India vs South Africa: దక్షిణాఫ్రికా 431 ఆలౌట్, తొలి ఇన్నింగ్స్‌లో భారత ఆధిక్యం 71

హైదరాబాద్: విశాఖ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 431 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 71 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 385/8తో నాలుగో రోజైన శనివారం ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా మరో 46 పరుగులు జోడించి మిగతా రెండు వికెట్లను కోల్పోయింది.
ఓవర్‌నైట్ ఆటగాడు కేశవ్ మహరాజ్(9) అశ్విన్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌కు క్యాచ్ ఇచ్చి తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. చివర్లో సఫారీ బౌలర్ ముత్తుసామి మాత్రం భారత బౌలర్లను ఎదుర్కొన్న తీరు నిజంగా అద్భుతం. ఈ మ్యాచ్‌లో అతడు 106 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతో 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఏడు వికెట్లతో సత్తా చాటిన అశ్విన్
టెస్టుల్లో అశ్విన్ తానెంత విలువైన బౌలర్‌నో మరోసారి నిరూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ మొత్తం ఏడు వికెట్లు తీశాడు. దీంతో అశ్విన్ కెరీర్‌లో మరో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో ఇలా ఏడు వికెట్లను తీయడం అశ్విన్‌కు ఇది ఐదోసారి కావడం విశేషం. రవీంద్ర జడేజా రెండు వికెట్లు సాధించగా, ఇషాంత్‌కు వికెట్ దక్కింది.

34 పరుగులకే 3 వికెట్లు
కాగా, శుక్రవారం 98 ఓవర్లు ఆడిన దక్షిణాఫ్రికా కేవలం ఐదు వికెట్లు మాత్రమే చేజార్చుకొని అద్భుత ప్రదర్శన చేసింది. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దక్షిణాఫ్రికాను ఓపెనర్ డీన్ ఎల్గర్(160; 287 బంతుల్లో 18 ఫోర్లు, 4సిక్సర్లు), క్వింటన్ డీకాక్(111; 163 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సులు) సెంచరీలతో ఆదుకున్నారు.

స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా
మరోవైపు కెప్టెన్ డుప్లెసిస్ (103 బంతుల్లో 55; 8 ఫోర్లు, 1 సిక్స్) సైతం హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఎల్గర్ ఐదో వికెట్‌కు డుప్లెసిస్‌తో 115 పరుగులు, ఆరో వికెట్‌కు డికాక్‌తో 164 పరుగులు జోడించాడు. స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉండటంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ ఇద్దరితోనే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ వేయించిన సంగతి తెలిసిందే.
తొలి ఇన్నింగ్స్ భారత్ 502/7 వద్ద డిక్లేర్డ్
అంతకముందు టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 502/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసిన సంగతి తెలిసిందే. భారత ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(215) డబుల్ సెంచరీతో చెలరేగగా, రోహిత్ శర్మ(176) సెంచరీ సాధించాడు. ఓపెనర్‌గా తన అరంగేట్ర టెస్టులోనే రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేయడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications