Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెంచూరియన్ టెస్టు: సెంచరీతో చెలరేగిన కోహ్లీ

Kohli

హైదరాబాద్: సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ సెంచరీని సాధించాడు. 151 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో కోహ్లీ 103 పరుగులు నమోదు చేశాడు. టెస్టుల్లోకి కోహ్లీకి ఇది 21 సెంచరీ కావడం విశేషం.

ఓవర్‌నైట్‌ స్కోరు 183/5తో టీమిండియా మూడో రోజు ఆట ప్రారంభించింది. మరోవైపు వికెట్లు పడుతున్న కోహ్లీ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తిస్తున్నాడు. మూడో రోజైన సోమవారం ఇన్నింగ్స్ 66.1వ బంతికి రెండు పరుగులు చేసిన కోహ్లీ కెరీర్‌లో 21వ సెంచరీని సాధించాడు.

ఆ తర్వాత కొద్దిసేపటికే హార్దిక్‌ పాండ్యా (15) పరుగుల వద్ద రనౌట్‌ అయ్యాడు. దీంతో 70 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 6 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (103), రవిచంద్రన్‌ అశ్విన్‌ (22) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఇంకా 104 పరుగులు వెనకబడి ఉంది.

Story first published: Monday, January 15, 2018, 15:13 [IST]
Other articles published on Jan 15, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+