
హైదరాబాద్: దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరిస్ గెలవాలన్న 25 ఏళ్ల కల మరోసారి కలగానే మిగిలిపోయింది. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఓటమి పాలైంది. 287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 50.2 ఓవర్లలో 151 పరుగులు చేసి ఆలౌటైంది.
దీంతో ఈ టెస్టులో పర్యాటక జట్టుపై అతిథ్య దక్షిణాఫ్రికా 135 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 35/3తో బ్యాటింగ్ ఆరంభించిన భారత త్వరగానే వికెట్లను కోల్పోయింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా క్రీజులో నిలిచిన రోహిత్ శర్మ (47) కాసేపు దక్షిణాఫ్రికా విజయానికి అడ్డుపడ్డాడు.
దీంతో ఏదైనా అద్భుతం జరగకపోతుందా అని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. కానీ మరో మూడు పరుగులు చేస్తే హాఫ్ సెంచరీ పూర్తవుతుందనగా రబడ వేసిన 47.2వ బంతికి రోహిత్ శర్మ (47) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత షమి (28), బుమ్రా (2) వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది.
రెండో టెస్టు అరంగేట్ర బౌలర్ లుంగి ఎంగిడి ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. కెరీర్‌లో తొలి టెస్టు ఆడిన ఎంగిడి రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరు వికెట్లు తీసుకోవడం విశేషం. ఇందులో కీలకమైన కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా లాంటి వికెట్లు కూడా ఉన్నాయి.
దీంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. అంతకముందు కేప్‌టౌన్ వేదికగా వేదికగా జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 72 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో చివరిదైన మూడో టెస్టు జనవరి 24న జోహెన్స్ బర్గ్‌లోని న్యూ వాండర్స్ స్టేడియంలో జరగనుంది.
స్కోరు వివరాలు..:
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 335
భారత్ తొలి ఇన్నింగ్స్: 307
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 258
భారత్ రెండో ఇన్నింగ్స్: 151
భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడిందిలా:
వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 48వ ఓవర్ రెండో బంతికి దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ (47)ను కగిసో రడబ పెవిలియన్‌కు చేర్చగా, ఆ తర్వాతి 49వ ఓవర్ రెండో బంతికి లుంగి ఎంగ్డి బౌలింగ్‌లో మహమ్మద్ షమీ (28) పరుగుల వద్ద మోర్నీ మోర్కెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 49 ఓవర్లకు గాను 9 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బుమ్రా (2), ఇషాంత్ శర్మ (0) పరుగులతో ఉన్నారు.
ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 37వ ఓవర్ తొలి బంతికి రవిచంద్రన్ అశ్విన్ (3) పరుగుల వద్ద కీపర్ డీకాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 38 ఓవర్లకు గాను భారత్ 7 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ (20), షమీ (6) పరుగులతో ఉన్నారు.
పాండ్యా ఔట్: ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా
సెంచూరియన్ వేదికగా భారత్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా బౌలర్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 35 ఓవర్ మూడో బంతికి టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా (6) లుంగి ఎంగ్డీ బౌలింగ్‌లో కీపర్ డీకాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 36 ఓవర్లకు గాను భారత్ 6 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ (19), అశ్విన్ (0) పరుగులతో ఉన్నారు.
పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు ఐదోరోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే భారత్ రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోపడింది. ఇన్నింగ్స్ 30వ ఓవర్లో రబాడ వేసిన బంతిని ఎదుర్కొన్న పార్ధీవ్ పటేల్(19) దాన్ని గాల్లోకి లేపాడు. బౌండరీ లైన్ వద్ద మోర్నీ మోర్కెల్ ఆ బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు.
దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అంతకుముందు 27వ ఓవర్లో పుజారా(19) పరుగుల వద్ద రనౌటయ్యాడు. 31 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్ శర్మ(12), హార్దిక్ పాండ్య క్రీజులో ఉన్నారు.
భారత్ విజయానికి ఇంకా 217 పరుగులు చేయాల్సి ఉంది. కాగా, నాలుగో రోజు 287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు మురళి విజయ్(9), కేఎల్ రాహుల్(4)లను కోల్పోగా.... తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(5) సైతం రెండో ఇన్నింగ్స్‌లో నిరాశపరిచాడు.
చివరి రోజు ఆట ప్రారంభమైన ఆట
టీమిండియాపై ఆతిథ్య దక్షిణాఫ్రికా రికార్డు సాధించేందుకు గాను కేవలం ఏడు వికెట్ల దూరంలో ఉంది. సెంచూరియన్ టెస్టులో కూడా విజయం దక్షిణాఫ్రికానే ఊరిస్తోంది. ఎందుకంటే రెండో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సెంచూరియన్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు ఓ జట్టు ఛేదించిన అత్యధిక విజయ లక్ష్యం 226 పరుగులు.
India vs South Africa 2018 2nd Test Score Card
దీని ప్రకారం చూస్తే టీమిండియా ఛేదించాల్సిన 287 పరుగులు భారీ లక్ష్యంగానే కనిపిస్తోంది. ఈ టెస్టులో భారత బ్యాట్స్‌మన్ నిలిస్తే మ్యాచ్ డ్రా అవుతుంది. లక్ష్యాన్ని చేధించే క్రమంలో అద్భుతం జరిగితే తప్ప కోహ్లీసేన ఈ మ్యాచ్ గెలవడం చాలా కష్టం. కనీసం డ్రా అవ్వడమూ అనుమానంగానే ఉంది.
రెండో టెస్టులో చివరి రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోరు 35/3తో కోహ్లీసేన ఆటను ప్రారంభించింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.