For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: తొలి టెస్టులో గెలవాలంటే దక్షిణాఫ్రికాకు 384, కోహ్లీసేనకు 9 వికెట్లు

India vs South Africa 1st Test live score Day 4: South Africa need 384 runs to win, India 9 wickets away

హైదరాబాద్: విశాఖ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఫలితం వచ్చేలా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 9 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఐడెన్ మార్‌క్రమ్(3), డి బ్రుయిన్(5) పరుగులతో ఉన్నారు.

ఐదు రోజుల టెస్టులో ఇంకో రోజు మాత్రమే మిగిలుంది. దీంతో ఈ టెస్టులో దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే 384 పరుగులు చేయాలి... అలా కాకుండా టీమిండియా విజయం సాధించాలంటే ఆఖరి రోజైన ఆదివారం 9వికెట్లు పడగొట్టాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి ఈ టెస్టు ఫలితాన్ని ఊహించొచ్చు.

1
46113

395 పరుగుల భారీ లక్ష్యం

అంతకముందు దక్షిణాఫ్రికా జట్టు టీమిండియా 395 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్‌ శర్మ(127: 149 బంతుల్లో 10ఫోర్లు, 7సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా... పుజారా(81: 148 బంతుల్లో 13ఫోర్తు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో టీమిండియా 67 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 323 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది.

రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడిన భారత బ్యాట్స్‌మెన్

రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడిన భారత బ్యాట్స్‌మెన్

భారత ఆటగాళ్లలో రవీంద్ర జడేజా(40: 32 బంతుల్లో 3సిక్సర్లు), విరాట్‌ కోహ్లీ(31 నాటౌట్‌: 25 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌), రహానె(27 నాటౌట్‌: 17 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌) దూకుడుగా ఆడారు. ఈ ముగ్గురు సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ వన్డే తరహాలో భారీ షాట్లతో చెలరేగారు. అనంతరం ఆధిక్యం 390 దాటగానే రెండో ఇన్నింగ్స్‌ను కోహ్లీ డిక్లేర్‌ చేశాడు.

జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా ఎల్గర్

జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా ఎల్గర్

సఫారీ బౌలర్లలో కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు తీయగా... కగిసో రబాడ, ఫిలాండర్‌లకు చెరో వికెట్ లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టుకు ఆరంభంలోనే రవీంద్ర జడేజా షాకిచ్చాడు. దక్షిణాఫ్రికా

జట్టు స్కోరు 4 పరుగుల వద్ద ఓపెనర్ డీన్ ఎల్గర్(4) రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 431 పరుగుల వద్ద ఆలౌట్

తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 431 పరుగుల వద్ద ఆలౌట్

అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 431 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 385/8తో నాలుగో రోజైన శనివారం ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా మరో 46 పరుగులు జోడించి మిగతా రెండు వికెట్లను కోల్పోయింది.

ఓవర్‌నైట్‌ ఆటగాడు కేశవ్‌ మహరాజ్‌(9) అశ్విన్‌ బౌలింగ్‌లో మయాంక్‌ అగర్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసిన అశ్విన్

తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసిన అశ్విన్

చివర్లో సఫారీ బౌలర్ ముత్తుసామి మాత్రం భారత బౌలర్లను ఎదుర్కొన్న తీరు నిజంగా అద్భుతం. ఈ మ్యాచ్‌లో అతడు 106 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతో 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టెస్టుల్లో అశ్విన్ తానెంత విలువైన బౌలర్‌నో మరోసారి నిరూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ మొత్తం ఏడు వికెట్లు తీసి తన కెరీర్‌లో మరో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 502/7 వద్ద డిక్లేర్డ్

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 502/7 వద్ద డిక్లేర్డ్

రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగడంతో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. సుధీర్ఘ ఫార్మాట్‌లో ఓపెనర్‌గా సక్సెస్ అవుతాడో లేదోనని భావించిన జట్టు మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని రోహిత్ శర్మ నిలబెట్టుకున్నాడు. అంతేకాదు ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఓపెనర్‌గా రెండు సెంచరీలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 502/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, October 5, 2019, 18:05 [IST]
Other articles published on Oct 5, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+