For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెంచూరియన్ టెస్టు: తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 335 ఆలౌట్

By Nageshwara Rao
India Vs South Africa, 2nd Test, Day 2: Shami removes Maharaj as hosts hope to dig deep

దక్షిణాఫ్రికా 335 ఆలౌట్
సెంచూరియన్ వేదికగా భారత్‌తో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు 335 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోరు 269/6తో రెండో రోజైన ఆదివారం ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా ఆదిలోనే కేశవ్ మహారాజ్ వికెట్ కోల్పోయింది.

18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షమీ బౌలింగ్‌లో కీపర్ పార్థీవ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చిన మహారాజ్ పెవిలియన్ చేరాడు. దీంతో దక్షిణాఫ్రికా 287 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. ఆదివారం భారత ఫీల్డర్ల ఫీల్డింగ్ తప్పిదాలు దక్షిణాఫ్రికాకు కలిసొచ్చింది.

అశ్విన్ బౌలింగ్‌లో వరుసగా రెండు బంతుల్లో ఫీల్డర్లు క్యాచ్ జారవిడవడంతో రబడకు లైఫ్ వచ్చింది. తర్వాత కూడా అతడికి మరోసారి లైఫ్ వచ్చింది. దీంతో రబడ 34 బంతులను ఎదుర్కొని 11 పరుగులు చేయగా.. మరో ఎండ్‌లో కెప్టెన్ డుప్లెసిస్ దూకుడుగా ఆడి స్కోరు బోర్డును 300 పరుగులు దాటించాడు.

డుప్లెసిస్ 63 పరుగులతో రాణించడంతో.. దక్షిణాఫ్రికా 335 పరుగులు చేయగలిగింది. రబడ, డుప్లెసిస్‌లను వరుస ఓవర్లలో ఇషాంత్ అవుట్ చేయడంతో సఫారీల తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో అశ్విన్‌ 4 వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ 3 వికెట్లు పడగొట్టాడు.

డుప్లెసిస్ హాఫ్ సెంచరీ
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 135 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో డుప్లెసిస్ (59) పరుగులు చేశాడు. మరోవైపు రెండో రోజైన ఆదివారం టీమిండియా చాలా చెత్తగా ఫీల్డింగ్ చేస్తోంది. 110 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 7 వికెట్లు కోల్పోయి 324 పరుగులు చేసింది.


టెస్టుల్లో 100వ వికెట్ తీసిన షమీ
సెంచూరియన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 98.5వ బంతికి కేశవ్‌ మహరాజ్‌ (18; 54 బంతుల్లో 3 ఫోర్లు)ను మహమ్మద్ షమీ పెవిలియన్‌కు పంపించాడు. షమికి ఇది టెస్టుల్లో వందో వికెట్‌ కావడం విశేషం. 100 ఓవర్లు ముగిసేసరికి ఆతిథ్య జట్టు 282/7తో ఉంది. క్రీజులో డుప్లెసిస్‌ (29), రబడ పరుగులేమీ చేయకుండా ఉన్నారు.

రెండో రోజు ప్రారంభమైన ఆట
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రెండోరోజు ఆట ప్రారంభమైంది. తొలిరోజు ఆట ముగిసేసరికి దక్షిణాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 104 ఓవర్లకు గాను 7 వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసింది.

India vs South Africa 2018 2nd Test Score Card

క్రీజులో రబడ (4), కెప్టెన్ డుప్లెసిస్ (34) పరుగులతో ఉన్నారు. కాగా, శనివారం ఓ దశలో 246/3తో పటిష్టంగా కనిపించిన దక్షిణాఫ్రికా జట్టు చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. రెండోరోజు దక్షిణాఫ్రికాను వీలైనంత త్వరగా కుప్పకూల్చి బ్యాటింగ్‌ ప్రారంభించాలని భారత్‌ చూస్తోంది.

Story first published: Sunday, January 14, 2018, 15:41 [IST]
Other articles published on Jan 14, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+