Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేప్‌టౌన్‌ టెస్టు: వర్షం కారణంగా మూడో రోజు ఆట రద్దు

1st Test

హైదరాబాద్: కేప్ టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఆటను అంఫైర్లు రద్దు చేశారు. ఇప్పటికే వర్షం కారణంగా రెండు సెస్షన్లు వాయిదా పడగా.... లంచ్ విరామం సమయానికి వర్షం కాస్త తగ్గినట్లు కనిపించినా.. ఆ తర్వాత మళ్లీ పుంజుకుంది. దీంతో ఆటకు మరోసారి అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత కొంత సమయం వేచిచూసిన అంఫైర్లు ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

కేప్‌టౌన్‌లో వర్షం: ఆలస్యంగా ప్రారంభం కానున్న ఆట

కేప్ టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగుతున్న తొలి టెస్టుకు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. దీంతో మూడో రోజైన ఆదివారం ఆట ఇంకా ప్రారంభం కాలేదు. భారీ వర్షం కురుస్తుండటంతో గ్రౌండంతా కవర్లతో కప్పి ఉంచారు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.

వర్షం ఆగిన తర్వాత మైదానం సిద్ధం అవ్వడానికి కనీసం రెండు గంటలైనా పడుతుంది. దీంతో ఆదివారం మూడు గంటలైనా ఆట జరుగుతుందా? లేదా అనేది అనుమానంగా మారింది. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో సఫారీలు 286 పరుగులు చేసి ఆలౌట్ కాగా టీమిండియా 209 పరుగుల చేసి ఆలౌటైంది.

హార్దిక్‌ పాండ్యా (93) తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 77 పరుగుల ఆధిక్యంలో ఉన్న సఫారీ జట్టుకు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలకు ఓపెనర్లు మంచి ప్రారంభం అందించారు. అయితే దక్షిణాఫ్రికా ఓపెనర్లు ఇద్దరిని పాండ్యా పెవిలియన్‌కు చేర్చిన సంగతి తెలిసిందే.

దీంతో రెండో రోజు ఆట ముగిసే సరికి సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 65/2తో నిలిచింది. రబాడ (2), హషీమ్‌ ఆమ్లా (4) నైట్‌ వాచ్‌మెన్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆతిథ్య దక్షిమాఫ్రికా జట్టు 142 పరుగుల ఆధిక్యంలో ఉంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, January 7, 2018, 19:38 [IST]
Other articles published on Jan 7, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+