For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs South Africa: మయాంక్ ఔట్, లంచ్ విరామానికి టీమిండియా 35/1

India vs South Africa 1st Test live score Day 4: India lead past 100 after Mayank exit


హైదరాబాద్: విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శనివారం లంచ్ విరామానికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. రోహిత్‌శర్మ(25), పుజారా(2) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన ఆధిక్యాన్ని కలుపుకుని టీమిండియా 106 పరుగుల ముందంజలో ఉంది.

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 431 పరుగులకు ఆలౌట్‌ కాగా భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. జట్టు స్కోరు 21 పరుగుల వద్ద టీమిండియా మయాంక్ అగర్వాల్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో అద్భుత ప్రదర్శన చేసిన మయాంక్‌ అగర్వాల్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఏడు పరుగులకే ఔటయ్యాడు.కేశవ్‌ మహారాజ్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో డుప్లెసిస్‌‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

కేశవ్‌ మహారాజ్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో డుప్లెసిస్‌‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 431 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 71 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 385/8తో నాలుగో రోజైన శనివారం ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా మరో 46 పరుగులు జోడించి మిగతా రెండు వికెట్లను కోల్పోయింది.

1
46113

ఓవర్‌నైట్‌ ఆటగాడు కేశవ్‌ మహరాజ్‌(9) అశ్విన్‌ బౌలింగ్‌లో మయాంక్‌ అగర్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. చివర్లో సఫారీ బౌలర్ ముత్తుసామి మాత్రం భారత బౌలర్లను ఎదుర్కొన్న తీరు నిజంగా అద్భుతం. ఈ మ్యాచ్‌లో అతడు 106 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతో 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

టెస్టుల్లో అశ్విన్ తానెంత విలువైన బౌలర్‌నో మరోసారి నిరూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ మొత్తం ఏడు వికెట్లు తీశాడు. దీంతో అశ్విన్ కెరీర్‌లో మరో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో ఇలా ఏడు వికెట్లను తీయడం అశ్విన్‌కు ఇది ఐదోసారి కావడం విశేషం. రవీంద్ర జడేజా రెండు వికెట్లు సాధించగా, ఇషాంత్‌కు వికెట్‌ దక్కింది.

Story first published: Saturday, October 5, 2019, 12:15 [IST]
Other articles published on Oct 5, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+