
హైదరాబాద్: దక్షిణాఫ్రికా జట్టుతో నానా కష్టాలు పడి భారత్ బౌలర్లు సఫారీ బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేశారు. అయినా భారత్ బ్యాట్స్‌మెన్‌లు ఏ మాత్రం సహకరించలేకపోయారు. 252 పరుగుల విజయ లక్ష్యం మిగిలి ఉండగానే రెండో రోజు సైతం వరుసగా వికెట్లు పడిపోతూనే ఉన్నాయి.
రెండో టెస్టు నాలుగో రోజుకు 35/2గా ఉన్న స్కోరు ఐదో రోజుకు 121/7 స్కోరును అతి కష్టంపై నడిపిస్తోంది. క్రీజులో ప్రస్తుతం రోహిత్ శర్మ, మొహమ్మద్ షమీ ఆడుతున్నారు.
అయితే భారత్ జట్టు పేలవ ప్రదర్శనకు వ్యంగ్యంగా స్పందించాడు. వీరేంద్ర సెహ్వాగ్. విభిన్న రీతిలో ట్వీట్లను పెట్టే సెహ్వాగ్ ఇక భారత్ ఓడిపోతుందా.. అన్న ప్రశ్నను తలెత్తే విధంగా ట్వీట్ చేశాడు. బాలీవుడ్ సినిమా 'లగాన్' లోని వీడియో క్లిప్‌ను ఉంచి ఇప్పుడు భారత్ నెగ్గాలంటే వర్షం రావాల్సిందే అంటూ ఛలోక్తి విసిరాడు.