For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2nd T20I Preview: ఒత్తిడిలో పంత్, యువ ఆటగాళ్లు సత్తా చాటేనా?

India Vs South Africa 2nd T20 Match Preview ! || Oneindia Telugu
India vs South Africa, 2nd T20I Preview: Youngsters In Focus As India Host South Africa In Mohali

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 మొహాలీ వేదికగా జరగనుంది. ఈ సిరిస్‌లో ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో టీ20ని ఇరు జట్లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో ఈ టీ20 సిరిస్‌పై అందరూ దృష్టి సారించారు. ముఖ్యంగా యువ ఆటగాళ్లు ఈ సిరిస్‌లో సత్తా చాటాల్సి ఉంది. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన కెరీర్‌లోనే తొలిసారి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు.

తొలి టీ20లో సత్తా చాటాలని

తొలి టీ20లో సత్తా చాటాలని భావించినప్పటికీ... వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో రెండో టీ20లోనైనా సరే రాణించాలనే గట్టి పట్టుదలతో ఉన్నాడు. రెండో టీ20లో కూడా పంత్ రాణించకున్నట్లైతే రాబోయే రోజుల్లో తుది జట్టులో చోటు దక్కడం కష్టమవుతుంది. పంత్ షాట్ సెలక్షన్‌పై ఇప్పటికే హెడ్ కోచ్ రవిశాస్త్రి హెచ్చరించిన సంగతి తెలిసిందే.

టీ20 వరల్డ్‌కప్ కోసం

వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్ కోసం బలమైన జట్టుని రూపొందించే క్రమంలో జట్టు మేనేజ్‌మెంట్ పంత్‌కు పదే పదే అవకాశాలు ఇస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, రిషబ్ పంత్ వాటిని అందిపుచ్చుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా డీప్‌ స్వేర్‌ లెగ్‌లో పంత్ ఔటవుతున్న తీరు అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

రిషబ్ పంత్‌ సత్తా చాటకపోతే!

రిషబ్ పంత్‌ సత్తా చాటకపోతే!

ఈ నేపథ్యంలో రిషబ్ పంత్‌ను తప్పించి మరో యువ వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు గొంతెత్తున్నారు. మరోవైపు ఇటీవలే భారత జట్టులో పునరాగమనం చేసిన మనీశ్‌ పాండే, శ్రేయస్‌ అయ్యర్‌లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. ఇక, స్పిన్నర్లు రాహుల్‌ చాహర్‌, వాషింగ్టన్‌ సుందర్‌‌లు రాణించాల్సి ఉంది.

3-0తో టెస్టు సిరిస్‌ను చేజార్చుకన్న సఫారీలు

3-0తో టెస్టు సిరిస్‌ను చేజార్చుకన్న సఫారీలు

చైనామన్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్‌లను కాదని వీరిని ఎంపిక చేశారు. వన్డే వరల్డ్‌కప్ తర్వాత దక్షిణాఫ్రికా జట్టు ఎంతో ప్రతిష్టాత్మక తీసుకున్న సిరిస్ ఇది. 2015లో భారత పర్యటనకు వచ్చిన సఫారీలు వన్డే, టీ20 సిరిస్‌ను కైవసం చేసుకున్నాయి. అయితే, నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో చేజార్చుకుంది.

సఫారీ పేసర్లను కోహ్లీసేన ఎదుర్కొనేనా?

సఫారీ పేసర్లను కోహ్లీసేన ఎదుర్కొనేనా?

ఈ నేపథ్యంలో ఈ సిరిస్‌ను సపారీ జట్టు చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇందులో భాగంగా ఈ సిరిస్‌కు యువ క్రికెటర్లను ఎంపిక చేసింది. సొంతగడ్డపై టీమిండియాను ఓడించడం అంత సులభం కాదు. అయితే, సఫారీ పేసర్లు కగిసో రబాడ, జూనియర్‌ డలాతో కూడిన పేస్ బౌలింగ్ దళం టీమిండియాను తన లైన్ అండ్ లెంత్ బౌలింగ్‌లో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

జట్ల వివరాలు

జట్ల వివరాలు

భారత్‌: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్), రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, కృనాల్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌ సైనీ

దక్షిణాఫ్రికా: క్వింటన్‌ డికాక్‌ (కెప్టెన్), డుసెన్‌, బవుమా, జూనియర్‌ డలా, ఫర్టూయిన్‌, బ్యూరాన్‌ హెండ్రిక్స్‌, రెజా హెండ్రిక్స్‌, డేవిడ్‌ మిల్లర్‌, నోర్జె, ఫెలుక్‌వాయో, డ్వేన్‌ ప్రిటోరియస్‌, రబాడ, శంషీ, జార్జ్‌ లిండె

Story first published: Tuesday, September 17, 2019, 18:22 [IST]
Other articles published on Sep 17, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+