
హైదరాబాద్: కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 124 పరుగుల తేడాతో విజయం సాధించింది. 304 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా భారత మణికట్టు స్పిన్నర్లు యజువేంద్ర చాహల్ (4/46), కుల్దీప్ యాదవ్ (4/23), పేసర్ బుమ్రా (2/32) దెబ్బకు 40 ఓవర్లకు గాను 179 పరుగులు చేసి కుప్పకూలింది.
సఫారీ బ్యాట్స్‌మెన్‌లలో డుమిని (51) హాఫ్ సెంచరీ నమోదు చేయగా మిగిలివారంతా తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 303 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తాజా విజయంతో ఆరు వన్డేల సిరిస్‌లో టీమిండియా 3-0 ఆధిక్యంలో నిలిచింది.
అంతేకాదు సఫారీ గడ్డపై కోహ్లీసేన వరుసగా మూడు వన్డేల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాలో ఒక సిరీస్‌లో మూడు వన్డేలు వరుసగా గెలిచిన భారత తొలి జట్టుగా అవతరించింది.
దక్షిణాఫ్రికా బ్యాటింగ్ తీరు సాగిందిలా:
ఐదో వికెట్ కోల్పోయిన దక్షిణాప్రికా
భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా ఐదో వికెట్ చేజార్చుకుంది. డేవిడ్ మిల్లర్ (25) పరుగుల వద్ద ఔటయ్యాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 32.3వ బంతిని భారీ షాట్ ఆడబోయిన మిల్లర్ ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో జొండొ (11), క్రిస్ మోరిస్ (3) పరుగులతో ఉన్నారు.
కష్టాల్లో దక్షిణాప్రికా
భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. 304 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 95 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. మూడో వన్డేలో అరంగేట్రం చేసిన హెన్రిచ్ (6), హాఫ్ సెంచరీతో రాణించిన జేపీ డుమిని (51)ని స్పిన్నర్ చాహల్ పెవిలియన్‌కు చేర్చాడు. 27 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది.
నిలకడగా దక్షిణాఫ్రికా బ్యాటింగ్
న్యూలాండ్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. 304 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలకు బుమ్రా ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు. రెండో ఓవర్‌లోనే ఓపెనర్ ఆమ్లా(1)ని ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన డుమినీ(32) కలిసి కెప్టెన్ మర్క్రమ్ (22) నిలకడగా ఆడుతున్నాడు. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది.
ఒక పరుగుకే తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాప్రికా
కేప్ టౌన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా ఒక పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ హషీమ్ ఆమ్లా (1)ను బుమ్రా ఎల్బీ రూపంలో పెవిలియన్ పంపించాడు. 5 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మార్క్రమ్ (13), డుమిని (12) పరుగులతో క్రీజులో ఉన్నారు.
సఫారీల విజయ లక్ష్యం 304
కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడో వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య దక్షిణాఫ్రికాకు 304 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కోహ్లీసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
తొలి ఓవర్ ఆఖరి బంతికే ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరి నిరాశపరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ (160 నాటౌట్; 159 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సులు)తో అద్భుత ప్రదర్శన చేశాడు. కోహ్లీ 150కి పైగా పరుగులు చేయడం ఇది మూడోసారి.
ఈ క్రమంలో తన కెరీర్‌లో 34వ సెంచరీని నమోదు చేశాడు. కోహ్లీతో పాటు ఓపెనర్ ఓపెనర్ శిఖర్ ధావన్ (76; 63 బంతుల్లో 12 ఫోర్లు) రాణించడంతో భారత్ 6 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. తాజా ఇన్నింగ్స్‌తో సఫారీ గడ్డపై గంగూలీ 2001లో జోహెన్స్ బర్గ్‌లో సాధించిన 127 పరుగుల స్కోరుని కెప్టెన్ విరాట్ కోహ్లీ అధిగమించాడు.
