India vs South Africa, Day 3: తడబడి నిలిచారు... దక్షిణాఫ్రికా 385/8

హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. రెండో రోజు సఫారీలు మూడు వికెట్లు కోల్పోవడంతో అందరూ టీమిండియా పట్టు బిగించిందని భావించారు. అయితే, ఆటలో భాగంగా మూడోరోజైన శుక్రవారం దక్షిణాఫ్రికా అద్భుతంగా పుంజుకుంది.
34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దక్షిణాఫ్రికాను ఓపెనర్ డీన్ ఎల్గర్(160; 287 బంతుల్లో 18 ఫోర్లు, 4సిక్సర్లు), క్వింటన్ డీకాక్(111; 163 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సులు) సెంచరీలతో ఆదుకున్నారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 118 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 385 పరుగులు చేసింది.
సఫారీలు ఇంకా 117 పరుగుల వెనుకంజలో ఉన్నారు. ముత్తుస్వామి(12), కేశవ్ మహరాజ్(3) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (128/5) ఐదు వికెట్లతో సత్తా చాటగా... రవీంద్ర జడేజా 2, ఇషాంత్ శర్మకు ఒక వికెట్ దక్కింది. స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉండటంతో కెప్టెన్ కోహ్లీ ఆ ఇద్దరితోనే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ వేయించాడు.
ఆదిలోనే దెబ్బకొట్టిన ఇషాంత్ శర్మ
ఓవర్‌నైట్ స్కోరు 39/3తో శుక్రవారం మూడో రోజు ఆట ఆరంభించిన దక్షిణాఫ్రికా జట్టుని ఇషాంత్‌శర్మ ఆదిలోనే దెబ్బకొట్టాడు. బవుమా (18)ను ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ డుప్లెసిస్ (55, 103 బంతులు; 8 ఫోర్లు, సిక్సర్)తో కలిసి ఓపెనర్ డీన్ ఎల్గర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.
ఐదో వికెట్‌కు 115 పరుగులు
వీరిద్దరూ నిలకడగా ఆడుతూ ఐదో వికెట్‌కు 115 పరుగులు జోడించారు. ముఖ్యంగా ఎల్గర్‌కు చక్కటి సహకారం అందిస్తూ అతనిపై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని రవిచంద్రన్ అశ్విన్ విడదీశాడు. అశ్విన్ బౌలింగ్‌లో డుప్లెసిస్ స్లిప్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
ఎల్గర్ సెంచరీ
అనంతరం క్రీజులోకి వచ్చిన డికాక్‌తో కలిసి ఎల్గర్ భారత బౌలర్లును అద్భుతంగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో క్వింటన్ డికాక్(111; 163 బంతుల్లో 16ఫోర్లు, 2సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. పరిమిత ఓవర్ల తరహాలో డికాక్ బౌండరీలు బాదుతూ అత్యంత వేగంగా సెంచరీని సాధించాడు. అయితే, ఈ జోడీని జడేజా విడదీశాడు.
200 వికెట్లు మైలురాయిని అందుకున్న జడేజా
ఓపెనర్ డీన్ ఎల్గర్ (160, 287 బంతుల్లో, 18 ఫోర్లు, 4 సిక్సులు)ను ఔట్ చేశాడు. ఈ క్రమంలో జడేజా ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో 200 వికెట్‌ను దక్కించుకున్నాడు. టెస్టుల్లో 200వ వికెట్ల మైలురాయిని అందుకున్న 10వ బౌలర్‌గా రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఈ టెస్టులో ఇది జడేజాకు రెండో వికెట్.
డీకాక్ ఐదో సెంచరీ
ఈ మ్యాచ్‌కు ముందు 198 వికెట్లతో ఉన్న జడేజా సఫారీ బ్యాట్స్‌మెన్ డానీ పీడ్త్, ఎల్గర్ వికెట్లను తీయడంతో జడేజా ఖాతాలో 200వ టెస్టు వికెట్ చేరింది. ఎల్గర్ ఔటైన కొద్దిసేపటికే అశ్విన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది డీకాక్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో క్వింటన్ డీకాక్‌కు ఇది ఐదో సెంచరీ కావడం విశేషం.
27వ సారి అశ్విన్ ఐదు వికెట్ల హాల్
అయితే, సెంచరీ అనంతరం డికాక్ దూకుడుగా ఆడే క్రమంలో అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్‌బోల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఫిలాండర్ కూడా పెవిలియన్‌కు చేరడంతో ఆఖరి సెషన్‌లో దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది. ఈ టెస్టులో అశ్విన్ 5 వికెట్లు తీయడంతో టెస్టుల్లో 27వ సారి అశ్విన్ ఐదు వికెట్ల హాల్‌ను తీసినట్లైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications