India vs South Africa, 3rd T20I: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. పంత్ ఫామ్‌పై ఆందోళన

బెంగళూరు: నాలుగేళ్ల క్రితం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20లసిరీస్‌లో భారత్ 0-2తో ఓడింది. ఇప్పుడు ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. దాదాపు ఆరు నెలల తర్వాత సొంతగడ్డపై సిరీస్ ఆడుతున్న టీమిండియా తొలి మ్యాచ్‌లో సునాయాస విజయాన్ని అందుకుని మంచి ఊపు మీదుంది. చివరి మ్యాచ్‌లోనూ అదే ఆధిపత్యం కొనసాగించి సిరీస్ చేజిక్కించుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. దక్షిణాఫ్రికా మాత్రం పరువు నిలుపుకునేందుకు ఈ మ్యాచ్ గెలవాలని ఆరాటపడుతోంది.
ధర్మశాలలో జరిగిన మొదటి మ్యాచ్ వర్షార్పణం అయిన విషయం తెలిసిందే. ఈ రోజు రాత్రి 7 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఆఖరి మ్యాచ్‌ను గెలుచుకుంటే సిరీస్ 2-0తో వశమవుతుంది. అలాగే మూడు టెస్టుల సిరీస్‌ను కూడా ఆత్మవిశ్వాసంతో ఆరంభించవచ్చు. మరోవైపు దక్షిణాఫ్రికా తమ శక్తిమేరా రాణించి సిరీస్‌ను సమం చేయడమే ధ్యేయంగా బరిలోకి దిగబోతోంది.

ఫామ్‌లో టాప్-3:
టీ20 ప్రపంచక్‌పనకు మరో 25 మ్యాచ్‌లే ఉండడంతో భారత్ మరీ ఎక్కువ ప్రయోగాలకు వెళ్లే అవకాశం లేదు. ఫామ్ లేమితో సతమవుతున్న ఓపెనర్ శిఖర్ ధావన్ రెండో టీ20లో 40 పరుగులు చేసి తిరిగి ట్రాక్‌లోకి రావడం జట్టుకు సానుకూలాంశం. మరో ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాట్ ఝుళిపిస్తే భారీ స్కోరు ఖాయయే. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ గురించి చెప్పాల్సిందేమీ లేదు. జట్టు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటాడు. ఐపీఎల్లో ఇక్కడ లెక్కకు మిక్కి లి మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న విరాట్‌ను ఆపడం ప్రత్యర్థికి శక్తికి మించిన పనే.

తీవ్ర ఒత్తిడిలో పంత్:
రిషభ్ పంత్ పరిస్థితే దారుణంగా తయారైంది. వరుసగా సింగిల్ డిజిట్‌లకే పరిమితమవుతుండగా ఇప్పుడతడి స్థానానికే ఎసరు వచ్చేలా ఉంది. ఇక పంత్ షాట్ సెలెక్షన్ ఆందోళన రేపుతోంది. తీవ్ర ఒత్తిడిలో అతడు ఏమేరకు ఆడతాడనేది వేచిచూడాల్సిందే. మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్ రూపంలో మంచి బ్యాట్స్‌మన్ ఉండటం అదనపు ప్రయోజనం. పరిస్థితులకు తగ్గట్లు ఆడుతున్న అయ్యర్ ఇదే నిలకడ కొనసాగిస్తే.. జట్టులో చోటు సుస్థిరం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

రాహుల్ చాహర్ వస్తాడా:
ఆల్‌రౌండర్లు హార్దిక్, కృనాల్, జడేజాకు గత మ్యాచ్‌లో బ్యాటింగ్ అవకాశం రాకున్నా.. బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించారు. అయితే రాహుల్ చాహర్ కోసం కృనాల్‌ను తప్పించే అవకాశం ఉంది. వాషింగ్టన్ సుందర్ కొత్త బంతితో ఆకట్టుకుంటున్నాడు. పేసర్లు దీపక్ చాహర్, నవదీప్ సైనీ సీనియర్లు లేని లోటు కనబడకుండా అద్భుతంగా రాణిస్తున్నారు. దీపక్ అదే జోరు కొనసాగించాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తున్నది. ఖలీల్ అహ్మద్‌కు నిరాశే ఎదురుకావొచ్చు.

మిల్లర్, డాలాలు రాణిస్తేనే:
దక్షిణాఫ్రికా కొత్త కెప్టెన్ క్వింటన్ డికాక్ గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు. డికాక్ క్రీజులో ఉన్నంత సేపు మ్యాచ్‌లో సఫారీలు మెరుగ్గానే కనిపించారు. అయితే మిడిలార్డర్‌లో ఇన్నింగ్స్‌ను నిలబెట్టే బ్యాట్స్‌మన్ లేకపోవడం ప్రొటీస్ జట్టు విఫలమయింది. టెస్టు ఆటగాడిగా ముద్రపడ్డ బవుమా పొట్టి ఫార్మాట్‌లో అరంగేట్రంతోనే చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతడు స్ట్రయిక్‌రేట్ తక్కువగా ఉంది. భారత గడ్డపై అపార అనుభవం ఉన్న మిల్లర్ విజృంభించాల్సిన అవసరముంది. హెన్‌డ్రిక్స్, డుస్సెన్‌లను కూడా ప్రొటీస్ నమ్ముకుంది. రబాడ బౌలింగ్‌లో తేలిపోవడంతో మరో పేసర్ జూనియర్ డాలానే నమ్ముకుంది.

తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా/రాహుల్ చాహర్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, నవదీప్ సైనీ.
దక్షిణాఫ్రికా: డికాక్ (కెప్టెన్), హెండ్రిక్స్, డసెన్, బవుమా, మిల్లర్, ఫెలుక్వాయో, ప్రిటోరియస్, జోర్న్ ఫార్చూన్, రబాడ, జూనియర్ డాలా, షంసీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications