For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మేం ఓడిపోవడానికి వాళ్లే కారణం: విరాట్ కోహ్లీ

India vs South Africa 2018: Virat Kohli rues missed chances after Wanderers defeat

హైదరాబాద్: భారత జట్టుకు సిరీస్ ను గెలిచే అవకాశం సందిగ్ధ పరిస్థితుల్లో వాయిదా పడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేల్లోనూ వరుస విజయాలను నమోదు చేసుకుంది భారత జట్టు. నాలుగో వన్డేలోనూ అదే స్థాయిలో రాణించాలనే ఉత్సాహంతో మ్యాచ్ మొదలెట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది.

వాళ్ల ఆశల్లో నీళ్లు పోశాడు వరుణుడు. వర్షం రావడంతో మ్యాచ్ ఓడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. భారీ పరుగులు చేయాల్సిన భారత జట్టు నీరుగారిపోయి అంతంతమాత్రంగానే సరిపెట్టుకుంది. అయితే ఇందులో కోహ్లీ సేన తప్పిదాలు కూడా ఉన్నాయి. అదే విషయాన్ని కెప్టెన్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ ఇలా పేర్కొన్నాడు.

'మాకు వచ్చిన అవకాశాల్ని చేజార్చుకున్నాం. ఏబీ అవుటైన తర్వాత మ్యాచ్‌లో విజయం ఖాయమని అనుకున్నాం. మిల్లర్‌- క్లాసెన్‌లు విజయాన్ని మాకు దూరం చేశారు. మా నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. యజ్వేంద్ర చాహల్‌ బౌలింగ్‌ మిల్లర్‌ ఇచ్చిన డీప్‌ స్వ్కేర్‌ లెగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ వదిలేస్తే, అదే ఓ‍వర్‌లో మిల్లర్‌ బౌల్డ్‌ అయినప్పటికీ ఆ బంతి నో బాల్‌ అయ్యింది. దాంతో మాకు విజయావకాశాలు సన్నగిల్లాయి' అని కోహ్లీ వివరించాడు.

ఇంకా మాట్లాడుతూ.. ' మరొకవైపు వర్షం కూడా మా విజయాన్ని దూరం చేసిందనే చెప్పాలి. వర్షం కారణంగా మ్యాచ్‌ ఒక్కసారిగా టీ20 తరహాలో మారిపోయిందిఇవన్నీ ఫలితం మాకు ప్రతికూలంగా మారడానికి కారణం. తదుపరి వన్డేల్లో ఎటువంటి పొరపాట్లు చేయకుండా విజయాన్ని సొంతం చేసుకుంటామనే ఆశిస్తున్నా' అని కోహ్లి పేర్కొన్నాడు.

నాలుగో వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 289 పరుగులు చేసింది. అయితే పదే పదే వర్షం కురవడం వల్ల సఫారీల లక్ష్యం 28 ఓవర్లలో 202‍్కు మారడం ఆ జట్టుకు వరమైంది. చేతిలో వికెట్లు ఉండటంతో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ టీ 20 తరహాలో ఆడి జట్టును 25.3 ఓవరల్లో 207 పరుగులు చేసి గెలిచింది.

మూడు వన్డేలు గెలిచి సిరీస్ చేజిక్కింది అనుకున్న సమయంలో వర్షం ఆటంకంగా మారింది. వర్షం అనంతరం సఫారీ జట్టు బౌలింగ్ ఎదుర్కోవడానికి భారత బ్యాట్స్‌మెన్‌లు కష్టపడ్డారు. అలాగే బౌలింగ్‌లోనూ.. ప్రధానంగా డేవిడ్‌ మిల్లర్‌ ఒకే ఓవర్‌లో రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవడం భారత జట్టు విజయంపై ప్రభావం చూపింది. దీనితో భారత కెప్టెన్‌ కోహ్లి కూడా ఏకీభవించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, February 11, 2018, 14:26 [IST]
Other articles published on Feb 11, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+