For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

56వ ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సలు: అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు

IND vs SA 2019,1st Test : Rohit Sharma 1st Batsman To Hit Twin Hundreds In Maiden Test As Opener
India vs South Africa 1st Test live score Day 4: 3 back to back sixes for Rohit Sharma

హైదరాబాద్: విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డుల మోత మోగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ(176) రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో కదం తొక్కాడు. 133 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు.

ఈ టెస్టులో రోహిత్ శర్మకు ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. మొత్తంగా టెస్టుల్లో రోహిత్ శర్మకు ఇది ఐదో సెంచరీ. ఈ క్రమంలో రోహిత్ శర్మ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక టెస్టులో మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

1
46113
వసీం అక్రమ్ రికార్డు బద్దలు

వసీం అక్రమ్ రికార్డు బద్దలు

తొలి ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు కొట్టిన రోహిత్‌ శర్మ.. రెండో ఇన్నింగ్స్‌లో 7 సిక్సులు బాదాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న పాకిస్థాన్ మాజీ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్(12 సిక్సుల) రికార్డుని రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు.

భారత్ తరుపున అగ్రస్థానంలో

భారత్ తరుపున అగ్రస్థానంలో

ఈ జాబితాలో నాథన్ ఆస్ట్లే(11), బ్రెండన్ మెక్‌కల్లమ్(11), మ్యాథ్యూ హెడెన్(11), బెన్ స్టోక్స్(11) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మరోవైపు భారత్ తరుపున ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 25 ఏళ్ల క్రితం నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ నెలకొల్పిన రికార్డుని బద్దలు కొట్టాడు.

1994లో ఒక మ్యాచ్‌లో

1994లో ఒక మ్యాచ్‌లో

1994లో ఒక మ్యాచ్‌లో సిద్ధూ ఎనిమిది సిక్సర్లు బాదగా అదే ఇప్పటివరకు భారత్ తరుపున అత్యుత్తమ రికార్డు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజైన శనివారం టీ విరామం అనంతరం రోహిత్ శర్మ రెచ్చిపోయి ఆడాడు. సఫారీ బౌలర్ డేన్ పైడిట్ వేసిన ఇన్నింగ్స్ 56వ ఓవర్‌లో రోహిత్ శర్మ హాట్రిక్ సిక్సర్లు బాదాడు.

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మొత్తం 13 సిక్సులు

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మొత్తం 13 సిక్సులు

దీంతో ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మొత్తం 13 సిక్సులు బాదాడు. మరోవైపు మూడు ఫార్మాట్లలో భారత్‌ తరఫున ఒక మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత సిక్సర్ల బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. వన్డేల్లో 16 సిక్సర్లు సాధించిన రోహిత్‌.. అంతర్జాతీయ టీ20ల్లో 10 సిక్సర్లు సాధించాడు.

టెస్టుల్లో ఓపెనర్‌గా బరిలో దిగి

టెస్టుల్లో ఓపెనర్‌గా బరిలో దిగి

ఇదిలా ఉంటే, టెస్టుల్లో ఓపెనర్‌గా బరిలో దిగి ఒకే టెస్టులో రెండు సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా రోహిత్‌ చరిత్ర సృష్టించాడు. సుధీర్ఘ ఫార్మాట్‌లో ఓపెనర్‌గా సక్సెస్ అవుతాడో లేదోనని భావించిన జట్టు మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని రోహిత్ శర్మ నిలబెట్టుకున్నాడు. అంతేకాదు ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఓపెనర్‌గా రెండు సెంచరీలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Story first published: Saturday, October 5, 2019, 16:35 [IST]
Other articles published on Oct 5, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+