For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికాతో తొలి టీ20: కుర్రాళ్లతో బరిలోకి ఇరు జట్లు.. ఆరంభం ఎవరిది?

India vs South Africa 1st T20I: India Predicted XI, Weather Report, Pitch, India to go with three spinners in Dharamsala

ధర్మశాల: కరీబియన్‌ పర్యటనలో వెస్టిండీస్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన టీమిండియా స్వదేశంలో సుదీర్ఘ క్రికెట్‌ సీజన్‌కు సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌తో ఈ సీజన్‌కు శ్రీకారం చుట్టనుంది. మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఆదివారం ధర్మశాలలో తొలి టీ20 జరగనుంది. యువకులు, సీనియర్లతో అన్ని విభాగాల్లో పటిష్ఠంగా కనిపిస్తున్నటీమిండియా విజయంతో బోణీ చేయాలనుకుంటోంది. మరోవైపు డికాక్‌ నేతృత్వంలో దక్షిణాఫ్రికా జట్టు పునర్నిర్మాణ దశలో ఉంది. సీనియర్లు లేకపోవడంతో అనుభవం లేని ఆటగాళ్లతో బరిలోకి దిగబోతోంది. దీంతో ఆతిథ్య జట్టుకు ప్రొటీస్ ఏమేరకు పోటీనిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఓపెనర్‌గా ఎవరు?:

ఓపెనర్‌గా ఎవరు?:

వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌వరకు భారత జట్టు మరో 17 మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో ఇప్పటి నుంచే సన్నాహకాలను ఆరంభించనుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా సిరీస్‌లో తమ బలాబలాలను పరీక్షించుకోవాలనుకుంటోంది. అందుకే ఈ సిరీస్‌లో భారత్ ఎక్కువగా యువ ఆటగాళ్లను పరీక్షిస్తోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్‌లలో ఎవరు ప్రారంభిస్తారో చూడాలి. ఇద్దరి ఫామ్, పరిస్థితి ఒకేలా ఉన్నా.. ధావన్‌ వైపే జట్టు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఇక కెప్టెన్ విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ కీలకంగా మారనుంది.

పాండేను కొనసాగిస్తారా?:

పాండేను కొనసాగిస్తారా?:

మిడిలార్డర్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషభ్‌ పంత్‌ తమ స్థానాలను పటిష్టం చేసుకునేందుకు ఇది చక్కటి అవకాశం. ముఖ్యంగా పంత్‌ క్రీజులో కుదురుకోవాల్సిన అవసరం ఉంది. కరీబియన్ టూర్‌లో విఫలమైన పాండేకు మరో అవకాశం ఇస్తారా.. లేక వన్డేల్లో అదరగొట్టిన అయ్యర్‌ను తుది జట్టులో తీసుకుంటారా అనేది చూడాలి. ఆ తర్వాత పాండ్యా బ్రదర్స్.. హార్దిక్, కృనాల్ బ్యాటింగ్‌కు వస్తారు.

యువకులకు బౌలింగ్ బాధ్యతలు:

యువకులకు బౌలింగ్ బాధ్యతలు:

బౌలింగ్‌ విభాగంలో సీనియర్ పేసర్లు బుమ్రా, షమీ, భువీలకు విశ్రాంతినివ్వగా.. స్పిన్నర్లు చాహల్‌, కుల్దీప్‌లను తప్పించారు. దీంతో యువ ఫాస్ట్‌బౌలర్లు నవ్‌దీప్ సైనీ, దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్ పేస్ బౌలింగ్ బాధ్యతలు మోయనున్నారు. ధర్మశాల వికెట్ పేసర్లకు సహకరించే అవకాశాలున్నా.. సొంతగడ్డపై ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లతో బరిలోదిగే అవకాశాలు తక్కువే. దీంతో దీపక్, ఖలీల్‌లో ఒకరు బెంచ్‌కే పరిమితమవ్వాల్సి ఉంటుంది. వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, రవీంద్ర జడేజా స్పిన్ భారం మోయనున్నారు. సుందర్, జడేజాలు కొనసాగే అవకాశం ఉంది.

సఫారీలకు సవాల్:

సఫారీలకు సవాల్:

దక్షిణాఫ్రికా ప్రపంచకప్ అనంతరం మొత్తం జట్టును ప్రక్షాళన చేసింది. స్టార్ ఆటగాడైన డుప్లెసిస్‌కు అసలు జట్టులోకే ఎంపిక చేయలేదు. డుప్లెసిస్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు డికాక్‌కు అప్పగించింది. డికాక్‌ సారథ్యంలోని దక్షిణాఫ్రికాకు అనుభవ లేమి పెద్ద సమస్య. గతంలో భారత్‌లో ఆడిన అనుభవం ఉన్న డికాక్, డేవిడ్ మిల్లర్, రబడనే ఇప్పుడు జట్టులో సీనియర్లు. వాన్‌ డెర్‌ డసెన్‌, జూనియర్ డాలా, డసెన్, ప్రిటోరియస్‌, బవుమా, నోర్జేలను నమ్ముకుంది. సీనియర్ల గైర్హాజరీలో కొత్త కుర్రాళ్లు ఏ మేరకు సత్తా చాటుతారనేది కీలకం.

తుది జట్లు (అంచనా):

తుది జట్లు (అంచనా):

భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధవన్/కేఎల్ రాహుల్, మనీష్ పాండే, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజా/రాహుల్ చాహర్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చహర్/ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ.

దక్షిణాఫ్రికా: డికాక్ (కెప్టెన్), హెండ్రిక్స్, బవుమా, డసెన్, మిల్లర్, ఫెలుక్వాయో, ప్రిటోరియస్, నోర్జే, రబాడ, జూనియర్ డాలా, షంసి.

Story first published: Sunday, September 15, 2019, 10:33 [IST]
Other articles published on Sep 15, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+