IND vs SA: విశాఖ టెస్టుకు వర్షం ముప్పు.. ఐదు రోజులు వర్షం కురిసే అవకాశం?!!

విశాఖపట్నం: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 2 నుండి విశాఖలో ప్రారంభం కానుంది. నగరంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బుధవారం నుంచి తొలి టెస్ట్ జరగనుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. విశాఖపట్నంలో మ్యాచ్ జరిగే ఐదు రోజులూ వర్షం కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఐదు రోజులూ వర్షం కురిసే అవకాశం
వైజాగ్‌లో గత వారం రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. మ్యాచ్ ప్రారంభం అయ్యే బుధవారం నుంచి కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉండనున్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే ఒకరోజు, రెండు రోజులు కాకుండా.. మ్యాచ్ జరిగే ఐదు రోజులూ వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం. తొలి రోజు 80%, రెండో రోజు 50%, మూడో రోజు 40% వర్షం పడే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది. నాలుగు, ఇదో రోజుల్లో కూడా వర్ష సూచన ఉన్నా.. మిగతా రోజులకంటే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండనుందట.

అరగంటలో పిచ్ సిద్ధం
విశాఖ టెస్టుకు వర్షం ముప్పు ఐదు రోజులు ఉండడంతో అక్కడి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన క్రికెటర్లను చూస్తామో లేమో అనే సందేహంలో ఉన్నారు. ప్రస్తుతం విశాఖ పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. వర్షం తగ్గాక అరగంటలో పిచ్‌ను సిద్దంచేసేందుకు రెండు సూపర్ సాపర్ యంత్రాలను సిద్ధంగా ఉంచారట. ఇది అభిమానులకు శుభవార్తే.

6 వేల టిక్కెట్లు మాత్రమే అమ్మకం
ఏసీఏ-వీడీసీఏ స్టేడియం మొత్తం సామర్థ్యం 32 వేలు. అయితే ఇప్పటివరకు కేవలం 6 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయట. దీంతో విశాఖ యాజమాన్యంకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. టెస్టు సిరీస్‌కు ముందు విజయనగరం వేదికగా దక్షిణాఫ్రికా, బోర్డు ఎలెవన్ మధ్య జరిగిన మ్యాచ్‌ను కూడా వరుణుడు వెంటాడాడు. తొలి రోజు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

రవిశాస్త్రి పర్యవేక్షణలో నెట్ ప్రాక్టీస్
అయితే వర్షం సోమవారం విరామం ఇవ్వడంతో ఇరుజట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసారు. హెడ్‌కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో పేసర్లు మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. రవిశాస్త్రి దగ్గరుండి మరి వీరి బౌలింగ్‌ను గమనించాడు. స్పిన్నర్ అశ్విన్ కూడా బౌలింగ్ చేసాడు. మరోవైపు విరాట్ కోహ్లీ, అంజిక్య రహానే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్‌కు ముందు హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఆటగాళ్ల అందరితో సమావేశం అయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications