For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs South Africa, 2019: 2nd T20I - మ్యాచ్ గణాంకాలివే!

India vs South Africa, 2019: 2nd T20I – Statistical Preview

హైదరాబాద్: హోమ్‌ సీజన్‌ను ఘనంగా ఆరంభిద్దామనుకున్న టీమిండియాకు వరుణుడు షాకిచ్చాడు. మూడు టీ20ల సిరిస్‌లో తొలి టీ20 మ్యాచ్‌ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో భారత్, దక్షిణాఫ్రికా పోరు రెండు మ్యాచ్‌ల సిరీస్‌కే పరిమితమైంది.

ఈ సిరిస్‌లో ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో టీ20 మొహాలీ వేదికగా బుధవారం జరగనుంది. దీంతో ఇరు జట్ల గెలుపే లక్ష్యంగా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ గణాంకాలను ఒక్కసారి పరిశీలిస్తే!

ఒక్క టీ20 గెలవలేదు

ఒక్క టీ20 గెలవలేదు

0 - సొంతగడ్డపై దక్షిణాఫ్రికాపై ఇప్పటివరకు టీమిండియా ఒక్క టీ20 సిరిస్ కూడా గెలవలేదు. 2015లో భారత పర్యటనకు వచ్చిన సఫారీ జట్టు ఆ పర్యటనలో టీ20, వన్డే సిరిస్‌లను సొంతం చేసుకుంది. టెస్టు సిరిస్‌ను మాత్రం 3-0తో చేజార్చుకుంది.

2 - మొహాలీలో ఇప్పటివరకు టీమిండియా రెండు టీ20లు ఆడింది. 2009లో శ్రీలంకపై తొలి టీ20 ఆడగా... 2016 వరల్డ్ టీ20లో భాగంగా ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా 6 వికెట్లు తేడాతో విజయం సాధించింది.

వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడం ఇది మూడోసారి

వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడం ఇది మూడోసారి

3 - హోం సీజన్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడం ఇది మూడోసారి. 1992/93 సీజన్‌లో అహ్మాదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో జరగాల్సిన వన్డే మ్యాచ్ మొట్టమొదటిసారి రద్దైంది. అప్పట్లో అహ్మాదాబాద్‌లో గొడవల కారణంగా సెక్యూరిటి ఇవ్వలేమని పోలీసులు చేతులెత్తేయడంతో మ్యాచ్ రద్దైంది. రెండోది 2007/08 సీజన్‌లో బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్. 52.4 ఓవర్లు పూర్తైన తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ రద్దైంది.

4 - మొహాలీ వేదికగా టీమిండియాతో సపారీలు ఇప్పటివరకు నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. ఇందులో టీమిండియాపై రెండు ఉన్నాయి. 1993లో వన్డే, 2015లో టెస్టు రెండు మ్యాచ్‌ల్లోనూ దక్షిణాఫ్రికా ఓడిపోయింది. అదే 2006లో ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో, 2011 వరల్డ్‌కప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు విజయం సాధించారు.

13 టీ20లు ఆడిన భారత్-దక్షిణాఫ్రికా

13 టీ20లు ఆడిన భారత్-దక్షిణాఫ్రికా

8 - భారత్-దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటివరకు 13 టీ20లు ఆడాయి. ఇందులో టీమిండియా 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా... 5 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. టీమిండియా చేతిలో అత్యధిక టీ20 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన జట్టుగా ఆస్ట్రేలియా(11) అగ్రస్థానంలో ఉంది.

11 - టీ20ల్లో దక్షిణాఫ్రికా జట్టుకు క్వింటన్ డీకాక్ 11వ కెప్టెన్‌గా నియమింపబడ్డాడు. 2018లో ఓ సిరిస్‌లో శ్రీలంకపై రెండు వన్డేలకు డీకాక్ కెప్టెన్‌గా వ్యవహారించాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో క్వింటన్ డీకాక్ వేరే ఏ ఇతర జట్టుకు కెప్టెన్‌గా వ్వవహారించలేదు.

అగ్రస్థానం రోహిత్ శర్మదే

అగ్రస్థానం రోహిత్ శర్మదే

341 - దక్షిణాఫ్రికాపై టీ20ల్లో రోహిత్ శర్మ ఇప్పటివరకు చేసిన పరుగులు. సఫారీ జట్టుపై ఓ భారత ఆటగాడు చేసిన అత్యధిక పరుగులు కూడా ఇవే కావడం విశేషం. రోహిత్ శర్మ కేవలం 10 ఇన్నింగ్స్‌ల్లో 37.88 యావరేజితో ఈ పరుగులు చేశాడు. 2015లో చివరగా దక్షిణాఫ్రికా జట్టుపైనే రోహిత్ శర్మ టీ20ల్లో సెంచరీ సాధించాడు.

730 - మొహాలీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో డేవిడ్ మిల్లర్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. డేవిడ్ మిల్లర్ 29 ఇన్నింగ్స్‌ల్లో 45.62 యావరేజితో 730 పరుగులు చేశాడు.

Story first published: Wednesday, September 18, 2019, 13:01 [IST]
Other articles published on Sep 18, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+