న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికా vs భారత్ తొలి టీ20.. టాస్‌కు వర్షం అంతరాయం

India vs South Africa 1st T20I: Heavy Rain In Darmashala, Toss delayed due to rain

ధర్మశాల: మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. టాస్ వేసే సమయానికి చిరు జల్లులు కురవడంతో.. అంపైర్‌లు టాస్‌ను నిలిపివేశారు. వర్షం కారణంగా మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఉదయం నుంచి ధర్మశాలలో చిరు జల్లులు కురుస్తున్నాయి. ప్రస్తుతం మైదానంలో వర్షం బాగా కురుస్తోంది. మధ్యలో కొంత సమయం విరామం ఇచ్చిన వర్షం మళ్లీ ఎక్కువైంది. దీంతో పిచ్ మొత్తంను కవర్లతో కప్పి ఉంచారు. వర్షం నిలిచినా.. మైదానాన్ని తయారు చేయడానికి సమయం పట్టనుంది.

యాషెస్ ఐదో టెస్టు: ఆస్ట్రేలియాకు భారీ లక్ష్యం.. 56 పరుగులకే 3 వికెట్లుయాషెస్ ఐదో టెస్టు: ఆస్ట్రేలియాకు భారీ లక్ష్యం.. 56 పరుగులకే 3 వికెట్లు

2015లో భారత్‌ పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా 2-0తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. స్వదేశంలో ఇప్పటివరకు సఫారీలతో టీమిండియా 6 టీ20ల్లో తలపడగా.. కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసింది. ఇక టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇప్పటివరకు 13 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఎనమిది మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా.. ఐదు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిచింది.

ఇప్పటికే టీ20ల్లో అత్యధిక పరుగులు, సెంచరీలు, సిక్సర్లు బాదిన ఆటగాడిగా 'హిట్‌మ్యాన్‌' రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇక టీ20 ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించడానికి 84 పరుగుల దూరంలో నిలిచాడు. ప్రస్తుతం 424 పరుగులతో న్యూజిలాండ్‌ ఆటగాడు మార్టిన్‌ గప్తిల్‌ దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా రికార్డుల్లో ఉన్నాడు. రోహిత్‌ 340 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 2015లో ఇక్కడ ఇదే దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ సెంచరీ చేసాడు.

తుది జట్లు (అంచనా):
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధవన్/కేఎల్ రాహుల్, మనీష్ పాండే, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజా/రాహుల్ చాహర్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చహర్/ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ.

దక్షిణాఫ్రికా: డికాక్ (కెప్టెన్), హెండ్రిక్స్, బవుమా, డసెన్, మిల్లర్, ఫెలుక్వాయో, ప్రిటోరియస్, నోర్జే, రబాడ, జూనియర్ డాలా, షంసి.

Story first published: Sunday, September 15, 2019, 19:38 [IST]
Other articles published on Sep 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X