓవర్లలో 58 పరుగులే:
ధావన్ ఔట్ అయిన తర్వాతి ఓవర్లో కోహ్లీ (9) కూడా భారీ షాట్ ఆడి నిష్క్రమించాడు. ప్రొటీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ 10 ఓవర్లలో మూడు వికెట్లకు 76 పరుగులు చేసింది. రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ క్రీజులో ఉన్నా.. స్కోర్ బోర్డు వేగం మాత్రం పెరగలేదు. పంత్ (19) కొద్దిసేపు క్రీజులో ఉన్నా .. అయ్యర్ (5), కృనాల్ (4) పూర్తిగా నిరాశపరిచారు. హార్దిక్ పాండ్యా (14), జడేజా (19) వేగంగా ఆడలేకపోయారు. ఇన్నింగ్స్ చివరలో వరుసగా వికెట్లు కోల్పోయిన భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. చివరి 10 ఓవర్లలో భారత్ 58 పరుగులు మాత్రమే చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కాగిసో రబాడా 3 వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications