Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'రెండో టెస్టు జరిగే సెంచూరియన్ మైదానం అంత ప్రమాదకరమా'

India vs South Africa 2nd Test: Brown may not be the colour of reassurance for Indians

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న తొలి టెస్టు పరాజయం అనంతరం రెండో టెస్టుకు సన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో వేదికగా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఎంపిక చేసిన సెంచూరియో మైదానం మ్యాచ్ కోసం సిద్ధమైంది. రెండ్రోజుల్లో మొదలు కాబోతున్న నేపథ్యంలో మైదాన సిబ్బందికి చేతి నిండా పనికి దొరికనట్టైంది.

ఇదిలా ఉంటే చాలా మంది క్రీడాకారులకు ఉండే సమస్యే ఇప్పుడు భారత్ జట్టుకు కూడా ఎదురుకానుందా... అనే ప్రశ్న తలెత్తింది. అదేమంటే ఇలా గడ్డి పెరిగి బ్రౌన్ రంగులో ఉన్న మైదానాల్లో ఆడిన క్రీడాకారులకు రిబ్స్‌కు గాయాలమవడం, చేతి వేళ్లకి దెబ్బలు, వరుసగా వికెట్లు పడిపోవడం వంటి సమస్యలు చాలా సందర్భాల్లో తలెత్తాయి. చాలా ముఖ్యమైన విషయం ఏమంటే ఇలాంటి మైదానాల్లో పరుగులు కూడా చాలా తక్కువ వచ్చే సూచనలున్నాయి.

ఇక మైదానం విషయానికొస్తే పచ్చిక పెరిగి ఉన్న నేలను గడ్డిని చదును చేయడంతో పచ్చగా మెరిసిపోతోంది. తొలి టెస్ట్ మ్యాచ్ జరిగిన న్యూలాండ్స్ పిచ్ మాదిరిగానే ఈ పిచ్ కూడా ఎక్కువగా బౌన్సింగ్ స్వభావం కలిగి ఉన్నదంట. లేటరల్ కదలిక కూడా చాలా తక్కువ అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ సారి మ్యాచ్‌ భారత్‌కు కత్తి మీద సాములానే ఉండనుంది. ఒక వైపేమో బౌన్సింగ్ పిచ్, జారిపోయే స్వభావం కల పచ్చిక పిచ్ అంతా పెరిగి ఉంది. అంతకుముందు జరిగిన మ్యాచ్ ఓడిపోయిన నిరుత్సాహం, డ్రస్సింగ్ రూమ్ నుంచి గ్రౌండ్‌కు చాలా దూరం. ఇన్ని బలహీనతలు తెచ్చిపెట్టిన సెంచూరియో మైదానంలో భారత జట్టు ఆటగాళ్లు ఎలా ఆడతారో చూడాల్సిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 11, 2018, 15:38 [IST]
Other articles published on Jan 11, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+