అంతేకాదు సఫారీ గడ్డపై అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. భారత బ్యాట్స్‌మెన్‌లలో రహానే (11), పాండ్యా (14), ధోని (10), జాదవ్ (1), భువనేశ్వర్ (16 నాటౌట్) పరుగులు చేశారు. సఫారీ బౌలర్లలో డుమిని రెండు వికెట్లు తీసుకోగా... రబాడ, మోరిస్, ఫెహ్లుక్‌వాయో, తాహిర్ తలో వికెట్ తీశారు.
భారత్ బ్యాటింగ్ తీరు సాగిందిలా:
వన్డేల్లో 34వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడో వన్డేలో కెప్టెన్ కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. డుమిని వేసిన 39.1వ బంతికి రెండు పరుగులు తీసి వన్డే కెరీర్‌లో 34వ సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో 128 బంతులు ఆడిన 8 ఫోర్లతో విరాట్ కోహ్లీ సెంచరీని నమోదు చేశాడు. సఫారీ పర్యటనలో కోహ్లీకి మూడో సెంచరీ కావడం విశేషం. దీంతో భారత్ 41 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది.
తాజా సెంచరీతో విరాట్ అత్యధిక సెంచరీలు చేసిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. గతంలో 11 సెంచరీలతో మాజీ కెప్టెన్ గంగూలీ పేరిట ఉన్న ఈ రికార్డును కెప్టెన్ స్థానంలో 12 సెంచరీలు చేసి కోహ్లీ అధిగమించాడు. అయితే 11 సెంచరీలు చేసేందుకు గంగూలీ 142 ఇన్నింగ్స్ తీసుకోగా.. విరాట్ కోహ్లీ మాత్రం కేవలం 43 ఇన్నింగ్స్‌ల్లో సాధించడం విశేషం. ఈ సెంచరీ కోహ్లీ కెరీర్‌లోనే అత్యధిక బంతుల్లో చేసిన సెంచరీగా నిలిచింది.
నాలుగు వికెట్లు కోల్పోయిన ఇండియా
కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడో వన్డేలో భారత్ నాలుగు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి రెండో వికెట్‌కి 140 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.
76 పరుగుల వ్యక్తిగత స్కోర్ చేసి శిఖర్ ధావన్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రహానే (11) పరుగుల వద్ద డుమిని బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కొంత సమయానికే హార్థిక్ పాండ్యా(14) మోరిస్ బౌలింగ్‌లో కీపర్ క్లాసీన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు.
దీంతో 34 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. క్రీజ్‌లో కోహ్లీ(84), ధోని(1) ఉన్నారు.
శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ
కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడో వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ చేశాడు. 47 పరుగుల వద్ద ఇమ్రాన్ తాహిర్ వేసిన 16.2వ బంతికి స్వీప్‌షాట్ ద్వారా బౌండరీ సాధించి కెరీర్‌లో 25వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ (41) హాఫ్ సెంచరీ చేరువయ్యాడు. వీరిద్దరి 105 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రస్తుతం 18 ఓవర్లకు గాను భారత్ వికెట్ నష్టానికి 105 పరుగులు చేసింది.
10 ఓవర్లకు భారత్ 50/1
కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 10 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శిఖర్ ధావన్ (24), విరాట్ కోహ్లీ (25) పరుగులతో ఉన్నారు.
5 ఓవర్లకు భారత్ 23/1
కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శిఖర్ ధావన్ (13), విరాట్ కోహ్లీ (9) పరుగులతో ఉన్నారు. అంతకముందు ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఆఖరి బంతికి ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరిన సంగతి తెలిసిందే.

రోహిత్ శర్మ డకౌట్: తొలి వికెట్ కోల్పోయిన భారత్
కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. తొలి ఓవర్ ఆఖరి బంతికి కగిసో రబాడ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. పేసర్ రబాడ వేసిన ఆరో బంతిని ఎదుర్కొన్న అతడు క్లాసెన్ చేతికి చిక్కాడు. అంతకముందు నాలుగో బంతికి క్యాచ్ ఔట్ ప్రమాదం తప్పించుకున్నా చివరి బంతికి పెవలియన్‌కు చేరాడు. దీంతో టీమిండియా పరుగుల ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 2 ఓవర్లకు గాను భారత్ వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది. క్రీజులో ధావన్ 4, కోహ్లీ పరుగులేమీ చేయకుండా ఉన్నారు.
