దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ రెండో టెస్టు: అశ్విన్ చేతిలో మొదటి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికాల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మొదలైంది. లంచ్ విరామం వరకు ఒక్క వకెట్ కూడా కోల్పోకుండా ఆడిన దక్షిణాఫ్రికాకు తొలి వికెట్ ను కోల్పోయింది. అశ్విన్ వేసిన బంతిని ఎదుర్కొనేందుకు ఎల్గర్ షాట్ కొట్టాడు. ఆ బంతిని మురళీ విజయ్ క్యాచ్ పట్టడంతో దక్షిణాఫ్రికా మొదటి వికెట్ ను కోల్పోయింది.
తొలి టెస్టు విజయోత్సాహంతో కొనసాగుతున్న దక్షిణాఫ్రికా రెండో టెస్టులోనూ అదే విధంగా రాణిస్తోంది. లంచ్ విరామానికి 76/0 స్కోరుతో దూసుకెళుతుంది.
కేప్ టౌన్ తొలి టెస్టులో కలిసి వచ్చినంతగా ఈ మ్యాచ్ లో భారత బౌలర్లకు కలిసి రావడం లేదు. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెనలకు ఇప్పటికే 12 బౌండరీలను చేజార్చుకున్నారు.
తొలి పరాజయం అనంతరం భారీ పట్టుదలతో భారత్ రెండో టెస్టుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం మొదలైన మ్యాచ్ కు భారత్ టాస్ గెలుచుకుంది. దీంతో బ్యాటింగ్ ను ఎంచుకున్న సౌతాఫ్రికా ఆటగాళ్లు మరికొద్ది నిమిషాల్లో క్రీజులోకి రానున్నారు.
టీమిండియా తన తుది జట్టులో మూడు మార్పులు చేసింది. సాహా స్థానంలో పార్థీవ్ పటేల్, శిఖర్ ధావన్ స్థానంలో కేఎల్ రాహుల్, భువనేశ్వర్ స్థానంలో ఇషాంత్ శర్మకు చోటు దక్కింది. కాగా గాయం కారణంగా ఈ టెస్ట్‌కు స్టెయిన్ దూరంగా ఉన్నాడు. ఇక తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమిపాలు కావడంతో సఫారీలు 1-0 తో ఆధిక్యంలో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications