For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ Vs దక్షిణాఫ్రికా రెండో వన్డే: స్వల్ప టార్గెట్‌లో సఫారీలను చిదిమేసిన భారత్

India Vs South Africa, 2nd ODI: Kohli wins toss, opts to chase against SA; visitors play unchanged

భారత జట్టు బెంబేలెత్తించింది. రెండో వన్డేలోనూ విజయ పతాకాన్ని ఎగరేసింది. సఫారీ జట్టును అత్యల్ప స్కోరుతో కట్టడి చేసిన భారత జట్టు స్వల్ప టార్గెట్‌ను సునాయాసంగా చేధించింది.

సెంచూరియన్ వేదికగా జరిగిన సెకండ్ వన్డేలో భారత్ 9 వకెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. దీంతో సీరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలుత భారత్ బౌలింగులో చెలరేగింది. ఆ తర్వాత బ్యాటింగులోను రెచ్చిపోయి అడింది.

మొదట దక్షిణాఫ్రికా 32.2 ఓవర్లలోనే వికెట్లన్నీ కోల్పోయి కేవలం 118 పరుగులు మాత్రమే చేసింది. చాహల్ 5 వికెట్లుు, కుల్‌దీప్ 3 వికెట్లు దీసి ఆతిథ్య జట్టును దెబ్బతీశారు. లక్ష్య ఛేదనలో ధావన్ 56 బంతుల్లో 51 పరుగులు చేశాడు. కోహ్లీ 50 బంతుల్లో 46 పరుగులు చేశాడు.

స్వల్ప టార్గెట్‌కే సరిపెట్టిన సఫారీ జట్టు:

తొలి వన్డే విజయాన్ని కొనసాగించే ప్రయత్నంలో ఉన్న భారత జట్టు ఫీల్డింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ సఫారీలను కట్టడి చేసింది. మొదటగా టాస్ గెలుచుకున్న భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బౌలర్లు విజృంభించి బౌలింగ్ చేయడంతో 32 ఓవర్లకే దక్షిణాఫ్రికా జట్టు కుప్పకూలింది. కాగా, కోహ్లీ సేనకు అత్యల్ప స్కోరును 119 టార్గెట్‌గా ఇచ్చారు.


ఇరగదీసిన బౌలర్లు:

రెండో వన్డే మ్యాచ్‌లో చాహల్‌కు ఐదు వికెట్లు పడగా, కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, చెరో వికెట్ తీశారు. పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో బ్యాటింగ్‌కు దిగిన సఫారీలకు ఏ మాత్రం కలిసిరాలేదు. దీంతో అత్యల్ప స్కోరును నమోదు చేసి ఆలౌట్‌కు గురైయ్యారు.


మిగిలింది ఇద్దరే:

క్రిస్ మోరిస్, తబ్రైజ్ షంసీ మినహాయించి సఫారీ బాట్స్‌మెన్‌లు అందరూ పెవిలియన్ బాట పట్టారు. దక్షిణాఫ్రికా జట్టు 32 ఓవర్లు పూర్తయ్యేసరికి తొమ్మిది వికెట్లు నష్టానికి 118 స్కోరు నమోదు చేసింది.


రాలిపోతున్న సఫారీ వికెట్లు, స్కోరు: 14ఓవర్లకు (51/4)

ఫేసర్ పిచ్ అనుకూలంగా ఉండటంతో భారత విజృంభిస్తున్నారు. మ్యాచ్ మొదలైన గంటసేపటిలోనే పద్నాలుగు ఓవర్లు పూర్తికాకముందే నాలుగు వికెట్లను తీయగలిగారు. ప్రధాన వికెట్లు నాలుగు కోల్పోవడంతో సఫారీ జట్టు పరిస్థితి గందరగోళంగా మారింది.


మొదటి వికెట్ కోల్పోయిన సఫారీ జట్టు:

భువనేశ్వర్ ధాటికి సఫారీ జట్టు మొదటి వికట్‌ను కోల్పోయింది. హషీమ్ ఆమ్లా బంతిని ఎదుర్కొందామనే ప్రయత్నంలో ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.


పేస్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ప్రొటీస్‌ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. చురకత్తిలాంటి బౌన్సర్లతో సఫారీ ఓపెనర్‌ డికాక్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. ఓవర్‌ తొలి బంతికే వెనుదిరిగాల్సిన డికాక్‌కు అదృష్టం కలిసొచ్చింది. బంతి వికెట్లను తాకినా బెల్స్‌ పడకపోవడంతో డికాక్‌ బతికిపోయాడు. అనంతరం ఐదు బంతులను ఎదుర్కొన్న డికాక్‌ బంతిని బ్యాట్‌కు తగిలించాడానికే ముప్పు తిప్పలు పడ్డాడు. దీంతో ఈ ఓవర్‌లో ఆతిథ్యజట్టుకు ఒక్క పరుగు కూడా రాలేదు.

పిచ్‌ పేస్‌ అనూకూలిస్తుండంతో భారత పేసర్లు సమర్ధవంతంగా ఉపయోగించుకుంటున్నారు. 5 ఓవర్లు పూర్తయ్యేసరికి దక్షిణాఫ్రికా 10 పరుగులు చేసింది. క్రీజులో ఆమ్లా(5), డికాక్‌(5)లున్నారు.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్:

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా కోహ్లిసేన బరిలోకి దిగుతుండగా సఫారీ జట్టులో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మ్యాచ్‌తో ఖాయా జోండో అరంగేట్రం చేస్తున్నాడు.

భారత్ Vs దక్షిణాఫ్రికా, రెండో వన్డే స్కోరు వివరాలు:


గాయంతో కెప్టెన్‌ డుప్లెసిస్‌ దూరం కాగా ఈ స్థానంలో జోండోను తుది జట్టులోకి ఎంపిక చేశారు. ఇక ఆలౌరౌండర్‌ పెహ్లుకువాయో స్థానంలో స్పిన్నర్‌ తబ్రాజ్ షమ్సీని ఎంపిక చేశారు. తాత్కలిక కెప్టెన్‌గా మార్క్‌రమ్‌ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. డర్బన్‌ వన్డే విజయంతో కోహ్లిసేన ఉత్సాహంగా ఉండగా కీలక ఆటగాళ్ల గాయాలతో సొంతగడ్డపై సఫారీ టీమ్‌ తడబాటును ఎదుర్కొంటోంది.


తుది జట్లు

భారత్‌ : రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), అజింక్యా రహానే, ఎంఎస్‌ ధోని, కేదార్‌ జాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చహల్‌

దక్షిణాఫ్రికా : హషిమ్‌ ఆమ్లా, డికాక్‌, మార్క్‌రమ్‌, డుమిని, డేవిడ్‌ మిల్లర్‌, ఖాయా జోండో, క్రిస్‌ మొర్రిస్‌, రబడా,మోర్కెల్‌. తబ్రాజ్‌ షమ్సీ, ఇమ్రాన్‌ తాహిర్‌

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, February 4, 2018, 19:26 [IST]
Other articles published on Feb 4, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+