
హైదరాబాద్: ఏడు నెలల విరామం అనంతరం భారత మహిళా క్రికెట్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టనుంది. మిథాలీరాజ్ నాయకత్వంలోని జట్టు, వాన్ నీకెర్క్ సారథ్యంలోని సఫారీలతో తలపడేందుకు సిద్ధమైంది.
ఓ వైపు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న కోహ్లీ సేన సఫారీ జట్టుపై దూసుకుపోతుంటే ఇప్పుడు మహిళా జట్టు సైతం వారితో సమరానికి సై అంటోంది. ఇందులో భాగంగా సోమవారం నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ (ఫిబ్రవరి 5, 7, 10) మొదలవుతుంది.
ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత్..ఆ తర్వాత మరే అంతర్జాతీయ టోర్నీలోనూ ఆడలేదు. ఇక ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2021కి అర్హత సాధించేందుకు ఈ మూడు వన్డేల సిరీస్ ఇరుజట్లకూ ఒక చక్కటి అవకాశం కానున్నది. దక్షిణాఫ్రికాతో ఆడటం పెద్ద సవాల్ లాంటిదని, జట్టులోని ఆటగాళ్లు తిరిగి పుంజుకోవడానికి ఇదొక మంచి అవకాశమని భారత కెప్టెన్ మిథాలీ తెలిపింది.
మహిళల క్రికెట్‌కు ఇప్పుడు ఆదరణ పెరుగుతున్నది. మేము ఆడే ప్రతి మ్యాచ్‌ను అభిమానులు, విమర్శకులు, దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నారు. ఇది మాపై మరింత బాధ్యతను పెంచింది. దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్టుతో ఆడటం వల్ల మా సామర్థ్యాలను పరీక్షించుకోవచ్చు. బౌలర్లు కూడా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌లో సత్తాచాటాలి. అని మిథాలీ పేర్కొన్నది.
జట్టులో యువకెరటంపైనే అన్ని ఆశలు:
17 ఏళ్ల ముంబై విద్యార్థిని జెమీమా రోడ్రిగ్యుజ్. అండర్-19 మహిళల దేశవాళీ టోర్నీలో డబుల్ సెంచరీ సాధించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ ఆరంభంలో ఫుట్‌బాల్, హాకీలోనూ సత్తా చాటింది. ఓపెనర్ గా , ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా సత్తా చాటుతున్న జెమీమానే జట్టు మొత్తంలో పిన్న వయస్కురాలు.మహారాష్ట్ర అండర్-17 మహిళల హాకీ జట్టుకు ప్రాతినిథ్యం వహిచింది. ఆ తర్వాత పూర్తిగా క్రికెట్‌పైనే దృష్టి పెట్టి రికార్డులు కొల్లగొడుతుంది.
జట్ల వివరాలు:
ఇండియా: Mithali Raj (captain), Taniya Bhatia (wicket-keeper), Ekta Bisht, Rajeshwari Gayakwad, Jhulan Goswami, Harmanpreet Kaur (vice-captain), Veda Krishnamurthy, Smriti Mandhana, Mona Meshram, Shikha Pandey, Punam Raut, Jemimah Rodrigues, Deepti Sharma, Pooja Vastrakar, Sushma Verma (wicket-keeper) and Poonam Yadav.
దక్షిణాఫ్రికా: Dane van Niekerk (capt), Marizanne Kapp, Trisha Chetty, Shabnim Ismail, Ayabonga Khaka, Masabata Klaas, Sune Luus, Laura Wolvaardt, Mignon du Preez, Lizelle Lee, Chloe Tryon, Andrie Steyn, Raisibe Ntozakhe and Zintle Mali.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.