స్పిన్నర్ల అత్యుత్తమ ప్రదర్శన: రెండో వన్డే మ్యాచ్ హైలెట్స్ ఇవే
హైదరాబాద్: పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో భారత్‌కు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. సెంచూరియన్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో ఏకపక్షంగా సాగిన జరిగిన రెండో వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోహ్లీసేన 20.3 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి చేధించింది.

తొలి వికెట్ భువీకే
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. సఫారీ ఓపెనర్లు ఆమ్లా(23), డికాక్(20) చక్కటి శుభారంభాన్ని అందించారు. పాండ్యా వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో వరుస బంతుల్లో డికాక్ వరుస బంతుల్లో బౌండరీలు బాదాడు. ఆ తర్వాత ఓవర్లో ఆమ్లాను భువనేశ్వర్ కుమార్ పెవిలియన్‌కు చేర్చాడు. ఆమ్లా డీఆర్‌ఎస్‌కు వెళ్లినా ఫలితం మాత్రం భారత్‌కే అనుకూలంగా వచ్చింది.

ఆరు బంతుల తేడాతో మూడు వికెట్లు
ఆ తర్వాత క్రీజులోకొచ్చిన వచ్చిన కెప్టెన్ మర్క్రమ్ (8) ఆదిలోనే తడబడ్డాడు. ఈ సమయంలో కోహ్లీ చైనామన్ స్పిన్నర్లను రంగంలోకి దించడంతో ఆరు బంతుల తేడాతో డికాక్, మర్క్రమ్, మిల్లర్(0) వెనువెంటనే పెవిలియన్‌కు చేరారు. దీంతో దక్షిణాఫ్రికా 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో భారత స్పిన్నర్లు విజృంభించారు. పిచ్ పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటూ సఫారీ బ్యాట్స్‌మెన్‌ను కట్టడిచేశాడు.

ఐదో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం
డుమిని(25), కాయ జొండో(25) ఓ దశలో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే క్రీజులో కుదురుకున్న ఈ జోడిని చాహల్ బోల్తా కొట్టించాడు. వరస ఓవర్లలో వీరిద్దరిని ఔట్ చేశాడు. జొండో(25) పరుగుల వద్ద పాండ్యా క్యాచ్ పెవిలియన్‌కు చేరగా, డుమిని (25) వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రబాడ(1)ను కుల్దీప్ పెవిలియన్‌కు చేర్చాడు.

పోటీ పడి మరీ వికెట్లు తీసిన చాహల్, కుల్దీప్
చాహల్, కుల్దీప్ యాదవ్‌లు పోటీ పడి మరీ వికెట్లు తీశారు. సఫారీ బౌలర్లు మోర్కెల్(1), మోరిస్(14)ను ఔట్ చేసి చాహల్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. చాహల్, కుల్దీప్‌ల దెబ్బకు దక్షిణాఫ్రికా 19 పరుగుల తేడాతో ఆఖరి ఆరు వికెట్లు కోల్పోవడం విశేషం. దీంతో 32.2 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం.

ఎనిమిది వికెట్లు తీసి కేవలం 42 పరుగులు
ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లు ఎనిమిది వికెట్లు తీసి కేవలం 42 పరుగులు మాత్రమే ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి 22 పరుగులిచ్చిన యజువేంద్ర చాహల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే ఫిబ్రవరి 7న కేప్‌టౌన్ వేదికగా మూడో వన్డే జరగనుంది.

రెండో వన్డేలో నమోదైన గణాంకాలు
* సఫారీ గడ్డపై స్పిన్నర్‌గా చాహల్ రెండో అత్యుత్తమ(5/22) ప్రదర్శన నమోదు చేశాడు. 1999లో సునీల్ జోషి (5/6) ప్రదర్శన మొదటి స్థానంలో ఉంది. కేప్‌టౌన్ (2002)లో నికీ బోయే(5/21) ఇప్పటివరకు అత్యుత్తమం.
* సొంతగడ్డపై దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు 118. 2009లో ఇంగ్లాండ్‌పై 119 పరుగులకు ఆలౌటైంది. మొత్తంగా వన్డేల్లో సఫారీలకు ఇది ఎనిమిదో స్వల్ప స్కోరు.
* డివిలీయర్స్, డుప్లెసిస్ లేకుండా దక్షిణాఫ్రికా వన్డేల్లో బరిలోకి దిగడం 2009 తర్వాత ఇదే తొలిసారి.
* ఆసియా బయట భారత స్పిన్నర్ల అత్యుత్తమ ప్రదర్శన ఇది. దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో చాహల్, కుల్దీప్ ఎనిమిది వికెట్లు తీశారు.
* వన్డేల్లో ప్రస్తుతం టీమిండియా రెండో స్థానంలో ఉంది. ఈ సిరిస్‌ను గెలిస్తే నెంబర్‌వన్ ర్యాంక్ నిలుస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications