స్వదేశంలో టెస్టు సిరీస్‌ను 0-3తో కోల్పోయిన టీమిండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. దక్షిణాఫ్రికాలో దక్షిణాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీస్ ఆడనుంది. నవంబర్ 8 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ చేతిలో ఘోరపరాభవాన్ని చవిచూసిన రోహిత్ సేనలోని ఏ ఆటగాడు దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడట్లేదు. సూర్యకుమార్ సారథ్యంలో యువ బృందం సఫారీలతో తలపడనుంది.
శ్రీలంక పర్యటనతో టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతలను పూర్తిస్థాయిలో అందుకున్న సూర్యకుమార్‌కు సారథిగా అజేయ రికార్డు ఉంది. శ్రీలంక సిరీస్‌ను, ఆ తర్వాత స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను సూర్య సేన క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఆస్ట్రేలియా పర్యటనకు సన్నద్ధమయ్యే క్రమంలో దక్షిణాఫ్రికా సిరీస్‌కు గంభీర్ కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించట్లేదు. ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా జట్టును చూసుకోనున్నాడు.

దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్ షెడ్యూల్
నవంబర్ 08: తొలి టీ20- డర్బన్
నవంబర్ 10: రెండో టీ20- సెయింట్ జార్జ్స్ పార్క్
నవంబర్ 13: మూడో టీ20- సెంచూరియన్
నవంబర్ 15: నాలుగో టీ20- జోహొన్నెస్‌బర్గ్
ఫ్రీగా లైవ్ చూడాలంటే?
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు స్పోర్స్18 నెట్‌వర్క్ బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. టీవీల్లో లైవ్ చూడాలంటే స్పోర్ట్స్ 18, స్పోర్ట్స్ 18 హెచ్‌డీ ఛానెల్‌లో వీక్షించాలి. ఓటీటీలో జియో సినిమా ద్వారా ఉచితంగా ప్రత్యక్షప్రసారాన్ని చూడవచ్చు. రెండో టీ20 మినహా మిగిలిన మ్యాచ్‌లన్నీ రాత్రి 8.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలుకానుంది.
జట్టు వివరాలు
భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రమన్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, విజయ్‌కుమార్ వైశాక్, అవేశ్ ఖాన్, యశ్ దయాల్.
సౌతాఫ్రికా: ఎయిడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్), బార్ట్‌మన్, గెరాల్డ్ కొయెట్జీ, ఫెరీరా, మార్కో జేన్సన్, హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్రిక్ క్రుగర్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలి, న్కాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, సిమెలనే, సిపమ్లా, ట్రిస్టన్ స్టబ్స్.