
హైదరాబాద్: కేప్ టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన తడబడింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకే ఆలౌటైంది.28/3 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం రెండో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా ఏ మాత్రం తన దూకుడుని ప్రదర్శించలేకపోయింది.
రెండో రోజు మరో 181 పరుగులు చేసి మిగతా ఏడు వికెట్లను కోల్పోయింది. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (93;95 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్పర్) రాణించడంతో ఆ మాత్రం స్కోరన్నా చేయగలిగింది. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ పాండ్యా తన దైన శైలిలో దూకుడుని ప్రదర్శించి స్కోరు బోర్డుని పరిగెత్తించాడు.
46 బంతుల్లో 10 ఫోర్లతో సాయంతో హాఫ్ సెంచరీ చేసిన పాండ్యా ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడాడు. ఈ క్రమంలో సెంచరీకి ఏడు పరుగుల దూరంలో పాండ్యా తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. మరొకవైపు భువనేశ్వర్ కుమార్ (25; 86 బంతుల్లో 4 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఆ క‍్రమంలోనే పాండ్యాతో కలిసి 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. భువీ, పాండ్యాలు ఎనిమిది పరుగుల వ్యవధిలో ఔట్ కావడంతో అతికష్టం మీద రెండొందల పరుగుల మైలురాయిని అందుకుంది.
దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలిండర్, రబడాలు చెరో మూడు వికెట్లు తీయగా, డేల్ స్టెయిన్, మోర‍్నీ మోర్కెల్‌లు తలో రెండు వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 77 పరుగుల వెనుకంజలో ఉంది.
నిరాశపరిచిన రోహిత్ శర్మ
కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లోరెండో రోజులో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. వారి ధాటికి నిలదొక్కుకోవాలని బాగా ప్రయత్నించి రోహిత్ శర్మ విఫలమైయ్యాడు.
రోహిత్ శర్మ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రవిచంద్రన్ అశ్విన్ పదకొండు బంతులకు పది పరుగులు తీశాడు. అంతే తర్వాత నుంచి దక్షిణాఫ్రికా బౌలర్లు టార్గెట్ చేయడంతో పరుగులు ముందుకు సాగడం లేదు.
ప్రస్తుతం భారత్ స్కోరు 76/4 (36.0)ఓవర్లు
రెండో రోజు రోహిత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులను నిరుత్సాహపరిచాడు. మ్యాచ్ ఆరంభమైనప్పటి నుంచి నిదానంగా ఆచితూచి అడుగేసిన కగిసో రబడ వేసిన బంతికి ఎల్బీడబ్ల్యూ కింద అవుట్ అయ్యాడు. ఇక్కడితో 59 బంతులు ఆడిన రోహిత్ 11పరుగులు తీసి అవుటయ్యాడు.
రెండో రోజులో భాగంగా శుక్రవారం బ్యాటింగ్‌కు దిగిన భారత్ తడబడి మూడు వికెట్లను కోల్పోగా శనివారం ఆట మొదలైనప్పటి నుంచి ఆచితూచి అడుగులేస్తుంది.
దక్షిణాఫ్రికా బౌలర్లు భారత వికెట్లను ఒకొక్కటిగా పడేసేందుకు ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నారు. మరి కొద్ది నిమిషాల్లో మొదలౌతున్న మ్యాచ్‌కు ఇరు జట్ల ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. వీరితో పాటు కేప్‌టౌన్ లోని న్యూలాండ్స్ స్టేడియంలో ప్రేక్షకులు సైతం మ్యాచ్ ఎప్పుడూ మొదలౌతుందా అన్న ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
ఇండియా vs దక్షిణాఫ్రికా 2018 తొలి టెస్టు స్కోరు కార్డు
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో అందరూ ఊహించినట్లే భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. పేస్ బౌలర్లకి స్వర్గధామమైన కేప్‌టౌన్ పిచ్‌పై సఫారీ ఫాస్ట్ బౌలర్ల ధాటికి ఓపెనర్లు మురళీ విజయ్ (1), శిఖర్ ధావన్ (16), కెప్టెన్ విరాట్ కోహ్లి (5) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిపోయారు.
దీంతో తొలి రోజైన శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 28/3తో కష్టాల్లో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో ఛతేశ్వర్ పుజారా (5), రోహిత్ శర్మ (0) పరుగులతో ఉన్నారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా ఇంకా 258 పరుగుల వెనుకంజలో ఉంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.