
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో అందరూ ఊహించినట్లే భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. పేస్ బౌలర్లకి స్వర్గధామమైన కేప్‌టౌన్ పిచ్‌పై సఫారీ ఫాస్ట్ బౌలర్ల ధాటికి ఓపెనర్లు మురళీ విజయ్ (1), శిఖర్ ధావన్ (16), కెప్టెన్ విరాట్ కోహ్లి (5) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిపోయారు.
దీంతో తొలి రోజైన శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 28/3తో కష్టాల్లో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో ఛతేశ్వర్ పుజారా (5), రోహిత్ శర్మ (0) పరుగులతో ఉన్నారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా ఇంకా 258 పరుగుల వెనుకంజలో ఉంది.
తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 286కే ఆలౌట్
కేప్ టౌన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ ఆతిథ్య దక్షిణాఫ్రికా 73.1 ఓవర్లకు గాను 286 పరుగులు చేసిన ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో సఫారీ సీనియర్ ఆటగాడు డివిలియర్స్, జట్టు కెప్టెన్ డుప్లెసిస్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించారు. ఈ క్రమంలో డివిలియర్స్ టెస్టుల్లో 41వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత డుప్లెసిస్ నిలకడగా ఆడుతూ డివిలియర్స్‌కి మద్దతుగా నిలిచాడు.
వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కి 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత డివిలియర్స్(65) పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి రెండు ఓవర్లకే డుప్లెసిస్(62) కూడా పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన డికాక్(43)... భువనేశ్వర్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఫిలాందర్(23), కేశవ్ మహరాజ్(35), రబడ(26), మోర్కల్(2) స్వల్ప స్కోరుకే ఔటయ్యారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4, రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు తీసుకోగా.... పాండ్యా, బుమ్రా, షమీ తలో వికెట్ తీసుకున్నారు.
దక్షిణాఫ్రికా బ్యాటింగ్ తీరు సాగిందిలా:
ఏడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా
కేప్ టౌన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయింది. ప్రారంభంలో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడ్డ జట్టును డివిలియర్స్, డుప్లెసిస్ ఆదుకున్నారు. కాగా బుమ్రా బౌలింగ్‌లో డివిలియర్స్(65) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత డుప్లెసిస్(62)ను పాండ్యా పెవిలియన్ చేర్చాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన సఫారీ వికెట్ కీపర్ డి కాక్ దూకుడుగా ఆడి భారీ స్కోర్ దిశగా నడిపించాడు. ఈ క్రమంలో భువనేశ్వర్ బౌలింగ్‌లో డికాక్(43) సహాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత షమీ బౌలింగ్‌లో ఫిలాందర్ (23) పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో టీ బ్రేక్ సమయానికి దక్షిణాఫ్రికా 53 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేశవ్ మహరాజ్(23), కగిసో రబడ(1) పరుగులతో ఉన్నారు.
డుప్లెసిస్ ఔట్: ఐదో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు మళ్లీ విజృంభిస్తున్నారు. మూడు ఓవర్ల వ్యవధిలోనే రెండు వికెట్లు తీశారు. 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దక్షిణాఫ్రికాను ఏబీ డివిలియర్స్, కెప్టెన్ డుప్లెసిస్ ఆదుకున్న సంగతి తెలిసిందే. అయితే లంచ్ విరామం అనంతరం వీరిద్దరి వికెట్లను దక్షిణాఫ్రికా కోల్పోయింది. డివిలియర్స్ వికెట్‌ను బుమ్రా తీయగా, డుప్లెసిస్ (62) పరుగుల వద్ద పాండ్యా బౌలింగ్‌లో కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 39 ఓవర్లకు గాను దక్షిణాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డీకాక్ (25), ఫిలాండర్ పరుగులేమీ చేయకుండా ఉన్నాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
కేప్ టౌన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 126 పరుగుల వద్ద డివిలియర్స్ (65) బుమ్రా బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో భారత బౌలర్లకు కఠిన పరీక్ష పెట్టిన డివిలియర్స్, డుప్లెసిస్ జోడికి తెరపడింది. క్రీజులో పాతుకుపోయిన డివిలియర్స్, డుప్లెసిస్ జోడీని 114 పరుగుల భాగస్వామ్యం వద్ద విడదీశాడు. దీంతో 33 ఓవర్లకు గాను దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. డివిలియర్స్ ఔటైన తర్వాత డికాక్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం క్రీజులో డుప్లెసిస్ (49), డీకాక్ పరుగులేమీ చేయకుండా ఉన్నాడు.
కేప్ టౌన్ టెస్టు: లంచ్ విరామానికి 107/3
కేప్ టౌన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా లంచ్ విరామానికి 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డివిలియర్స్ (59), డుప్లెసిస్ (37) పరుగులతో ఉన్నారు. శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ నిలకడగా ఆడుతూ పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో తన కెరీర్‌లో 41వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. మరోవైపు డుప్లెసిస్ కూడా డివిలియర్స్‌కి మద్దతుగా నిలుస్తున్నాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కి 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
డివిలియర్స్ హాఫ్ సెంచరీ
కేప్ టౌన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆదిలో వికెట్లను కోల్పోయి కష్టాలు పడ్డ దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ప్రస్తుతం నిలకడగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాట్సమన్ ఏబీ డివిలియర్స్ కెరీర్‌లో 41వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
13 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ భారత పేసర్లను ధీటుగా ఎదుర్కొని 56 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేసి టెస్టుల్లో 41వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం 23 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి సఫారీ జట్టు 96 పరుగులు చేసింది.
అంతకముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సఫారీ జట్టు భారత పేసర్ భువీ దెబ్బకి 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డు వేగాన్ని పెంచాడు. కెప్టెన్ డు ప్లెసిస్(33)తో కలిసి 84 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.
ఒకే ఓవర్‌లో నాలుగు బౌండరీలు బాదిన డివిలియర్స్
7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతలను ఆ జట్టు స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ తీసుకున్నాడు. ఈ క్రమంలో భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో నాలుగు ఫోర్లు బాదాడు. ఈ ఒక్క ఓవర్‌లో దక్షిణాఫ్రికా 17 పరుగులు రాబట్టింది. అయితే ఈ ఓవర్ వేసింది భువీ కావడం విశేషం. దీంతో 9 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసంది. ప్రస్తుతం క్రీజులో డివిలియర్స్ (23), డుప్లెసిస్ (1) పరుగులతో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ పైర్‌లో ఉన్నాడు. వరుస పెట్టి వికెట్లు తీస్తున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. భువీ బౌలింగ్‌లో హషీం ఆమ్లా (3) పరుగుల వద్ద కీపర్ వృద్ధిమాన్ సాహాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 5 ఓవర్లకు గాను దక్షిణాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 13 పరుగులు చేసింది.
అంతకముందు దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్‌ను కూడా భువీ ఇలానే ఔట్ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే ఆ జట్టు మొదటి వికెట్‌ను నష్టపోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ మర్క్రమ్ (5) ఔటయ్యాడు. ఈ రెండు వికెట్లను భువనేశ్వర్ కుమార్ సాధించి సఫారీలను కష్టాల్లోకి నెట్టాడు. దీంతో ఏడు పరుగులకే దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయింది.
7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయన దక్షిణాఫ్రికా
మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ వేసిన 3 ఓవర్ చివరి బంతికి ఐడెన్ మార్క్రమ్ (5) ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో 3 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 2 వికెట్లు కోల్పోయి 7 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హషీం ఆమ్లా (2) పరుగులతో ఉన్నాడు.
తొలి ఓవర్ మూడో బంతికే వికెట్ తీసిన భువనేశ్వర్
కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ నిప్పులు చెరుగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీ జట్టు మ్యాచ్‌లో తొలి ఓవర్ మూడో బంతికే ఓపెనర్ డీన్ ఎల్గార్ వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్ మూడో బంతిని ఎల్గార్ డిఫెండ్ చేసేందుకు ప్రయత్నించగా.. అది బ్యాట్‌కి తగిలి కీపర్ సహా చేతిలోకి వెళ్లింది. దీంతో ఎల్గార్ పెవిలియన్ బాటపట్టాడు. ప్రస్తుతం క్రీజ్‌లో మార్క్రమ్(0), ఆమ్లా(0) పరుగులతో ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. నలుగురు సీమర్లు, స్పిన్నర్‌తో బరిలోకి దిగుతున్నట్టు సఫారి టీమ్ కెప్టెన్ డు ప్లెసిస్ చెప్పాడు.
ఇండియా vs దక్షిణాఫ్రికా 2018 తొలి టెస్టు స్కోరు కార్డు
తాము టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకోవాలనుకున్నామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. తొలుత ఫీల్డింగ్ చేస్తే తమ నలుగురు బౌలర్లకు మంచి ప్రాక్టీస్ అవుతుందని అన్నాడు. కాగా, ఈ మ్యాచ్‌తో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టు అరంగేట్రం చేస్తున్నాడు. కెప్టెన్ కోహ్లి చేతుల మీదుగా టెస్ట్ క్యాప్ అందుకున్నాడు.
ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మకు తుది జట్టులో జట్టు మేనేజ్‌మెంట్ చోటు కల్పించింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు తుది జట్టులో స్థానం దక్కింది. ఇక న్యూలాండ్స్ మైదానంలో భారత్ ఆడిన 4 టెస్టుల్లో రెండు ఓడి, రెండు డ్రా చేసుకుంది. దీంతో ఈ టెస్టు ఫలితం టీమిండియాకు ప్రతికూలంగా వస్తుందో, అనుకూలంగా వస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
జట్ల వివరాలు:
దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గార్, ఐడెన్ మార్క్రమ్, హషీమ్ ఆమ్లా, ఏబీ డివిలియర్స్, ఫా డుప్లెస్సిస్, క్వింటన్ డి కాక్, వెర్నాన్ ఫిలాండర్, కేశవ్ మహారాజ్, డేల్ స్టెయిన్, మోర్నే మోర్కెల్, కగిసో రాబడ
భారత్: శిఖర్ ధావన్, మురళీ విజయ్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహ, హరిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, మొహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బమ్రా
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.