మూడో వన్డేలో భారత్ బ్యాటింగ్
ఆరు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం మూడో వన్డే ప్రారంభమైంది. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది.
భారత్-దక్షిణాఫ్రికా 3వ వన్డే స్కోరు కార్డు
మూడో వన్డేలో సఫారీలు రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నారు. గాయం కారణంగా ఈ సిరిస్ నుంచి తప్పుకున్న వికెట్ కీపర్ డికాక్ స్థానంలో హెన్రిచ్ క్లాసెన్ అరంగేట్రం చేస్తుండగా, లుంగిడి ఎంగ్డి కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఈ సిరిస్‌లో ఇప్పటికే రెండు వన్డేలు గెలిచిన కోహ్లీసేన బుధవారం జరిగే మూడో వన్డేలో గెలిచి సిరీస్‌లో ఆధిక్యాన్ని 3-0కు పెంచుకోవాలని చూస్తోంది. మరోవైపు దక్షిణాఫ్రికా ఈ సిరీస్‌ను దక్కించుకోవాలంటే వరుసగా నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించాల్సి ఉంది.
అయితే, ప్రస్తుతం ఆ జట్టు ఫామ్, ఆటగాళ్లను గాయాలు వేధిస్తుండటంతో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కాగా, దక్షిణాఫ్రికాకు వన్డేల్లో గొప్ప రికార్డున్న న్యూలాండ్స్‌లో ఈ మ్యాచ్ జరగనుండటం వారికి కలిసొచ్చే అంశం. కేప్ టౌన్‌లో భారత్ నాలుగు మ్యాచ్‌లు ఆడగా భారత్ విజయాల సంఖ్య రెండుగా ఉంది.
ఇక ఈ గ్రౌండ్‌లో దక్షిణాఫ్రికా 33 మ్యాచ్‌లు ఆడగా, దక్షిణాఫ్రికా 28 విజయాలను సొంతం చేసుకుంది. ఈ వన్డేలో టీమిండియా గెలిస్తే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తమ నంబర్ వన్ స్థానాన్ని పదిలపరుచుకోవడమే కాదు. రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టుతో పాయింట్ల దూరాన్ని పెంచుకుంటుంది.
ఒకవేళ సఫారీలు గెలిస్తే భారత్ రెండో ర్యాంకుకు పడిపోతుంది. సఫారీ గడ్డపై 1992 నుంచీ ఇప్పటివరకు టీమిండియా ఒక వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు గెలిచిన దాఖలు లేదు. 2006లో 0-4, 2011లో 2-3, 2013లో 0-2తో వరుసగా సిరీస్‌లు కోల్పోయింది.
ప్రస్తుతం ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన మూడోవన్డేలోనూ గెలిస్తే.. తొలిసారి సఫారీ గడ్డపై హ్యాట్రిక్ విజయాల రికార్డును సాధిస్తుంది. అంతేకాదు సిరీస్ కూడా చేజారిపోకుండా ఉంటుంది.
జట్ల వివరాలు:
ఇండియా:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అజ్యింకె రహానే, కేదార్ జాదవ్, ధోని(వికెట్ కీపర్), హార్థిక్ పాండ్యా, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా
దక్షిణాఫ్రికా: ఐడెన్ మర్క్రమ్, ఆమ్లా, జెపీ డుమిని, ఇమ్రాన్ తాహిర్, డేవిడ్ మిల్లర్, మోర్నీ మోర్కెల్, క్రిస్ మోరిస్, లుంగిడి ఎంగ్డి, కగిసో రబాడ, ఖాయా జోండో, హెన్రిచ్ క్లాసెన్
Match starts at: 4.30 pm IST
Live: Sony TEN
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.