For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికా vs భారత్‌ రెండో టీ20.. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు

India vs South Africa 2nd T20I: Mohali weather forecast, No rain threat for Night Match

మొహాలి: చాలా రోజుల తర్వాత స్వదేశంలో పరుగుల వరద పారిద్దామనుకున్న టీమిండియాకు షాక్ తగిలింది. గత ఆదివారం ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా.. కనీసం టాస్ కూడా పడకుండానే రద్దయింది. ఇక మిగిలిన రెండు టీ20ల్లో సత్తా చాటేందుకు భారత్‌-దక్షిణాఫ్రికా సిద్ధమయ్యాయి. బ్యాటింగ్‌కు అనుకూలించే మొహాలీలో మోతెక్కించేందుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి.

వర్షం ముప్పు లేదు

వర్షం ముప్పు లేదు

తొలి మ్యాచ్ రద్దవడంతో బుధవారం రాత్రి 7 గంటలకు మొహాలి వేదికగా జరగనున్న రెండో టీ20పై అభిమానుల చూపు నిలిచింది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్ కాస్తా రెండు టీ20ల సిరీస్‌గా మారడంతో ఈ రోజు కూడా వర్షం వస్తే? పరిస్థితి ఏంటి? అని భారత అభిమానులు ఆందోళన పడుతున్నారు. అయితే మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు అని మొహాలీ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. భుధవారం వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది. దీంతో 40 ఓవర్ల మ్యాచ్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

పరుగుల వరద ఖాయం:

పరుగుల వరద ఖాయం:

టీ20 ఫార్మాట్‌లో మొహాలీ వేదికపై తరచుగా భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. ఈ పిచ్‌పై చేజింగ్‌ చేసిన జట్టే ఎక్కువ విజయాలు సాధించిన రికార్డు ఉంది. ఈ ఏడాది ఐపీఎల్లో ఇక్కడ 7 మ్యాచ్‌లు జరగ్గా.. అందులో ఒక ఇన్నింగ్స్‌లో సరాసరి 171 పరుగులు నమోదయ్యాయి. బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామంగా ఉండే ఈ పిచ్‌పై పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది.

మొహాలీ పిచ్‌పై మిల్లర్‌ ప్రమాదం:

మొహాలీ పిచ్‌పై మిల్లర్‌ ప్రమాదం:

భారత్ జట్టు ఆఖరిగా 2016లో మొహాలి స్టేడియంలో టీ20 మ్యాచ్ ఆడింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొహాలీ పిచ్‌పై మిల్లర్‌ చేసిన పరుగులు 730. ఇక్కడ 29 టీ20 మ్యాచ్‌లు ఆడిన మిల్లర్‌ 45.62 సగటు, 150.51 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేసాడు. కాబట్టి భారత బౌలర్లు అతనిపై ఓ కన్నేసి ఉంచాలి.

దక్షిణాఫ్రికాపై కోహ్లీ తడబాటు:

దక్షిణాఫ్రికాపై కోహ్లీ తడబాటు:

28.83 దక్షిణాఫ్రికాపై టీ20ల్లో కోహ్లీ సగటు ఇది. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీకి ఇది రెండో అత్యల్పం. ఒక్క ఐర్లాండ్‌పై (రెండు ఇన్నింగ్స్‌లు) విరాట్‌ సగటు కేవలం 4.50 మాత్రమే. అంటే టాప్ జట్లలో ఒకటైన దక్షిణాఫ్రికాపై కోహ్లీ తడబడుతున్నాడు. పేసర్‌ రబాడ, ఫెలుక్వాయో బౌలింగ్‌లో కోహ్లీ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.

Story first published: Wednesday, September 18, 2019, 16:02 [IST]
Other articles published on Sep 18, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+