For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికాతో మూడో టీ20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

India Vs South Africa,3rd T20I:Kohli Wins Toss,Elects To Bat First
India vs South Africa, 3rd T20I: India have won the toss and have opted to bat

బెంగళూరు: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న చివరిదైన మూడో టీ20లో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు దక్షిణాఫ్రికా ఒక మార్పు చేసింది. హెండ్రిక్స్ స్థానంలో నొర్జీ జట్టులోకి వచ్చారు. అయితే మ్యాచ్‌కు వరణుడి ముప్పు ఉంది.

నాలుగేళ్ల క్రితం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌ 0-2తో ఓడింది. ఇప్పుడు ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. ఇప్పటికే ఆధిక్యంలో ఉన్న భారత్..ఈ మ్యాచ్‌ను గెలుచుకుంటే సిరీస్‌ 2-0తో వశమవుతుంది. అలాగే మూడు టెస్టుల సిరీస్‌ను కూడా ఆత్మవిశ్వాసంతో ఆరంభించవచ్చు. మరోవైపు దక్షిణాఫ్రికా తమ శక్తిమేరా రాణించి సిరీస్‌ను సమం చేయడమే ధ్యేయంగా బరిలోకి దిగబోతోంది.

టీ20 ప్రపంచక్‌పనకు మరో 25 మ్యాచ్‌లే ఉండడంతో భారత్ మరీ ఎక్కువ ప్రయోగాలకు వెళ్లలేదు. ఫామ్ లేమితో సతమవుతున్న ఓపెనర్ శిఖర్ ధావన్ రెండో టీ20లో 40 పరుగులు చేసి తిరిగి ట్రాక్‌లోకి రావడం జట్టుకు సానుకూలాంశం. మరో ఓపెనర్ రోహిత్‌ శర్మ బ్యాట్‌ ఝుళిపిస్తే భారీ స్కోరు ఖాయయే. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌ గురించి చెప్పాల్సిందేమీ లేదు.ఇక పంత్ షాట్ సెలెక్షన్ ఆందోళన రేపుతోంది. తీవ్ర ఒత్తిడిలో అతడు ఏమేరకు ఆడతాడనేది వేచిచూడాల్సిందే.

జట్లు:
భారత్‌: రోహిత్‌ శర్మ, శిఖర్ ధవన్‌, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), శ్రేయాస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్ పాండ్యా/రాహుల్‌ చాహర్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్ సైనీ.

దక్షిణాఫ్రికా: డికాక్ (కెప్టెన్), నొర్జీ, డసెన్, బవుమా, మిల్లర్, ఫెలుక్వాయో, ప్రిటోరియస్, జోర్న్ ఫార్చూన్, రబాడ, జూనియర్ డాలా, షంసీ.

Story first published: Sunday, September 22, 2019, 18:55 [IST]
Other articles published on Sep 22, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+