Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుమ్రా అమేజింగ్ డెలివరి, డుప్లెసిస్ డకౌట్ (వీడియో)

India vs South Africa, 1st Test Day 4: Jasprit Bumrah Removes Faf du Plessis With An Unplayable Ball

హైదరాబాద్: కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్టుతో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో బుమ్రా తీసిన నాలుగు వికెట్లు కూడా టాపార్డర్‌కు చెందిన ఆటగాళ్లవి కావడం విశేషం.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన మార్కుని చూపించిన బుమ్రా ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్‌ను ఔట్ చేసిన తన తొలి టెస్టు వికెట్‌ను దక్కించుకున్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో సఫారీ బ్యాట్స్‌మెన్‌ను తీవ్రంగా ఇబ్బందిపెట్టాడు.

రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ప్రధాన ఆటగాళ్లు అయిన డివిలియర్స్‌, డుప్లెసిస్‌, డీకాక్‌లను ఔట్ చేసిన జట్టు స్కోరు తక్కువకే పరిమితమయ్యేలా చేశాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో కెప్టెన్ డుప్లెసిస్‌ను బుమ్రా ఔట్ చేసిన తీరుపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

రెండో ఇన‍్నింగ్స్‌లో భాగంగా 29 ఓవర్‌ను వేసిన బూమ్రా.. నాలుగో బంతికి డుప్లెసిస్‌ను ఔట్‌ చేసిన తీరు క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. బంతిని డిఫెన్స్‌ ఆడదామని డుప్లెసిస్‌ అనుకునేలోపే బ్యాట్‌ను అంచును తాకి బంతి వికెట్ కీపర్ సాహా చేతుల్లోకి వెళ్లింది. దాంతో ఒకింత ఆశ్చర్యానికి లోనైన డుప్లెసిస్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Story first published: Monday, January 8, 2018, 19:38 [IST]
Other articles published on Jan 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+