న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డీకాక్‌తో వాగ్వాదానికి దిగిన రబడ.. సర్దిచెప్పిన డుప్లెసిస్‌ (వీడియో)

IND vs SA 2nd Test : Rabada And Quinton de Kock On Field Fight
India vs South Africa, 2nd Test: Kagiso Rabada fire on Quinton De Kock, Faf Du Plessis Intervenes

పూణే: మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పుణెలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులోనూ ఆతిథ్య భారత్ జోరు కొనసాగిస్తోంది. రెండో రోజు శుక్రవారం ఆటలో అన్ని రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తూ.. సఫారీలపై పైచేయి సాధించింది. రెండో రోజు కెప్టెన్ విరాట్ కోహ్లీ (254 నాటౌట్: 336 బంతుల్లో 33ఫోర్లు, 2సిక్సర్లు) అజేయ డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (91), రహానే (59)లు తమదైన శైలిలో రాణించడంతో భారత్ భారీ స్కోరు చేసింది.

కోహ్లీ డబుల్‌ సెంచరీ: పాంటింగ్ రికార్డు సమం.. బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు!!కోహ్లీ డబుల్‌ సెంచరీ: పాంటింగ్ రికార్డు సమం.. బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు!!

273/3 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 601/5 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. భారత బ్యాట్స్‌మన్‌ అలవోకగా బౌండరీలు బాదడంతో ప్రొటీస్ బౌలర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. ముఖ్యంగా స్టార్ పేసర్ కాగిసో రబడ. తొలిరోజు మూడు వికెట్లు తీసిన రబడ.. రెండో రోజు ఒక్క వికెట్ కూడా తీయలేదు. దీంతో అతనిలో అసహనం పెరిగింది.

ఇదే సమయంలో బౌలర్‌ను మార్చితే బాగుంటుందని కీపర్‌ క్వింటన్‌ డీకాక్‌.. కెప్టెన్‌ డుప్లెసిస్‌కు సూచించాడు. ఇది గమనించిన రబడలో అసహనం తీవ్రస్థాయికి చేరడంతో డీకాక్‌తో వాగ్వాదానికి దిగాడు. రబడ దూషించుకుంటూ డీకాక్‌ వద్దకు చేరే సమయంలో అక్కడే ఉన్న కెప్టెన్ డుప్లెసిస్.. రబడకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సమయంలో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు క్రీజులో ఉన్నారు. కోహ్లీ స్ట్రైకింగ్ చేస్తున్నాడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. క్రికెట్ అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'చూడటానికి భయంకరంగా ఉంది' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'షేమ్ లెస్' అని మరో నెటిజన్ కామెంట్ చేసాడు. 'టీమిండియా ఆటగాళ్ల దెబ్బకు రబడకు దిమ్మతిరిగింది. ఏం చేస్తున్నాడో తెలియడం లేదు', 'తోటి ఆటగాడిపైనే ఆగ్రహం. ఇది సరైన పద్దతి కాదు' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

శుక్రవారం ఆట ముగిసేసమయానికి తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 15 ఓవర్లో 3 వికెట్లకు 36 పరుగులు చేసింది. పేసర్ ఉమేశ్ యాదవ్ (2/16), మొహమ్మద్ షమీ (1/3) ఆరంభంలోనే విరుచుకుపడటంతో సౌతాఫ్రికా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు డీన్ ఎల్గర్ (6), మార్‌క్రమ్ (0)లను ఉమేశ్ పెవిలియన్ పంపగా.. బావుమాను షమీ ఔట్ చేసి సౌతాఫ్రికాను కోలుకోలేని దెబ్బకొట్టాడు. 33 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడిన సౌతాఫ్రికాను డిబ్రుయిన్ (20), నోర్జె (2) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.

Story first published: Friday, October 11, 2019, 19:59 [IST]
Other articles published on Oct 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X